Yoga Day 2025 : విశాఖ తీరంతో యోగాంధ్ర సెలబ్రేషన్స్ (Photos)
విశాఖ సముద్ర తీరంలో యోగాంధ్ర వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అంతర్జాతీయ యోగా డే 2025 ని పురస్కరించుకుని విశాఖలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునే ప్రజలు ఈ కార్యక్రమం కోసం తరలివచ్చారు.

Yogandhra Celebrations in Visakhapatnam
యోగా డే 2025 విశాఖ సముద్ర తీరంలో యోగాంధ్ర వేడుకలు నిర్వహించారు. ఇందులో భారీగా ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు.
Yogandhra Celebrations in Visakhapatnam
తెల్లవారుజామునే ఆర్కే బీచ్ కు చేరుకున్న ప్రజలు వివిధ యోగాసనాలు వేశారు.
Yogandhra Celebrations in Visakhapatnam
ఈ యోగాంధ్ర వేడుకలకు యువత కూడా భారీగా తరలివచ్చారు. భారతీయ సాంప్రదాయ యోగాను ప్రాక్టీస్ చేశారు.
Yogandhra Celebrations in Visakhapatnam
యోగా డేను సందర్భంగా ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు దాదాపు 20 కిలోమీటర్లు కంపార్ట్ మెంట్స్ ఏర్పాటుచేశారు. ప్రతిచోట యోగా ట్రైనర్స్ ను అందుబాటులో ఉంచారు.
Yogandhra Celebrations in Visakhapatnam
విశాఖ యోగా డే వేడుకల్లో స్కూల్ విద్యార్థులు, కాలేజీ యువతక కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. సాగర తీరంలో యోగా సాధన చేశారు.
Yogandhra Celebrations in Visakhapatnam
యోగా డే సందర్భంగా ప్రజలు వివిధ ఆసనాలు వేశారు. ఇంకా చీకటిచీకటిగా ఉండగానే విశాఖ తీరానికి చేరుకుని యోగా సాధన ప్రారంభించారు.
Yogandhra Celebrations in Visakhapatnam
ఇక ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో సహా ఇతర ప్రజాప్రతినిధులు కూడా ప్రజలతో కలిసి యెగాసనాలు వేశారు.
Yogandhra Celebrations in Visakhapatnam
యోగాంధ్ర వేడుకల్లో భాగంగా విశాఖలో విద్యార్థులు సూర్యనమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు సాధించారు.
Yogandhra Celebrations in Visakhapatnam
విశాఖపట్న ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో 25 వేలమంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేశారు.
Yogandhra Celebrations in Visakhapatnam
అల్లూరి జిల్లాకు చెందిన విద్యార్థులు యోగసనాలతో రికార్డు నెలకొల్పారు. ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ నిర్వహించింది.
Yogandhra Celebrations in Visakhapatnam
విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు.