MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Flight Ticket Refund: విమానం క్యాన్సిల్‌ అయ్యిందా...అయితే పూర్తి రీఫండ్‌ ఇలా పొందండి!

Flight Ticket Refund: విమానం క్యాన్సిల్‌ అయ్యిందా...అయితే పూర్తి రీఫండ్‌ ఇలా పొందండి!

విమాన రద్దుల్లో ప్రయాణికులకు వందశాతం రీఫండ్ రావాలంటే ఏమి చేయాలి, ఎలా అభ్యర్థించాలి అన్న వివరాలు ఇక్కడ చదవండి.

2 Min read
Author : Bhavana Thota
Published : Jun 21 2025, 01:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
విమాన రద్దులు ...ప్రయాణికుల ఆర్థిక ఇబ్బందులు
Image Credit : social media

విమాన రద్దులు ...ప్రయాణికుల ఆర్థిక ఇబ్బందులు

ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం చక్రం విరిగిన ఘటన తర్వాత దేశవ్యాప్తంగా విమాన భద్రతపై తీవ్రంగా దృష్టి పెట్టింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA). అన్ని ఎయిర్‌లైన్స్‌పై తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో, పలు విమాన సంస్థలు తమ షెడ్యూల్‌లు తాత్కాలికంగా రద్దు చేయాల్సి వచ్చింది. దీని ప్రభావంతో ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాసా ఎయిర్, విస్తారా, అలయన్స్ ఎయిర్ సంస్థలు తమ విమానాలను రద్దు చేశాయి.వాతావరణం, సాంకేతిక లోపాలు, సిబ్బంది లభ్యత వంటి అంశాలు ఈ రద్దులకు కారణాలవుతున్నాయి. దీనివల్ల ప్రయాణికులు అకస్మాత్తుగా తమ టికెట్ రద్దయినట్లు తెలుసుకొని, డబ్బు ఎలా తిరిగి రాబట్టాలన్న సందిగ్ధంలో పడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ప్రభుత్వ నిబంధనలు – ప్రయాణికులకు రక్షణ
Image Credit : social media

ప్రభుత్వ నిబంధనలు – ప్రయాణికులకు రక్షణ

DGCA ప్రకారం విమాన సంస్థ తప్పిదం వల్ల రద్దయితే ప్రయాణికుడికి శాతం రీఫండ్ రావాలి. ప్రయాణంలో ఆలస్యం వల్ల రాత్రి అవసరమైతే, భోజనం, హోటల్ ఖర్చులను సంస్థే భరించాలి. ఈ నిబంధనలు చట్టబద్ధంగా అమలులో ఉన్నవి.

37
ఎయిర్‌లైన్ సంస్థల రీఫండ్ విధానాలు ఇలా ఉన్నాయి:
Image Credit : Social Media

ఎయిర్‌లైన్ సంస్థల రీఫండ్ విధానాలు ఇలా ఉన్నాయి:

ఎయిర్ ఇండియా: ‘Manage Booking’ సెక్షన్ ద్వారా రీఫండ్ అభ్యర్థించవచ్చు. స్టేటస్ ట్రాక్ చేయొచ్చు.

ఇండిగో: ‘6Eskai’ చాట్‌బాట్ ద్వారా డిటైల్స్ ఇచ్చి రీఫండ్ కోసం అప్లై చేయవచ్చు.

విస్తారా: నేరుగా సంస్థ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసినవారికి ఆటోమేటిక్‌ రీఫండ్.

స్పైస్‌జెట్: వెబ్‌సైట్‌లో PNR నెంబర్‌తో లాగిన్‌ అయ్యి రీఫండ్ అభ్యర్థించవచ్చు.

ఆకాసా ఎయిర్: "My Bookings"లో అప్లై చేస్తే, 5–7 పని రోజుల్లో డబ్బు లభిస్తుంది.

అలయన్స్ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్: ఆన్‌లైన్‌ ద్వారా రీఫండ్ అభ్యర్థనలు తీసుకుంటారు.

47
రీఫండ్ ఆలస్యం అయితే ఏమి చేయాలి?
Image Credit : our own

రీఫండ్ ఆలస్యం అయితే ఏమి చేయాలి?

ముందుగా కస్టమర్ కేర్‌ను సంప్రదించండి (PNR నెంబర్‌తో).

సమస్య పరిష్కారం కాకపోతే DGCA AirSewa పోర్టల్‌ (www.airsewa.gov.in) ద్వారా ఫిర్యాదు చేయండి.

డెబిట్/క్రెడిట్ కార్డ్ చెల్లింపైతే బ్యాంక్‌ను సంప్రదించి చార్జ్‌బ్యాక్ (Chargeback) అభ్యర్థించవచ్చు.

సోషల్ మీడియాలో అధికారిక ఖాతాలకు ట్యాగ్ చేస్తే వేగవంతమైన స్పందన వస్తుంది.

57
ప్రయాణికులు పాటించవలసిన ముఖ్య సూచనలు:
Image Credit : our own

ప్రయాణికులు పాటించవలసిన ముఖ్య సూచనలు:

టికెట్, చెల్లింపు డిటైల్స్, PNR నెంబర్ భద్రంగా ఉంచండి.

సంస్థ రీఫండ్ విధానాలు చదవండి, వాటిని అనుసరించండి.

ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌ను తరచూ చెక్ చేయండి.

అవసరమైతే AirSewa లో అకౌంట్‌ క్రియేట్ చేసుకోండి.

67
తక్కువ సమయానికే పూర్తి చేయగలిగే ప్రక్రియ
Image Credit : our own

తక్కువ సమయానికే పూర్తి చేయగలిగే ప్రక్రియ

ఇప్పటి విమాన సంస్థలు రీఫండ్ వ్యవస్థను పూర్తిగా డిజిటల్‌గా మార్చాయి. ఏ సంస్థ అయినా – నేరుగా బుక్ చేసిన టికెట్‌కు రీఫండ్ పొందడం సాధ్యమే. సరైన సమాచారం ఆధారంగా ముందడుగు వేస్తే, విమాన రద్దుల సమయంలో కూడా ప్రయాణికులు ఆర్థిక నష్టాన్ని నివారించవచ్చు.

77
సమస్యలు లేకుండా రీఫండ్ పొందాలంటే:
Image Credit : Getty

సమస్యలు లేకుండా రీఫండ్ పొందాలంటే:

బుకింగ్ సమయంలో ఇచ్చిన ఈమెయిల్ & మొబైల్ నెంబర్ సరిగ్గా ఉన్నాయా చెక్ చేయండి.ఎప్పటికప్పుడు ఫ్లైట్ స్టేటస్ చెక్ చేస్తూ ఉండండి.విమాన సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే ఎక్కువగా బుక్ చేయండి.ఎటువంటి ఆలస్యం వచ్చినా స్క్రీన్‌షాట్ లేదా రికార్డ్ ఉంచుకోవడం మంచిది.రీఫండ్ తీసుకున్న తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్‌ చెక్ చేయండి.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Related Stories
Recommended image1
Business Ideas: 30 రోజుల్లో ల‌క్ష రూపాయలు ఎలా సంపాదించాలి? చాట్ జీపీటీ ఇచ్చిన బెస్ట్ ఐడియాస్ ఇవే
Recommended image2
Business Ideas: తక్కువ శాలరీకే పని చేస్తున్నారా? అయితే ఈ 4 వ్యాపారాలు చేస్తే తిరుగే ఉండదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved