నిర్మాతకు 1300 కోట్లు నష్టం తెచ్చిన భారీ బడ్జెట్ డిజాస్టర్ మూవీ ఏదో తెలుసా?
సినిమా ప్లాప్ అయితే నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్ కు భారీగా నష్టాలు వస్తుంటాయి. కొన్ని సినిమాలకు మొక్కుబడిగా లాభాలు వస్తుంటాయి. కాని ఒక సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆ ప్రొడ్యూసర్ కు దాదాపు 1300 కోట్లకుపైగా నష్టం వచ్చిందట. ఇంతకీ ఎంటా సినిమా?

ప్రతి శుక్రవారం థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ.. ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న తరుణంలో, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు రంగంలోకి దిగి, ప్రేక్షకులను తమవైపు తిప్పుకున్నాయి. ఓటీటీల ప్రభావం థియేటర్ రిలీజ్ ల రిజల్ట్ పై గట్టిగా ప్రభావం చూపుతోంది.
పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో సినిమాలు తెరకెక్కుతున్నప్పటికీ, భారీ బడ్జెట్‌తో రూపొందిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం చూడకతప్పడంలేదు. అలాంటి డిజాస్టర్ మూవీల్లో ఒకటి ‘జాన్ కార్టర్’.
జాన్ కార్టర్ అనే అమెరికన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా 2012లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈసినిమాకు ఆండ్రూ స్టాంటన్ అనే ఫేమస్ డైరెక్టర్ దర్శకత్వం వహించగా, వాల్ట్ డిస్నీ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు.
ఈ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలు ఉండటమే కాకుండా, హాలీవుడ్‌లోనే సాంకేతికంగా ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కించామంటూ ప్రచారం చేశారు. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.
జాన్ కార్టర్ సినిమా కోసం దాదాపుగా 250 మిలియన్ డాలర్ల బడ్జెట్ ను ఖర్చు చేశారు నిర్మాతలు. అంతే ఇండియన్ రూపీస్ లో 2,171 కోట్ల బడ్జెట్ తో ఈసినిమా నిర్మించబడింది. అప్పట్లో ఇంత బడ్జెట్ అంటే చాలా పెద్ద సినిమా అని చెప్పాలి.
ఈమూవీ భారీగా కలెక్షన్లు రాబడుతుంది అనుకుంటే.. థియేటర్లలో ఘోరంగా ప్లాప్ అయ్యి, డిస్నీకి 1,393 కోట్లు నష్టం తీసుకువచ్చింది. వరల్డ్ సినిమా హిస్టరీలో ఇప్పటి వరకు ఏ సినిమాతోనూ జరగనంత నష్టం, ఈసినిమాతో డిస్నీ వారు చూడాల్సి వచ్చింది
జాన్ కార్టర్ మూవీలో వీఎఫ్ఎక్స్ (VFX), విజువల్స్ అద్భుతంగా ఉన్నా కూడా, సినిమా స్టోరీలైన్, స్క్రీన్ ప్లే , మార్కెటింగ్ లో మూవీ టీమ్ కంప్లీట్ గా ఫెయిల్ అయినట్టు తెలుస్తోంది. అంతే కాదు సినిమా టీమ్ మార్కెటింగ్ వ్యూహాల్లో తడబాటు ఈసినిమాకు పెద్ద మైనస్ గా నిలిచింది. ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను చూడటానికి ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.
ఇతర దేశాల మార్కెట్లలో కూడా ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేశారు. కాని వారు అనుకున్నదంతా తలకిందులయ్యింది. ఈసినిమా రిలీజ్ తరువాత కొన్ని ప్రాంతాల్లో యావరేజ్ టాక్ వచ్చింది. చిన్నగా కలెక్షన్లు పడిపోయాయి. సినిమా వర్కౌట్ కాకపోవడం వల్ల డిస్నీ కంపెనీకి ఇది మర్చిపోలేని సినిమాగా నిలిచింది.
కేవలం భారీ బడ్జెట్ పెట్టడమే కాదు, సినిమాకు సరైన కథ, స్క్క్రీన్ ప్లే, ఆడియన్స్ తో అనుబంధం, ప్రతీ పాయింట్ ను అర్ధం అయ్యేలా సినిమాను చేయగలిగితే బాగుండేది అనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తం అయ్యింది. అంతే కాదు ఏదో సినిమా తీశాం, ప్రమోషన్ చేశాం అనుకుంటే ఎంత పెద్ద సినిమాకు అయినా ఇలాంటి దెబ్బలు తప్పువు అంటున్నరు సినిమా జనాలు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద సినిమా అయినా సరే.. ప్రేక్షకుల ఆదరణ లేకపోతే అది ఓ డిజాస్టర్ గా మిగిలిపోక తప్పుదు అని జాన్ కార్టర్ మూవీ మరోసారి రుజువు చేసింది.