ప్రస్తుత ఆందోళనకర సమయంలో ప్రపంచానికి యోగా శాంతిసందేశం ఇస్తోందని ప్రధాాని నరేంద్ర మోదీ అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ప్రధాని ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

Yoga Day 2025 : అంతర్జాతీయ యోగా డే 2025 వేడుకలకు విశాఖ నగరం సిద్దమయ్యింది. ఇప్పటికే విశాఖ సముద్ర తీరానికి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు భారీగా చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం విశాఖకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ యోగా డే వేడుకల కోసం విశాఖకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా విశాఖలోని ఆర్కే బీచ్ లో ఏర్పాటుచేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  ప్రసంగించారు. ముందుగా ప్రజలందరికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాారు. 11 వసారి ప్రపంచంమొత్తం యోగా చేస్తోందన్నారు. యోగా అర్థం కలపడం... ఇది ప్రపంచాన్ని ఒక్కటి చేసిందన్నారు ప్రధాని మోదీ.

యోగా యాత్రను పరిశీలిస్తే అనేక విషయాలు గుర్తుకువస్తాయన్నారు. ఐక్యరాజ్యసమితిలో యోగాకు ఆమోదం లభించినపుడు 175 దేశాలు మద్దతుగా నిలిచాయన్నారు. ఇలాంటి మద్దతు లభించడం సామాన్య విషయం కాదన్నారు... ఇది మానవకల్యాణం కోసం జరిగిందన్నారు 11 ఏళ్ళ తర్వాత యోగా కోట్ల మంది జీవనంలో భాగమయ్యిందని... దివ్యాంగులు కూడా బ్రెయిలీలో యోగా గురించి చదువుతున్నారు... శాస్త్రవేత్తలు అంతరిక్షంలో యోగా చేసారన్నారు.

 

Scroll to load tweet…

 

సిడ్నీ అయినా, ఎవరెస్ట్ అయినా, సముద్ర ఒడ్డున అయినా... ప్రతి చోట యోగా చేసుకోవచ్చు... దీనికి హద్దులు లేవన్నారు ప్రధాని మోదీ. యోగా చేసేందుకు బ్యాగ్రౌండ్ అవసరం లేదు... వయసుతో పనిలేదు... ఇది అందరిది అని ప్రధాని అన్నారు.

ఇవాళ మనందరం విశాఖపట్నంలో ఉండటం ఆనందంగా ఉంది. ఈ విశాఖ ప్రకృతి, అభివృద్ధి ల సంగమం అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు అభినందనలు.. వీరి నేతృత్వం యోగాంధ్ర అద్భుతంగా జరుగుతోందన్నారు. ఇక నారా లోకేష్ ను కూడా ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు. సమాజంలోని ప్రతి వర్గాన్ని యోగాతో కలపడం ఎలాగో లోకేష్ చేసి చూపించారన్నారు. లోకేష్ చేసిన పనిని ఓ నమూనాగా తీసుకోవాలని అన్నారు.

2 కోట్లకు మంది యోగాంధ్రలో భాగస్వామ్యం అవడం ఆనందదాయకమని అన్నారు. ప్రజలు స్వతహాగా ముంందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని పేర్కొన్పారు. వన్ ఎర్త్ వన్ హెల్త్ థీమ్ తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. మొదట మన హెల్త్ నుండి ప్రకృతి, సమాజం, భూగోళం అనే భావనను యోగా తీసుకువస్తుందని అన్నారు. ఇలా నా అనే భావన నుండి మా అనుకునే స్థాయికి తీసుకెళుతుంది... ఇదే భారత ఆత్మగా మోదీ పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో అశాంతి పెరుగుతోంది... ఈ యోగా ద్వారా శాంతి మార్గాన్ని సూచిస్తున్నామని అన్నారు. ప్రపంచ దేశాలకు యోగా డే సందర్భంగా శాంతిని కోరుతున్నానని ప్రధాని మోదీ అన్నారు.

ప్రపంచంలో యోగా గురించి పెద్దపెద్ద ప్రయోగాలు జరుగుతున్నాయని అన్నారు. దేశంలో మెడికల్, రీసెర్చ్ సంస్థలు యోగా ప్రయోగాలు చేస్తున్నాయని అన్నారు. డిల్లీలోని ఎయిమ్స్ రీసెర్చ్ ద్వారా యోగా గుండె, నరాలు సంబంధిత సమస్యలను తగ్గిస్తుందని తేలిందన్నారు. ఇలాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు యోగా ద్వారా లభిస్తాయని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఒబిసిటి పెరుగుతోంది.... ఇది ఛాలెంజింగ్ మారిందన్నారు. ఇటీవల మన్ కీ బాత్ లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించానని ప్రధాని అన్నారు. అందుకే అహారంలో 10 శాతం ఆయిల్ తగ్గించే ఛాలెంజ్ ఇచ్చానని.. ఇందులో ప్రజలు పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఒబిసిటిపై అవగాహన కల్పించాలని... అన్ హెల్తీ ఫుడ్ కు దూరంగా ఉండాలని సూచించారు. మీ రోజును యోగాతో ప్రారంభించాలని ప్రధాని మోదీ సూచించారు.