IND vs ENG: భారత టాపార్డర్ రాణించడంతో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 471 పరుగులకు ఆలౌట్ అయింది. యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్ లు సెంచరీలతో అదరగొట్టారు.

India vs England: లీడ్స్ లోని హెడింగ్‌లీ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 471 పరుగులకు ఆలౌట్ అయింది. 500+ పరుగులు చేస్తుందనకుంటున్న సమయంలో భారత్ చివరి 41 పరుగుల్లోనే 7 వికెట్లు కోల్పోయింది. అయితే, టాపార్డర్ రాణించడంతో తొలి ఇన్నింగ్స్ టీమిండియా మంచి స్కోర్ చేసింది.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత, భారత జట్టులో నూతన యుగం ఆరంభమైంది. కఠినమైన ఇంగ్లాండ్ పిచ్ లపై భారత బ్యాటర్లు ఎలా రాణిస్తారో అనే చర్చ మధ్య కొత్త కెప్టెన్ శుభ్ మన్ గిల్, యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుతమైన ఆటతో సెంచరీలు సాధించాడు.

శుక్రవారం జరిగిన తొలి రోజు ఆటలో ఇంగ్లాండ్‌పై దూకుడు చూపించిన భారత జట్టు రెండో రోజు లంచ్ బ్రేక్ తర్వాత 471 పరుగులకు ఆలౌట్ అయింది.

Scroll to load tweet…

తొలి రోజు జైస్వాల్, గిల్ సెంచరీలు

మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బౌలింగ్ ఆప్షన్‌ను ఎంచుకున్నాడు. దీంతో భారత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. భారత ఇన్నింగ్స్ ను ఆరంభించిన జైస్వాల్.. ఆరంభంలో పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌తో ఇబ్బందిపడ్డా, చివరి బంతిని ఫోర్ కొట్టి తన ఖాతా తెరిచాడు.

జైస్వాల్ తన టీమ్ మేట్ కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 25వ ఓవర్‌లో కేఎల్ రాహుల్ 42 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వెంటనే డెబ్యూట్ చేస్తున్న సాయి సుదర్శన్ డక్‌కు వెనుదిరిగాడు. లంచ్ సమయానికి భారత్ 92/2 పరుగులతో నిలిచింది.

అక్కడినుంచి కెప్టెన్ శభ్ మన్ గిల్ (147 పరుగులు) - జైస్వాల్ (101 పరుగులు) జోడీ 129 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును నిలబెట్టారు. 48వ ఓవర్‌లో జైస్వాల్ కుడి చేతిలో క్రాంప్‌తో ఇబ్బంది పడ్డాడు. ఫిజియో అతనికి ఐస్ ప్యాక్ పెట్టి చికిత్స అందించారు. అయినా ధైర్యంగా ఆడిన జైస్వాల్, 99కి చేరుకున్న తర్వాత తదుపరి బంతికి సింగిల్‌తో సెంచరీ సాధించాడు.

ఆ తర్వాత కొద్ది సేపటికే బెన్ స్టోక్స్ అందుకున్న అద్భుత క్యాచ్ తో జైస్వాల్ (101) ఔట్ అయ్యాడు. అతను ఔటైనప్పటికే భారత్ మంచ స్థితిలో ఉంది.

Scroll to load tweet…

రెండో రోజు రిషబ్ పంత్ సెంచరీ.. గిల్ కెప్టెన్ నాక్

జైస్వాల్ వెనుదిరిగిన తర్వాత కెప్టెన్ గిల్ కెప్టెన్ నాక్ తో అదరగొట్టాడు. తొలి రోజు 127 పరుగుల సెంచరీ ఇన్నింగ్స్ న ఆడాడు. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ 65 పరుగులతో అజేయంగా నిలిచాడు. రెండో రోజు రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతూ సెంచరీని పూర్తి చేశాడు. 99 పరుగులతో ఉన్న సమయంలో సిక్సర్ తో రిషబ్ పంత్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 146 బంతులు ఎదుర్కొని 105 పరుగులతో సెంచరీని పూర్తి చేశాడు. రిషబ్ పంత్ సెంచరీ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. 71.92 స్ట్రైక్ రేటుతో తన సెంచరీని సాధించాడు. మొత్తంగా 134 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

గిల్ 147 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. భారత్ చివరి ఏడు వికెట్లు కేవలం 41 పరుగులకే కోల్పోయింది. మొదట జడేజా (11) జోష్ టంగ్ బౌలింగ్‌లో బౌల్డ్ కాగా, బుమ్రా కూడా డక్‌కు వెనుదిరిగాడు. చివరగా ప్రసిద్ధ్ కృష్ణను టంగ్ అవుట్ చేయడంతో భారత్ 471 పరుగులకు ఆలౌట్ అయింది. జోష్ టంగ్ 4/86, బెన్ స్టోక్స్ 4/66తో ఇంగ్లాండ్ బౌలింగ్‌ను నడిపించారు.

Scroll to load tweet…