చంద్రయాన్-2: ల్యాండర్ విక్రమ్ లోకేషన్ గుర్తింపు

By narsimha lodeFirst Published Sep 8, 2019, 1:55 PM IST
Highlights

ల్యాండర్ విక్రమ్  లోకేషన్ ను ఇస్రో గుర్తించింది. చంద్రుడిపై దిగే సమయంలో ల్యాండర్ విక్రమ్ నుండి ఇస్రోకు సిగ్నల్స్ తెగిపోయాయి.

న్యూఢిల్లీ: చంద్రయాన్-2 లో భాగంగా చంద్రుడికి 2.1 కి.మీ దూరంలో సిగ్నల్స్ లేకుండా పోయిన ల్యాండర్ విక్రమ్ ఆచూకీని ఇస్రో ఆదివారం నాడు గుర్తించింది. రెండు మూడు రోజుల్లో సిగ్నల్స్ ను పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో స్పష్టం చేసింది.

ఈ నెల 7వ తేదీన  తెల్లవారుజామున ఇస్రోతో  ల్యాండర్ విక్రమ్ కు సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడిపై దిగే సమయంలో ఈ  సిగ్నల్స్ తెగిపోయాయి.ల్యాండర్ విక్రమ్ ఎక్కడుందో ఆదివారం నాడు కనిపెట్టినట్టుగా ఇస్రో ప్రకటించింది.ల్యాండర్ విక్రమ్ ను ఆర్బిటర్ గుర్తించింది. ల్యాండర్ విక్రమ్ ఫోటోలను తీసింది. ఈ ఫోటోలను ఆర్బిటర్ ఇస్రోకు పంపింది.

ల్యాండర్ విక్రమ్ నుండి ఎలాంటి సిగ్నల్స్ లేవని ఇస్రో గుర్తించింది. ఈ మేరకు ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మెన్ శివన్ ప్రకటించారు. ల్యాండర్ విక్రమ్ తో  సిగ్నల్స్ ను పునరుద్దరించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇస్రో ఛైర్మెన్ శివన్ ప్రకటించారు.ల్యాండర్ విక్రమ్ తలకిందులుగా ఉన్నట్టుగా ఆర్బిటర్ తీసిన ఫోటోోలో ఉంది.చంద్రుడిపై దిగే సమయంలో  చంద్రుడికి 2.1 కి.మీ. దూరంలో ల్యాండర్ విక్రమ్నుండి ఇస్రోకు సిగ్నల్స్  తెగిపోయాయి.

సంబంధిత వార్తలు

చిన్నారులకు స్ఫూర్తి: చంద్రయాన్ 2పై రవిశాస్త్రి స్పందన

చంద్రయాన్ 2... దక్షిణ ధ్రువమే ఎందుకు ఎంచుకున్నారు..?

భారత్ చంద్రయాన్ 2... ఇజ్రాయిల్ ది కూడా ఇదే కథ

కన్నీరు పెట్టుకున్న ఇస్రో ఛైర్మన్.. హగ్ చేసుకున్న ప్రధాని మోదీ

మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను... శాస్త్రవేత్తలతో ప్రధాని మోదీ

చంద్రయాన్-2: చంద్రుడికి 2.1కి.మీ దూరంలోనే నిలిచిన విక్రమ్ ల్యాండర్, నో సిగ్నల్స్

చంద్రయాన్-2: ఆ 15 నిమిషాలే కీలకమన్న ఇస్రో ఛైర్మెన్ శివన్

చంద్రయాన్-2 గురించి తెలుసుకోవాల్సిన ఆరు విషయాలు

ఆల్‌ది బెస్ట్ ఇస్రో: కొద్ది గంటల్లో చంద్రుడిపై అడుగుపెట్టనున్న చంద్రయాన్-2

చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ప్రత్యక్షంగా వీక్షించనున్న మోడీ

మరో కీలక ఘట్టం: మూడో కక్ష్యలోకి అడుగుపెట్టిన చంద్రయాన్-2

మరో కీలక ఘట్టం: చంద్రుని కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-2

చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌పై పూర్తి విశ్వాసం: ఇస్రో ఛైర్మన్

click me!