ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సూసైడ్ చేసుకొన్న గదిని హైద్రాబాద్ పోలీసులు సోమవారం నాడు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. ఈ గదిలో పోలీసులు కీలక ఆధారాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆధారాలు చెరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నట్టుగా పోలీసులు ప్రకటించారు.
మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఇంటి వద్ద క్లూజ్‌టీం సోమవారం నాడు తనిఖీలు చేసింది. ఆధారాలు సేకరించే పనిలో పడింది. కోడెల శివప్రసాదరావుది అనుమానాస్పతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోడెల ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు.
గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు చెప్పారు. కోడెల మృతిపై ప్రాథమికంగా ఎలాంటి అనుమానాలు లేవని, ఘటన సమయంలో ఇంట్లో కోడెల భార్య, కూతురు, పనిమనిషి ఉన్నారని తెలిపారు.
కోడెల కొంతకాలంగా మనస్తాపంతో ఉన్నారని ఆయన కూతురు విజయలక్ష్మి పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చారు. వైద్యుల నివేదిక తర్వాత కోడెల మృతిపై ప్రకటన చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
కోడెల మృతదేహాన్ని బసవతారకం ఆసుపత్రి నుంచి పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం నరసరావుపేటలోని టీడీపీ పార్టీ ఆఫీస్‌కు కోడెల భౌతికకాయాన్ని తరలించనున్నారు.
సంబంధిత వార్తలు
కోడెల మృతి: ఆయన కుమారుడిపై మేనల్లుడి సంచలన ఆరోపణలు
కోడెల మృతిపై ఎమ్మెల్యే బాలకృష్ణ కామెంట్స్..
కోడెలను సీఎం జగన్ హత్య చేశారు.. కేశినేని ట్వీట్
నాన్న తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారు: కోడెల కూతురు విజయలక్ష్మి
కోడెల మృతి... పోస్టుమార్టం తర్వాతే చెబుతామంటున్న డీసీపీ
నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య
కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్
ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌లు అప్పగింత
శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...
నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు
కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?
నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల
కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు
దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు
అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల
అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల
అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?
కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు