ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను నందిగం వద్ద పోలీసులు సోమవారం నాడు అదుపులోకి తీసుకొన్నారు.
గుంటూరు:బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను సోమవారం నాడు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నందిగం వద్ద పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొన్నారు.
గురజాల నియోజకవర్గంలో సోమవారం నాడు బీజేపీ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అనుమంతి లేనందున సభను రద్దు చేసుకోవాలని పోలీసులు బీజేపీ నేతలకు నోటీసులు జారీ చేశారు.
ఈ నోటీసులు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు పోలీసులు వెళ్లారు. అయితే నోటీసులు తీసుకోకుండానే కన్నా లక్ష్మీనారాయణ గురజాలకు సోమవారం నాడు ఉదయమే బయలుదేరారు.
కన్నా లక్ష్మీనారాయణను పోలీసులు సత్తెనపల్లి మండలం నందిగం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. దీంతో ఉద్రిక్త్త చోటు చేసుకొంది. కన్నా లక్ష్మీనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని బీజేపీ శ్రేణులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు.
సంబంధిత వార్తలు
బీజేపీ సభకు పోలీసులు నో: గురజాలకు బయల్దేరిన కన్నా.. అరెస్ట్ చేసే అవకాశం