ఇలా చేయండి.. లేదంటే పగిలిపోద్ది..

First Published Dec 2, 2020, 3:14 PM IST

రోజురోజుకూ చలి పెరిగిపోతోంది. ఓ వైపు చలికి వణికిపోతుంటే మరోవైపు ఒళ్లు పగులుతూ చిటచిటలాడుతోంది. దీంతో చర్మ సౌందర్యం దెబ్బ తింటుంది. చేతులు, కాళ్లు, ముఖం, పెదాలు పొడిబారి పేలవంగా కనిపిస్తారు. 

రోజురోజుకూ చలి పెరిగిపోతోంది. ఓ వైపు చలికి వణికిపోతుంటే మరోవైపు ఒళ్లు పగులుతూ చిటచిటలాడుతోంది. దీంతో చర్మ సౌందర్యం దెబ్బ తింటుంది. చేతులు, కాళ్లు, ముఖం, పెదాలు పొడిబారి పేలవంగా కనిపిస్తారు.
undefined
దీంతో చర్మం ముడతలు పడి, పాదాలు పగుళ్లు బారి, చేతులమీద మరకలు పడుతూ చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనినుండి తప్పించుకుని చలికాలం చర్మ సౌందర్యాన్ని పెంచుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
undefined
చలికాలంలో వేడినీటితో స్నానం చేయడానికి ఇష్టపడతాం. ఇది మంచిదే అయితే ఎక్కువ సమయం, ఎక్కువ వేడి ఉన్న నీటితో స్నానం చేయకపోవడమే మంచిది. ఎక్కువసేపు స్నానం చేయడం వల్ల చర్మంలోని నూనెలు తగ్గి తేమను కోల్పోయే ప్రమాదం ఉంది.
undefined
అందుకే స్నానం చేసే నీళ్లు నీరు మరీ ఎక్కువగా ఉండకుండా జాగ్రత్తపడాలి. గోరువెచ్చని నీటితో సాధ్యమైనంత తొందరగా స్నానం ముగించండి. అందువల్ల మీ శరీరంలోని తేమ ఎక్కువగా బయటకు పోకుండా ఉంటుంది.
undefined
చలికాంలో ఎక్కువగా డవ్, ఓలే, మాయిశ్చరైజర్ కలిగిన సబ్బులనే వాడాలి. లేదా సెటాఫిల్, అక్వానిల్, ఓయిలాటం-ఎడి ఉన్న సబ్బు శాతం తక్కువ ఉంటే లిక్విడ్స్ ను వాడాలి.
undefined
చలికాలంలో డియోడరెంట్ సబ్బు, పెర్ఫ్యూమ్ సబ్బు, ఆల్కహాల్ ఉత్పత్తులు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. ఇవి ఖచ్చితంగా మీ శరీరంలోని సహజ నూనెను కోల్పోయేలా చేస్తాయి.
undefined
చలికాలంలో కొబ్బరి నూనెతో స్నానం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒంటికి కొబ్బరినూనె పట్టించుకుని ఆ తరువాత స్నానం చేయడమే ఆయిల్ బాత్. అయితే కొబ్బరినూనె వాడేప్పుడు జాగ్రత్తగా లేకపోతే బాత్రూంలో కాలుజారి పడే ప్రమాదం ఉంది
undefined
స్నానం చేసేప్పుడు స్పాంజి, స్క్రబ్, బ్రష్ లతో చర్మాన్ని రుద్దకుండా ఉండడమే బెస్ట్. దీనివల్ల చర్మంలోని సహజనూనెలు తగ్గిపోతాయి. ఒకవేళ వాడినా మరీ గట్టిగా రుద్దకుండా ఉంటే మంచిది. స్నానం తరువాత ఒంటిని తుడుచుకునేటప్పుడు కూడా బాగా రుద్దకుండా పైపైన అద్దడం వల్ల చర్మాన్ని పగుళ్ల బారినుండి రక్షించవచ్చు.
undefined
స్నానం చేసిన తర్వాత, చేతులు కడిగిన తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ రాయండి. ఇది మీ చర్మ కణాల మధ్య పగుల్లు రాకుండా నివారిస్తుంది.
undefined
చర్మం పొడిబారిన చోట పెట్రోలియం జెల్లీ, ఇతర క్రిములు రాయడం వల్ల పొడితనం తగ్గుతుంది. చర్మంపై పొక్కులలాంటివి రాకుండా కాపాడుతుంది.
undefined
వేసవిలోనే కాదు శీతాకాలంలో కూడా సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
undefined
చలికాలంలో ఒక్కోసారి చర్మంపై బాగా దురద పెడుతుంటుంది. అప్పుడు చర్మంపై గీతలు పడేలా రుద్దకండి. మాయిశ్చరైజర్ వాడండి. ఇది ఎక్కువ సమయం దురదను నియంత్రిస్తుంది. దురద ఉన్న ప్రదేశంలో కోల్డ్ కంప్రెస్లను పూయడం వల్ల దాని నుండి ఉపశమనం లభిస్తుంది.
undefined
click me!