ఈ ఒక్క చెట్టుంటే అమ్మాయిల బాధలన్నీ తీరినట్లే! అశోక వనంలో సీతకు.. పీరియడ్ సమస్యలకూ ఉన్న సంబంధం ఇదే

By Dr Kameswara Rao Ayurveda ExpertFirst Published Apr 17, 2024, 5:20 PM IST
Highlights

వివాహిత తన పాదాలతో అశోక చెట్టు కాండాన్ని తన్నితే చెట్టు ఎక్కువ పూలు పూసేదని చెట్టునిండా ఎర్రటి పూలు వచ్చేవయని స్కందపురాణం చెబుతోంది.

అశోక చెట్టు ఒక్కటి ఉంటే చాలు.. మీ ఇంట్లో ఓ పెద్ద పెయిన్ కిల్లర్ ఉన్నట్లే. ఎందుకంటే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అశోక్ చెట్టు ఆకులు, బెరడు, పువ్వులు, విత్తనాలు మనకు చిన్న నొప్పుల నుంచి చర్మ క్యాన్సర్ వరకు చాలా రకమైన వ్యాధులను దూరం చేస్తుంది. అశోక చెట్టుతో ఏమేం ప్రయోజనాలున్నయో ఇప్పుడు చూద్దాం.

అశోక చెట్టు భారతీయ సంస్కృతి , ఆధ్యాత్మికత, వైధ్యంతో ముడిపడి ఉన్న విలువైన వృక్షము. ఈ చెట్టు ఎక్కువగా తేమ ఉండే పరిసరాల్లో పెరుగుతుంది. ఎక్కువ ఇండియా, బర్మా, మలేషియాలో పెరుగుతుంది. దీని శాస్త్రీయ నామము ‘saraca india’ ఇది 10మీటర్ల వరకు పెరుగుతుంది.  

పూర్వకాలంలో అశోకచెట్టు ఎరుపు రంగు పువ్వులు, అందమైన ఆకుపచ్చ ఆకుల వలన దీనిని ornament of Garden అని పిలచేవారు. దీని అందమైన ఎరుపు రంగు పువ్వులు ఎక్కువగా ఫిబ్రవరి మాసంలో పుష్పించును. హిందువులు, బౌద్ధమతం సంప్రదాయంలో ఈ వృక్షం చాలా విశిష్టమైనది.

స్కందపురాణం ప్రకారం శ్రీరాముడు, సీతాదేవి వివాహం అనంతరం వారిద్దరూ కౌశికీ నది దగ్గరకు చేరిన తర్వాత  సీతాదేవి ఆ నది  చుట్టుపక్కల ఉన్న  అడవి ప్రాంతంలో నిండి ఉన్న అశోక వృక్షాల అందాన్ని చూసి అయోధ్యకు తిరిగి వెళ్లడానికి నిరాకరించారు. చాలా రోజులు ఆ వనంలోనే నివసించారు. అందుకే ఆ అడవికి సీతావన్ అనే పేరు వచ్చింది.

పూర్వకాలంలో స్త్రీలు అశోక పుష్పపరచేయిక అనే పండగను జరుపుకునేవారు. స్త్రీలు ఆ అశోక పూలు ధరించి.. దైవారాధన చేసేవారు. బెంగాలీ స్త్రీలు అశోక షష్టి అనే రోజున అశోక పుష్పములు తినేవారు.  ఈ పూలు ఉంచిన నీటిని కూడా తాగేవారు. ఇలా చేయడం వల్ల.. వారి పిల్లల, భర్తల ఆరోగ్యాన్ని కాపాడగలం అని వారు నమ్మేవారు.

రావణాసురుడు సీతాదేవిని అపహరించిన తర్వాత  సీతాదేవిని అశోక వనంలోనే నివసించింది. అశోక అనగా.. శోకం లేనిది అని అర్థం. అంటే.. ఎలాంటి బాధలు లేనిది అని. ఈ మొక్కను ప్రేమకు గుర్తుగా కూడా చెబుతారు.

పాత రోజుల్లో అందమైన వివాహిత తన పాదాలతో అశోక చెట్టు కాండాన్ని తన్నితే చెట్టు ఎక్కువ పూలు పూసేదని చెట్టునిండా ఎర్రటి పూలు వచ్చేవయని స్కందపురాణం చెబుతోంది. గర్భిణి స్త్రీ నోటిలో నీరు పుక్కిలించి చెట్లు వేర్ల వద్ద ఉమ్మితే చెట్లు నుంచి మంచి అశోక కాయలు కాస్తాయట. ఇలా అశోక చెట్టును యువతకులకు బాగా కనెక్టయిన వృక్షంగా పేర్కొంటారు.

ఆయుర్వేదం ప్రకారం కూడా ఈ మొక్క వల్ల అనేక ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. స్త్రీలలో వచ్చే చాలా రకాల సమస్యలకు ఈ మొక్క దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఇక ఈ అశోక చెట్టు విత్తనాలలో saracin, lection అనే పదార్థాలు ఉంటాయి, ఇవి కూడా మంచి ఔషధంగా పని చేస్తాయి.

చరక మహర్షి అశోక వృక్షమును వేదనాస్థాపన - పెయిన్ కిల్లర్ లాగా పేర్కొన్నారు. నొప్పి తగ్గించే గుణం ఉంటుంది. అశోక విత్తనాలను, కాండం బెరడును కషాయం చేసుకుంటే.. పెయిన్ కిల్లర్ గా పని చేస్తుందని పేర్కొన్నారు.

ఇవీ ఔషధ గుణాలు

అకోశ చెట్టు ఆకులు : వగరుగా ఉంటాయి. గొంతు సమస్యలకు ఇవి పని చేస్తాయి. ఈ ఆకులను బాగా దంచేసి కషాయం చేసుకోవాలి. ఇది గొంతునొప్పి, గొంతు ఇన్ఫెక్షన్లకు బాగా పని చేస్తుంది. వాయిస్ క్లియర్ గా రావడానికీ పని చేస్తుంది. ఈ కషాయాన్ని బాగా పుక్కిలించి ఊసేయాలి.

బెరడు : అశోక చెట్టు బెరడు రక్తస్రావాలను అరికట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. పీరియడ్స్ రక్తస్రావం, లేదా ఇతర రక్తస్రావాలు అవుతున్నపుడు ఈ బెరడుతో చేసిన కషాయం బాగా పని చేస్తుంది.  పదిగ్రాముల బెరడును 100 మిల్లీ నీటిలో కషాయం లాగా మరిగించాలి. వంద మిల్లీ నీరు 50 మిల్లీగా అయ్యేవరకు మరిగించి ఆ కషాయాన్ని తాగాలి. ఇది  రక్త్ర స్రావాన్ని ఆపుతుంది. పీరియడ్ పెయిన్, ఇతర పీరియడ్ సమస్యలకు పని చేస్తుంది. 

అశోక పుష్పాలు: వీటిని ఫ్లేవనాయిడ్స్ గా వాడతారు.  శరీరంలో Guluto tian peroxide, catalase ఎక్కువగా స్రవిస్తే అవి స్కిన్ క్యాన్సర్ కి కారణమవుతాయి. అశోక పుష్పాలను కాస్త నలిపి నీటిలో ఆరు గంటల పాటు నానబెట్టి ఆ నీటిని తాగితే.. ఈ చర్మ క్యాన్సర్ కారక ఎంజైముల ఉత్పత్తిని తగ్గించేస్తుంది.

అశోక విత్తనాలు : మూడు గ్రాముల విత్తనాలను పౌడర్ చేసుకుని.. గోరు వెచ్చని నీటిలో కలిపి తాగితే స్త్రీలలో వచ్చే పీరియడ్ పెయిన్, రక్తస్రావాల సమస్యలు తగ్గుతాయి.

(వ్యాసకర్త డాక్టర్ కామేశ్వరరావు MD kayachikitsa gold medalist. ఈయన 2006లో యూపీఎస్సీ ద్వారా దిల్లీ నగర పాలక సంస్ఖలో ఆయుర్వేద వైద్యాధికారిగా చేశారు. ప్రస్తుతం ఈయన రెసిడెంట్ మెడికల్ సూపరింటెండెంట్ గా దిల్లీలోని రాజీవ్ గాంధీ ఆయుర్వేదిక్ పంచకర్మ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు.)

click me!