Secret Cameras: అవినీతిపరులను, లంచగొండులను పట్టించేందుకు ఉపయోగించాల్సిన సీక్రెట్ కెమెరాలను కొంతమంది దుర్మాగులు దుర్వినియోగం చేస్తున్నారు. మహిళల ప్రైవేటు వీడియోలు చిత్రీకరించేందుకు వినియోగిస్తూ..అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. పలు ఘోర దారులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్పై (రహస్య) కెమెరాలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
Secret Cameras: మనం వేరే ప్రాంతాలకు లేదా తీర్థ యాత్రకు వెళ్లినా.. అక్కడ బస చేయడానికి హోటల్‌ల్లో రూమ్ బుక్ చేసుకుంటాం. అయితే.. ఈ మధ్యకాలంలో కొంత మంది దుర్మార్గులు గదుల్లో రహస్యంగా సీసీ కెమెరాలను అమర్చి, పలు దారులకు పాల్పడుతున్నారు. కానీ మనకు ఉండే హడావుడితో హోటల్ సెక్యూరిటీ గురించి గానీ, అందులో అమర్చిన రహస్య కెమెరాల గురించి అసలు పట్టించుకోం.. అలా నిర్లక్ష్యంగా ఉండటం వల్ల మనం ప్రమాదాలకు గురవుతున్నాం. మన జీవితాలను నాశనం చేసుకున్నావారిమైతాం.. తరువాత పశ్చాత్తాపపడవలసి వస్తుంది.
రహస్య కెమెరాలను ఎక్కడ పెట్టవచ్చు?
మనం ఉంటున్న గది సురక్షితంగా ఉందో లేదో .. ఎక్కడ సీసీ కెమెరాలు ఎక్కడ పెట్టాలో తెలుసుకోవాలంటే.. ముందుగా గదిలో ఉంచిన ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా పరిశీలించాలి. గదిలో అమర్చిన గడియారాలు, ప్లగ్స్ , ల్యాంప్, పవర్ బ్యాంకులు, USB డ్రైవ్‌లు, పెన్నులు, ఫొటో ఫ్రేమ్‌లు, పెయింటింగ్స్, అద్దాలు, బొమ్మలు, మొక్కల కుండీలు, ఇతర అలంకరణ వస్తువులను నిశితంగా పరిశీలించాలి. ముఖ్యంగా సీలింగ్‌లో అమర్చిన డిటెక్టర్, ఫ్యాన్‌ను తనిఖీ చేయాలి. చాలా సార్లు గదిలో అమర్చిన ఏసీలో కెమెరాలను అమర్చుతున్నారు. వీటన్నింటిని నిశితంగా పరిశీలించిన పిమ్మటనే గదిలో ఉండాలని నిర్ణయించుకోవాలి.
undefined
రహ్యస కెమెరాలను గుర్తించడం ఎలా?
వాస్తవానికి సీక్రెట్ కెమెరాలు ఏదైనా వస్తువులో అమర్చారో తెలుసుకోవడం చాలా కష్టం. వీటిలో ఎక్కువ స్పై కెమెరాలు నల్లని రంగులోనే ఉంటాయి. అందులోను అవి వైర్లెస్ కెమెరాలు, హై డెఫినేషన్తో రికార్డ్స్ సదుపాయం ఉండటంతో నేరస్తులు వినియోగిస్తుంటారు. మైక్రో ఎస్టీ కార్డు అమర్చి డేటా స్టోరేజ్ చేస్తారు. తర్వాత దాన్ని ఫోన్, కంప్యూటర్ కు అనుసంధానించి దుర్వినియోగం చేస్తున్నారు. వైఫై ఆధారంగా కెమెరాలను ఆపరేట్ చేసే వెసులుబాటు ప్రస్తుతం అందుబాటులో ఉంది. అలాంటి సీక్రెట్ కెమెరాలు గుర్తించాలంటే.. కింది చిట్కాలను పాటించాలని నిపుణులు చెప్పుతున్నారు.
1. నిశితంగా పరిశీలించడంత ద్వారా
మనం ఉండబోయో ప్రాంతాన్ని తొలుత నిశితంగా పరిశీలించాలి. ముందుగా అక్కడ ఉంచిన గడియారం, ప్లగ్, ల్యాంప్, పవర్ బ్యాంకులు, USB డ్రైవ్‌లు, పెన్నులు, ఫొటో ఫ్రేమ్‌లు, పెయింటింగ్స్, అద్దాలు, బొమ్మలు, మొక్కల కుండీలు, ఇతర అలంకరణ కుండీలను జాగ్రత్తగా పరిశీలించాలి. అలాంటి వస్తువుల్లోనే రహస్య కెమెరాలను అమర్చే అవకాశం ఎక్కువ. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే.. సులభంగా గుర్తించవచ్చు.
2. కెమెరా డిటెక్టర్ల ద్వారా..
కంటికి కనిపించని రహస్య కెమెరాలను RF డిటెక్టర్లను ఉపయోగించి కనిపెట్టవచ్చు. రహస్య కెమెరాల నుంచి తరచుగా వెలువడే రేడియో తరంగాలను RF టిటెక్టర్లు గుర్తించగలవు. చాలా కెమెరాలు 500MHz నుంచి 6GHz వరకు రేడియో తరంగాలను విడుదల చేస్తాయి. RF డిటెక్టర్లతో స్కాన్ చేయడం ద్వారా రహస్య కెమెరాలను పసిగడతాయి.
3. థర్మల్ డిటెక్టర్ల ద్వారా..
సాధారణంగా ఏ ఎలక్ట్రానిక్ వస్తువునైనా ఉపయోగిస్తుంటే.. అవి వేడెక్కుతుంటుంది. కనుక హిడెన్ కెమెరాలు కూడా థర్మల్ పరికారాలు కాబట్టి.. వాటిని ఉపయోగించిన కొద్ది వేడెక్కుతుంటాయి. అలా రహస్య కెమెరాలను థర్మల్ డిటెక్టర్ల ద్వారా గుర్తించవచ్చు.
4. స్మార్ట్ ఫోన్ ద్వారా..
కంటికి కనిపించని కెమెరాలను కనుగొనేందుకు స్మార్ట్‌ఫోన్లు చాలా బాగా ఉపయోగపడుతాయి. రహస్య కెమెరాలను గుర్తించడానికి చాలా రకాల యాప్ కూడా ఫ్లే స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. చీకటిలో రికార్డ్ చేయడానికి కెమెరా లెన్స్‌లకు కొంత కాంతి అవసరం. ఇందుకోసం అందులో ఇన్‌ఫ్రారెడ్ (IR) టెక్నాలజీని వాడుతుంటారు. ఇలాంటి కెమెరాలను కనిపెట్టాలంటే.. తొలుత మీరున్న గదిలో లైట్ అన్నింటిని ఆఫ్ చేసి.. మీ స్మార్ట్ ఫోన్లోని ఫ్రంట్ కెమెరాను ఆన్ చేయాలి. చీకటిలో మీ గది మొత్తాన్ని ఫోన్ కెమెరా ద్వారా చూడండి. అలా చేసినప్పుడు ఏదైనా వెలుగు ఫోన్ కెమెరాలో కనిపిస్తే..ఖచ్చితంగా అది హిడెన్ కెమెరానే.
5. వై-ఫై స్కానర్ ద్వారా..
మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తో వై-ఫై నెట్‌వర్క్ లను కూడా చాలా సులువుగా గుర్తించవచ్చు. హ్యాండ్‌హెల్డ్ వై-ఫై, నెట్‌వర్క్ స్కానర్‌ల ద్వారా కూడా రహస్య కెమెరాలను గుర్తించవచ్చు.