మటన్ ధరను మించిపోయేలా ఉన్న చింత చిగురు, కేజీ ఎంతో తెలుసా..?

By Mahesh Jujjuri  |  First Published Apr 23, 2024, 4:37 PM IST

చింత చిగురు.. చాలామందికి హార్ట్ ఫెవరేట్.. తినాలనిపించినప్పుడల్లా.. సీజన్ లో ఏ చింత చెట్టుదగ్రకు వెళ్ళినా దొరకుతుంది. కాసి సిటీల్ ఈ చింత చిగురు రేటు ఎంతో తెలుసా..? 
 



సీజనల్ గా వచ్చే చింతచిగురంటే చాలా మందికి ఇష్టం. చింత చిగురును ఇగురు పెట్టుకుని తింటే. ఆ టేస్టే వేరు... ఎండు చేప నుంచి టమాట వరకూ.. చింతచిగురుతో కాంబినేషన్లు కూడా అద్భుతం అనే చెప్పాలి. ఇలా ఇష్టంగా తినే చింతచిగురు కావాలంటే ఏం చేస్తారు.. ఆ ఏం చేస్తాం.. పక్కింట్లోనో.. తోటలోనో ఉన్న చింతచెట్టుకు తెంపుకొస్తాం అంటారా..? మీది పల్లెటూరు అయితే అలానే చేయవచ్చు. కాని సిటీవాళ్లు పక్కాగా కొనాల్సిందే. 

అయితే ఈ సీజన్ లో చింతచిగురు కొని తినాలి అనుకున్నవారికి షాక్ తగులుతోంది. అవును.. చింత చిగురు ధర తెలిసి నీళ్లు తాగేస్తున్నారు. దీనికంటే నాన్ వెజ్ కొని ఇంటిల్లిపాది నినొచ్చుక కదరా అనుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. వేసవిలో మాత్రమే వచ్చే చింతచిగురుకు ఉండే డిమాండ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏడాదికి ఒక్క సీజన్ లోనే చింతచిగురు తినే భాగ్యం నగరవాసులకు కలుగుతుంది కాబట్టి  ధరను లెక్కచేయకుండా కొంటుంటారు.

Latest Videos

undefined

అయితే ఈసారి మాత్రం చింతచిగురు ను ముట్టుకునేట్టు లేదు. చిగురు  ధర ఆకాశన్ని అంటేలా ఉంది. చికెన్ ధరకంటే.. మటన్ ధరకంటే కూడా మించిపోయేలా ఉంది. దాంతో జనాలు చిగురు కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. సాధారణంగా చింతచిగురు రేటు గతంలో కిలో 200 వరకు ఉండేది. కాని ఈ సీజన్ లె మాత్రం చింతచిగురు ధర 700 నుంచి 800 వరకూ  పలుకుతుందట. తక్కువలో తక్కవు 500 తక్కువ దొరకటంలేదని సమాచారం. 

 ఈలెక్కన  చికెన్ కిలో 300 లోపే ఉంది. మటన్ ధర 800 చిల్లర ఉంది. దాంతో చింత చిగురు కంటే మటన్ తినుడే మంచిదేమో అంటున్నారు. అంతే కాదు గ్రామాల్లో చాలా విరివిగా.. ఫ్రీగా దొరికే చింత చిగురు సిటీలో ఇంత ఉండే వరకూ.. ఇక చిగురు ప్రేమికులు మాత్రం రేటు లెక్క చేయకుండా కొనేస్తున్నారు. ఈసారి హైదరాబాద్‌లో చింత చిగురుకు  కొరత ఏర్పడింది. రైతు బజార్‌తోపాటు మార్కెట్లలోనూ వీటి ధర భారీగానే ఉంది. 

చింత చిగురు ఒక్క సీజన్ లోనే రావడం, చిగురు కోయ్యడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం కావడంతో దీని రేటు అమాంతం పెరుగుతోంది. దీంతో వినియోగదారులు 50, 100 గ్రాములే కొనుక్కుని ఉన్నంతలో ఎంజాయ్ చేస్తున్నారు. అటు  రైతు బజార్లలో 100 గ్రాముల చింతచిగురు 50కి లభిస్తుండగా బయట మార్కెట్లలో రూ.70 నుంచి 80 మధ్యలో విక్రయిస్తున్నారు.

click me!