ఆ శనీశ్వరుడికి తైలాభిషేకం చేయకపోయినా.. కేవలం ఈ కింది మంత్రం మీరు ఇంట్లోనే పఠించడం వల్ల... మీకు ఎలాంటి శనిదోషాలు ఉన్నా, ఏలినాటి శని ఉన్నా.. తొలగిపోతుందని మీకు తెలుసా..? మరి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం..
నేడు శని త్రయోదశి అనే విషయం మీకు తెలిసే ఉంటుంది. ఈ శనిత్రయోదశి రోజున ఉదయాన్నే.. ఆలయానికి వెళ్లి.. ఆ శని దేవుడికి తైలాభిషేకం చేస్తూ ఉంటారు. అంతేకాదు.. నువ్వుల నూనె, నల్ల నువ్వులతో.. ఆ శనీశ్వరుడిని పూజిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల... ఆ శని దేవుడి కటాక్షం లభించి... శని దోషాలు పోతాయి అని నమ్ముతుంటారు.
అయితే...కేవలం ఆ శనీశ్వరుడికి తైలాభిషేకం చేయకపోయినా.. కేవలం ఈ కింది మంత్రం మీరు ఇంట్లోనే పఠించడం వల్ల... మీకు ఎలాంటి శనిదోషాలు ఉన్నా, ఏలినాటి శని ఉన్నా.. తొలగిపోతుందని మీకు తెలుసా..? మరి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం..
undefined
నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండనిభాయ చ ।
నమో నీలమధూకాయ నీలోత్పలనిభాయ చ ॥ 1 ॥
నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ ।
నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక ॥ 2 ॥
నమః పౌరుషగాత్రాయ స్థూలరోమాయ తే నమః ।
నమో నిత్యం క్షుధార్తాయ నిత్యతృప్తాయ తే నమః ॥ 3 ॥
నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే ।
నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోఽస్తు తే ॥ 4 ॥
నమస్తే ఘోరరూపాయ దుర్నిరీక్ష్యాయ తే నమః ।
నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోఽస్తు తే ॥ 5 ॥
సూర్యపుత్త్ర నమస్తేఽస్తు భాస్వరోభయదాయినే ।
అధోదృష్టే నమస్తేఽస్తు సంవర్తక నమోఽస్తు తే ॥ 6 ॥
నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమోనమః ।
తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయ చ ॥ 7 ॥
జ్ఞానచక్షుర్నమస్తేఽస్తు కాశ్యపాత్మజసూనవే ।
తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధో హరసి తత్ క్షణాత్ ॥ 8 ॥
దేవాసురమనుష్యాశ్చ సిద్ధవిద్యాధరోరగాః ।
త్వయావలోకితాస్సౌరే దైన్యమాశువ్రజంతితే ॥ 9 ॥
బ్రహ్మా శక్రోయమశ్చైవ మునయః సప్తతారకాః ।
రాజ్యభ్రష్టాః పతంతీహ తవ దృష్ట్యాఽవలోకితః ॥ 10 ॥
త్వయాఽవలోకితాస్తేఽపి నాశం యాంతి సమూలతః ।
ప్రసాదం కురు మే సౌరే ప్రణత్వాహిత్వమర్థితః ॥ 11 ॥
నిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయం , ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు. గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు.
శని త్రయోదశి అంటే :- శనివారం రోజు త్రయోదశి తిధి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతోను, నువ్వుల నూనేతో, నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు.
శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, కోర్టు కేసులు, శత్రువులు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు, పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని, వస్త్ర, ధన, వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.
పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తర్వత ఆ వస్రాన్ని దానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్ధం . దానం చేయమన్నారు కదా అని... అన్నీ ఉన్నవారికి చేయడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. లేనివారికి చేస్తేనే అది దానం అవుతుంది. పేదలకు దానం చేయండి. లేకుంటే పక్షులకు, పశువులకు ఆహారం అందించడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది.