చలికాలంలో రోజూ రెండు గుడ్లు తింటే ఎన్ని జబ్బులు తగ్గిపోతాయో తెలుసా..!

First Published Jan 7, 2023, 9:57 AM IST

చలికాలంలో మన రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. దీంతో చాలా మంది జలుబు, ఫ్లూ సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సీజన్ లో రోజుకు రెండు గుడ్లను తింటే మన శరీరానికి ప్రోటీన్ అందుతుంది. దీంతో బలం పెరుగుతుంది. అంతేకాదు.. 


చలికాలంతో పాటుగా ఎన్నో రోగాలు కూడా వస్తాయి. ఈ సీజన్ లో ఉష్ణోగ్రత పడిపోవడంతో మన రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. దీంతో ఎముకల్లో నొప్పి స్టార్ట్ అవుతుంది. అలాగే విపరీతంగా జుట్టు రాలడంతో పాటుగా ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇలాంటి పరిస్థితిలో మన ఆహారంలో చిన్న మార్పును చేసుకుంటే.. ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను నివారించొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుడ్లను రోజూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో చాలా మందికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో మరువకుండా గుడ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదంటున్నారు నిపుణులు. గుడ్లు మన శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి. గుడ్లలో మన ఆరోగ్యానికి మంచి చేసే ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చలికాలంలో రోజూ 2 గుడ్లను తింటే ఎన్నో సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఇంతకీ గుడ్లను ఎలాంటి సమయంలో తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

జలుబు, దగ్గు

చలికాలంలో మన ఇమ్యూనిటీ పవర్ బలహీనపడుతుంది. దీంతో చాలా మంది జలుబు, ఫ్లూ బారిన సులువుగా పడుతుంటారు. ఇలాంటి సమస్యలున్నవారు రోజుకు రెండు గుడ్లను ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే గుడ్డులోని ప్రోటీన్  మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే శరీర బలాన్ని కూడా పెంచుతుంది. గుడ్లలో విటమిన్ బి 6, విటమిన్ బి 12 లు ఉంటాయి.  ఇవి రోగనిరోధక శక్తిని పెంచి జలుబు,  ఫ్లూను నివారించడానికి సహాయపడుతుంది. 

ఎముకల ఆరోగ్యానికి

గుడ్లు ఎముకలకు ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. గుడ్లలో విటమిన్ డి, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆస్టియోజెనిక్ బయోయాక్టివ్ మూలకాలు. ఇది లుటిన్, జియాక్సంతిన్ లను పెంచుతుంది. ఇవి ఎముకలను లోపలి నుంచి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ విధంగా చలికాలంలో గుడ్లు కీళ్ల నొప్పులను, ఆర్థరైటిస్ వంటి ఎముకల సమస్యలను నివారించడానికి సహాయపడతాయి. 
 

విటమిన్ డి లోపం

చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది. దీనివల్ల చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతుంటారు. ఈ విటమిన్ డి ఒక్క సూర్యరశ్మి ద్వారానే కాదు.. ఎన్నో ఆహారాల ద్వారా కూడా పొందొచ్చు. ముఖ్యంగా గుడ్ల నుంచి. గుడ్లలో 8.2 ఎంసిజి విటమిన్ డి ఉంటుంది. ఇది రోజుకు 10 ఎంసిజి సిఫార్సు చేసిన విటమిన్ డి తీసుకోవడంలో 82% అన్న మాట. అంటే రెండు గుడ్లను తినడం ద్వారా మీరు 1 రోజుకు సరిపడా విటమిన్ డి ని పొందుతారన్న మాట. అందుకే విటమిన్ డి ఉన్నవారు రోజూ రెండు గుడ్లను తప్పకుండా తినండి. 
 

విటమిన్ బి 12 లోపం 

బాగా ఉడికించిన గుడ్డులో 0.6 మైక్రోగ్రాముల విటమిన్ బి 12 ఉంటుంది. ఇది మీ రోజువారీ ఆహారంలో 25% అన్నమాట. గుడ్డులోని పచ్చసొన కొవ్వును పెంచుతుంది. అందుకే ఇది మన శరీరానికి మంచిది కాదని చాలా మంది చెబుతున్నారు. గుడ్ల ద్వారా విటమిన్ బి 12 లోపాన్ని పోగొట్టొచ్చు. నిజానికి విటమిన్ బి 12 చాలా వరకు పచ్చసొన నుంచే లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ 2 గుడ్లను తినండి. విటమిన్ బి 12 లోపాన్ని నివారించండి.
 

జుట్టు రాలడాన్ని ఆపడానికి 

గుడ్డు ప్రోటీన్ కు గొప్ప మూలం. ఇది జుట్టు రాలడాన్ని నివారించడానికి సహాయపడుతుంది. చలికాలంలో జుట్టు ఎక్కువగా రాలుతుంది. ఇలాంటి వారు గుడ్లను రోజూ తింటే మంచిది. ఎందుకంటే గుడ్లు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. గుడ్లలో బయోటిన్ అనే  విటమిన్ బి ఉంటుంది. గుడ్లు జుట్టు, చర్మం, గోర్ల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.

click me!