* ప్రపంచంలోనే తొలిసారి ఆటిజం థెరపీల్లో AI తోడ్పాటు
* ఓ తల్లి నిర్విరామ ‘ఆటిజం మహమ్మారి బాధల నిర్మూలనా మిషన్’
* ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 90 కోట్ల ఆటిజం బిడ్డల తలరాతల్ని తిరగరాయడమే ఆమె లక్ష్యం!
* పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ తో 1 కోటికి పైనే విజయవంతమైన థెరపీలు!
* నెంబర్ వన్ #1 ఆటిజం థెరపీ సెంటర్స్ నెట్ వర్క్ గా ప్రతిష్ఠాత్మక అవార్డుకి ఎంపిక
Autism Epidemic Suffering Mission: గర్భంలో బిడ్డకి బీజం పడింది మొదలు.. తల్లికి బిడ్డకి మధ్య దూరాన్ని ఎంతో దగ్గర చేసింది నేటి ఆధునిక టెక్నాలజీ.. పిండం ఎలా రూపుదిద్దుకుంటోంది మొదలు.. ఎప్పుడు పురుడుపోసుకుని బయటికి వస్తుందో చెబుతూ.. అన్ని విషయాల్లోనూ కేర్ తీసుకుంటూ టెక్నాలజీ తల్లికి తోడుగా పుట్టింటి తోబుట్టువులా అంటిపెట్టుకుని ఉంటుంది...
కానీ, ఇవేం అంతగా లేని రోజుల్లో ఓ తల్లి తన బిడ్డకి జన్మనిచ్చింది.. అపురూపంగా చూసి మురిపోతుండగానే బిడ్డపై మాటేసిన VOC’s Absent మహమ్మారి ముందుకొచ్చింది.. అదేంటో అర్థం కాని తల్లి తల్లడిల్లిపోయింది.. ఎదురు నిలిచింది.. ఇదే క్రమంలో మందే లేకుండా, కారణమే తెలియకుండా, ఆటిజం సమస్య ప్రపంచ వ్యాప్తంగా ఎందరో బిడ్డల భవిష్యత్తుని ఛిదిమేస్తున్న తీరుని చూసి చలించిపోయింది.. అంతే ఆ మహమ్మారిపై ఓ యుద్ధం చేసింది.. తన శక్తి యుక్తుల్ని ఎదురొడ్డింది.. ఎన్నో ఏళ్లుగా దానిపై పరిశోధనలు చేసింది.. దేశ విదేశాలు తిరిగింది.. సొంతంగా భారత్ హెల్త్ కేర్ సంస్థని స్థాపించింది.. పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్® పేరుతో థెరపీ సెంటర్లను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది.. 90 కోట్ల మంది పిల్లలకు తమ జీవితాన్ని తిరిగిపొందే థెరపీ లు అందించడం ప్రారంభించింది.. అక్కడితో ఆగలేదు.. నేటి టెక్నాలజీని అవపోసపట్టింది.. ఫలితం..!!?
undefined
నేడు విప్లవాత్మక మార్పులకు మూలం అవుతున్న TherapeuticAI™ ఆవిష్కరణ.. ఆటిజం థెరపీల్లో ప్రపంచంలోనే తొలిసారి AI మిళితం చేసి బిడ్డల తలరాతల్ని మార్చగలగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆటిజం బారిన పడిన పిల్లలకు, వారిని చూసి తల్లడిల్లిపోయే పేరెంట్స్ కి ఇదో పినాకిల్ సంస్థ నుంచి పుట్టిన AI సంజీవని. అసలీ థెరప్యూటిక్ ఏఐ (Pinnacle TherapeuticAI™) ఎలా అందుబాటులోకి వచ్చింది? దాన్నెలా బిడ్డలకు అందించొచ్చు? దాని ఫలితాలు ఎలా ఉంటాయి? అనే విషయాల్ని మనతో పంచుకుంటున్నారు ఆ తల్లి.. ఆమె పేరే శ్రీమతి డాక్టర్. శ్రీజారెడ్డి సరిపల్లి.. చీఫ్ స్ట్రాటజిస్ట్ & సీఈఓ (Chief Strategist & CEO). ఆవిడ మాటల్లోనే ఈ ‘మదర్ మిషన్’ కథలోకి వెళ్దాము..
వందేళ్లుగా బిడ్డల్ని పీడిస్తోంది..
ఏదైనా సమస్య మూలల్లోకి వెళ్తేనే తెలుస్తుంది దాని లోతెంతో. అందుకే డాక్టర్ శ్రీజారెడ్డి ఆటిజం మూలాల్ని ప్రపంచం ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటున్నారు. ఆటిజం, సుమారు గత 133 ఏళ్ల గా మందనేదే లేకుండా.. అస్సలు కారణమేంటో తెలియకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది పిల్లల జీవితాలను పట్టి పీడిస్తూ, తమ పిల్లల భవిష్యత్తుపై ఆశల్ని సన్నగిల్లేలా చేస్తూ వారి తల్లిదండ్రుల్ని, కుటుంబాలను చెప్పుకోలేనంత బాధాకర స్థితిలోకి నెట్టేస్తోందని అనడంలో అతిశయోక్తి లేదని హెచ్చరిస్తున్నారు.
అందుకే వారి గుండెల్లో ధైర్యాన్ని నిపేందుకు.. ఆటిజం మహమ్మారి బాధలను బిడ్డల జీవితాల్లో నుంచి తరిమేసేందుకు పినాకిల్ లో నిపుణులైన థెరపిస్ట్ లతో ప్రత్యేక 1:1 పద్ధతిలో థెరపీలను అందిసున్నారు. అంటే.. ఒక బిడ్డకి ప్రత్యేకంగా నియమించిన మరో థెరపిస్ట్. బిడ్డ మానసిక స్థితిని స్టడీ చేస్తూ.. దగ్గరవుతూ.. కుటుంబ సభ్యుడిగా మారి థెరపీ చేయడం లాంటిది అన్నమాట. గత పదిహేనేళ్లుగా శిక్షణ పొందిన, నిపుణులైన థెరపిస్ట్ లు, డాక్టర్లు ఓ సైన్యంలా, అధునాతన టెక్నాలజీ పద్ధతుల్ని మిళితం చేస్తూ ముందుకు సాగుతున్నారు. నూటికి నూరు శాతం సక్సెస్ రేటుతో బిడ్డల మానసిక, శారీరక ఎదుగుదలకి తగిన తోడ్పాటుని అందిస్తున్నందుకు చాలా ఆనందంగా, గర్వంగా ఉందని సంస్థ సీఈవో డాక్టర్. శ్రీజా చెబుతున్నారు.
శ్రమకి తగిన గుర్తింపు
పినాకిల్ ద్వారా అందిస్తున్న థెరపీలు, సేవా కార్యక్రమాలకు గానూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘నెంబర్ #1 ఆటిజం థెరపీ సెంటర్స్ నెట్ వర్క్-2023’గా ప్రతిష్టాత్మక అవార్డుని డాక్టర్ శ్రీజారెడ్డి బృందం అందుకున్నారు. ‘ఇది మా పినాకిల్ సైన్యం నిబద్ధతకి దక్కిన గుర్తింపు అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఎందుకంటే.. #1CroreLivesSuccess, 1,00,00,000 కి పైనే థెరపీల్ని నూరు శాతం సక్సెస్ రేటుతో అందించారు. ఇది ఆటిజం స్థితి నుండి పిల్లల జీవితాలను రక్షించాలనే మా యజ్ఞంలో మేం అందుకున్న మైలురాయి.
అంతేకాదు.. థెరపీల తర్వాత ఎందరో తల్లిదండ్రుల ముఖాల్లో చూసిన చిగురాశలకు ఈ అవార్డు ప్రతిబింబం. మేం ప్రవేశపెట్టిన వినూత్న థెరపీ పద్ధతులకు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఫలితాల్ని చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తోంది.. మేం మరో కొత్త తరం ఆశలకు విశ్వవ్యాప్తంగా ఊపిరిలూదుతున్నాం. ఓ తరం రంగుల కలల్ని, ఎన్నో కుటుంబాల వంశాంకురాల్ని AI తో ఆటిజం నుంచి రక్షించగలుగుతున్నాం… అంటూ, మనసా వాచా కర్మణా!! సర్వేజనా సుఖినోభవతు!!’ అంటూ పినాకిల్ విధుల్ని దైవ సంకల్పం గా భావిస్తున్నారు డాక్టర్. శ్రీజారెడ్డి.
ఇదే విప్లవాత్మకమైన అడుగు
టెక్నాలజీ.. దీనికో సరికొత్త నిర్వచనాన్ని ఇస్తున్నారు శ్రీజారెడ్డి. ‘ల్యాండ్ లైన్ ఫోన్ ఉన్నప్పుడు మనకి కనీసం ఓ 10 నుంచి 20 నెంబర్లు గుర్తుండేవి. మరిప్పుడు.. రెండు ఫోన్ నెంబర్లను ఠక్కున చెప్పడానికి కష్టపడుతున్నారు. అంటే.. స్మార్ట్ ఫోన్ మన మెమొరీని చంపేసింది అనొచ్చు.. వినేందుకు కాస్త కటువుగా అనిపించొచ్చు.. కానీ, అందివచ్చే టెక్నాలజీ ఓ ఆరోగ్యవంతుడి బుర్రని లేజీగా మార్చేస్తోంది.. ఓ రకంగా మనందరం బుద్ధిమాంద్యానికి దగ్గరవుతున్నట్టే!. అందుకే మేం టెక్నాలజీకి కొత్త నిర్వచనాన్ని ఇస్తున్నాం.. అదే.. బుద్ధి సామర్థ్యాన్ని సానపెట్టేదే సారవంతమైన టెక్నాలజీ!! అంటే.. ఆటిజం పిల్లల బుద్ధి బలాన్ని దారిలో పెట్టడం.. అందుకు మేం AI ని మా దారిలోకి తెచ్చుకున్నాం. 160కి పైనే పేటెంట్ పొందిన టెక్నాలజీ ఆవిష్కరణల్ని సిద్ధం చేశాం. వాటిని థెరపీల్లో మిళితం చేస్తూ ఆటిజం చికిత్సా విధానాల్ని కొత్త పుంతల్ని తొక్కిస్తున్నాం అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది.
133 సంవత్సరాల ప్రపంచ ఆటిజం విషయ సంపద మా సొంతం. మీ బిడ్డ పుట్టిన నాటినుండి, నేటి వరకు ఉన్న డెవలప్మెంట్ డిలే, కండిషన్స్, బిహేవియర్స్ అన్నీటినీ స్టడీ చేస్తాం. కోటి కి పైగా విజయవంతమైన ఆటిజం థెరపీ సర్వీసులను కలబోసి, ప్రతీ క్షణాన్నీ ఒడిసిపడుతూ, ఖచ్చితమైన, మీ బిడ్డకు నూటికి నూరుపాళ్లు ఉపయోగపడే ప్రత్యేక ఇంటర్వెన్షన్ ప్రోగ్రాం, థెరపీ గోల్స్, డైలీ థెరపీ, మెటీరియల్, టెక్నిక్, టైం, రిపెటిషన్స్ తో కూడిన థెరప్యూటిక్ ఏఐ (TherapeuticAI™) తో ప్రపంచం మొత్తాన్ని మీ బిడ్డ కోసం పనిచేపిస్తున్నాం. మీ బిడ్డ బంగరు భవితకు 400కు పైగా ప్రత్యేక థెరపీ టెక్నిక్ లు సృష్టించాం.
ఏ రంగంలో చూసినా.. AI ఇప్పుడు ట్రెండింగ్. మనిషి బుర్రని దాటేసి.. మనసుని కూడా లెక్కలేసి చెప్పేలా ముస్తాబు అవుతున్నాయ్. మేం రూపొందించిన థెరప్యూటిక్ ఏఐ ఇంజన్ కూడా అలాంటిదే. ఆటిజం థెరపీ రంగంలో, ఇది ప్రపంచంలోనే తొలి ఆర్టిఫిషియల్ సెర్చింజన్. ఆటిజం చికిత్సల్ని అత్యాధునికంగా అందించేందుకు 400 రకాల ఇన్నోవేటీవ్ విధానాల్ని సిద్ధం చేశాం. అవి బిడ్డ మానసిక, శారీరక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పతున్నాయి. ప్రతి బిడ్డ మానసిక స్థితిని సున్నితంగా అంచనా వేసి.. అందుకు తగిన AI థెరపీ విధానాల్ని థెరపిస్ట్ ల ద్వారా అందిస్తాము. ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో థెరప్యూటిక్ ఏఐ (Therapeutic AI™) విధానాల్ని ఫాలో అవుతున్నాం. మునుపెన్నడూ చూడని మెరుగైన ఫలితాల్ని తల్లిదండ్రుల సమక్షంలో చూస్తున్నాం. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 10.3 మిలియన్ థెరపీలను అందించాం. 97 శాతం సక్సెట్ రేట్ తో. ఇది మా ద్వారా ఆ దేవుడు సాధ్యం చేసిందుకు చాలా సంతృప్తిగా ఉందిని డాక్టర్ శ్రీజారెడ్డి చెబుతున్నారు.
చేయాల్సింది ఇంకెంతో ఉంది..
నిర్విరామంగా పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ ని విస్తరింపజేస్తున్నాం. థెరప్యూటిక్ ఏఐ (TherapeuticAI™) ని మీ పిల్లల భౌగోళిక, మానసిక, శారీరక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తూ అందుబాటులోకి తెస్తున్నాం. గ్లోబల్ గా ఉన్న అన్ని పినాకిల్ సెంటర్లలోనూ నిరంతరం మా రిసెర్చ్ కొనసాగిస్తున్నాం. అలాగే, ఓ ప్రత్యేక OTT ఫ్లాట్ ఫామ్ అందుబాటులోకి తేనున్నాం. దీని ద్వారా మీరు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మాతో మాట్లాడొచ్చు. మీకు మీరుగానే ఓ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుని బిడ్డల విషయంలో తగిన జాగ్రత్తలు, థెరపీలు పొందొచ్చు. ప్రస్తుత సర్వేల ప్రకారం… ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 90 కోట్ల ఆటిజం బాధితులైన పిల్లల జీవితాన్ని వారి కాళ్ళమీద వారు నిలబడి, తమకంటూ జీవితాన్ని ఏర్పరరచుకోగలిగే విధంగా బంగారుమయం చేయాలని ఓ లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు తగిన కార్యచరణతోనే ముందుకు సాగుతున్నాం. ఫ్రాంచైజీల ద్వారా కూడా దేశం వ్యాప్తంగా సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నాం. నాణ్యమైన సేవల్ని అందించేందుకు భాగస్వామ్య పద్ధతుల్లోనూ సెంటర్లను నెలకొల్పుతున్నాం.
రండి.. ఇది పినాకిల్ పిలుపు
ప్రతి తల్లి, తండ్రీ, కుంటుంబం.. అందరం చేతులు కలుపుదాం. పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ మీకు తోడుగా మీతో నడుస్తుంది. మన ఇంట్లో చేసే ప్రార్థన.. మక్కా, జెరూసలేం, కాశీ / తిరుమల/ అరుణాచలం వంటి మహిమాన్విత క్షేత్రాల్లో చేస్తే ఆ క్షేత్ర మహిమ వలన మన ప్రార్ధన కూడా కోట్ల రెట్ల బలాన్ని పొందినట్లే, ప్రపంచ ఆటిజం నాలెడ్జ్ ను, థెరపీలకు గూగుల్ వంటి, పినాకిల్ కోటి థెరపీల అవగాహనను ప్రత్యేకంగా మీ బిడ్డ పుట్టుక నుండి ప్రస్తుత స్థితి వరకు కలబోసి, మీ బిడ్డకు బంగరు జీవితాన్ని అందజేద్దాం. థెరప్యూటిక్ ఏఐ (TherapeuticAI™) తో ప్రపంచం మొత్తాన్నీ, పినాకిల్ సైన్యాన్ని మీ బిడ్డ గురించి పని చేపిద్దాం.
అందుకు తగిన ‘పినాకిల్ సోల్’ (Pinnacle S.O.U.L™) పద్ధతిని ఫాలో అవుదాం. ఓ తల్లిగా, సంస్థ నెలకొల్పిన సీఈఓగా చెబుతున్నా.. మన బిడ్డల్ని వారి కాళ్లపై వాళ్లు నిలబడేలా చేయడం, వారికంటూ జీవితం ఉండే విధంగా చేయడం మనందరి ప్రధమ కర్తవ్యం.. అందరం కలిసి పిల్లల బంగారు భవిష్యత్తుకు పాటుపడదాం. ఆటిజం మహమ్మారి బాధలను అంతం చేద్దాం. ! అని చెబుతూ శ్రీజారెడ్డి తన రీసెర్చ్ వింగ్ వైపు వెళ్లారు. యస్.. బిడ్డల తలరాతల్ని AI తో తిరగరాస్తున్న ఈ తల్లి జర్నీ ఇది. మీరూ కూడా పినాకిల్ తో చేయి కలిపేందుకు.. ఇతర సమాచారం కోసం 9100 181 181 కాల్ చేయొచ్చు. ఇది 24/7 హెల్ప్ లైన్. లేదా.. https://www.pinnacleblooms.org సైట్ ని సందర్శించొచ్చు.