10 గ్రామాల కోసం 10 వేల మందితో 'దేవర' పోరాటం, స్టోరీ లీక్.. మైండ్ బ్లాక్ చేస్తున్న డీటెయిల్స్

First Published May 26, 2024, 7:05 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రం దేవర. డైరెక్టర్ కొరటాల శివ రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రం దేవర. డైరెక్టర్ కొరటాల శివ రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బడ్జెట్ 400 కోట్లు టచ్ అవుతున్నట్లు సమాచారం . ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. మొదటి భాగాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. 

Devara update

ఈ నేపథ్యంలో దేవర మూవీ స్టోరీ గురించి కొన్ని మైండ్ బ్లోయింగ్ విషయాలు లీక్ అయ్యాయి. సినిమా లాంచ్ ఈవెంట్ లోనే డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రం సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఉప్పందించారు. గుర్తింపునకు నోచుకోని ఓ కోస్టల్ ప్రాంతంలో జరిగే కథ ఇది. అక్కడ మనుషుల కంటే.. భయం భక్తి లేని మృగాల లాంటి వారు ఉంటారు. వారిని భయపెట్టేది ఒక్కడే.. అదే దేవర అంటూ కొరటాల శివ కథ గురించి హింట్ ఇచ్చారు. 

కానీ ఇప్పుడు బ్యాక్ డ్రాప్ స్టోరీ మొత్తం లీక్ అయింది. సముద్ర తీరంలో అంతగా గుర్తింపు లేని 10 గ్రామాల రక్షకుడిగా దేవర ఈ చిత్రంలో ఉంటాడట. ఆ పది గ్రామాలు ఉన్న చోట అంతులేని విలువైన నిధి ఉంటుందట. ఆ నిధి కోసం గ్రామాలపై బీభత్సం సృష్టించేందుకు మాస్క్ లు ధరించి మృగాల లాంటి దొంగలు పొంచి ఉన్నారు. 

ఆ దొంగల ముఠా 10 వేలమంది ఉంటారు. వారి వద్ద మారణాయుధాలు ఉంటాయి. తాము అనుకున్న పని చేసేందుకు వారు ఎంత దారుణానికైనా సిద్ధం అవుతారు. కానీ దేవర ఒక్కడు ఆ గ్రామాలకు అండగా ఉంటాడు. దేవర ఆ దొంగల నుంచి గ్రామాలని రక్షించేందుకు సముద్ర తీరంలో అల్లకల్లోలం సృష్టిస్తాడట. 

ఎన్టీఆర్ పరాక్రమం ఫ్యాన్స్ సీట్ల లో నుంచి లేచి గంతులేసేలా ఉండబోతుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ పోరాట సన్నివేశాలు మాత్రమే కాదు.. గ్రామాలని, నిధిని రక్షించడానికి వేసే ఎత్తుగడలు కూడా చాలా ఆసక్తిగా ఉండబోతున్నాయని అంటున్నారు. 

ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుండటం.. ఎన్టీఆర్ రెండు గెటప్పులలో కనిపిస్తుండడంతో తారక్ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నట్లువార్తలు వస్తున్నాయి. 

click me!