Latest Videos

Hangover: హ్యాంగోవర్ కు గుడ్ బై.. దెబ్బకు దిగిపోవాల్సిందే.. 

By Rajesh KarampooriFirst Published May 16, 2024, 4:19 PM IST
Highlights

Hangover: ఏదైనా పార్టీ, ఫంక్షన్ ఎలాంటి అకేషన్ జరిగినా ముందుగా మగాళ్లకు గుర్తుకు వచ్చేది మందు. ఆ మందు ఎక్కువైతే హ్యోంగోవర్ తో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకే చాలామంది ఎంత ఆల్కహాల్ తాగినా ఆ మత్తు వదిలేందుకు ఏదైనా ఓ మాత్ర ఉంటే బాగుండని ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో ఓ మెడిసిన్ వచ్చింది. అదేంటో తెలుసుకుందాం. 

Hangover: ఏదైనా పార్టీ, ఫంక్షన్ ఎలాంటి అకేషన్ జరిగినా ముందుగా మగాళ్లకు గుర్తుకు వచ్చేది మందు. ఆ మందు ఎక్కువైతే హ్యోంగోవర్ తో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకే చాలామంది ఎంత ఆల్కహాల్ తాగినా ఆ మత్తు వదిలేందుకు ఏదైనా ఓ మాత్ర ఉంటే బాగుండని ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలోనే కొంతమంది పరిశోధకులు ఆ దిశగా అడుగు ముందుకు వేస్తున్నారు. ఎంత తాగినా ఆల్కహాల్ మత్తును(హ్యోంగోవర్) తొలగించే విధంగా ఉండే జెల్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

హ్యోంగోవర్ సమయంలో ఈ జెల్ ఉపయోగిస్తే.. జీర్ణవ్యవస్థలో ఆల్కహాల్ ఓ ఎంజైమ్‌ను విడుదల చేస్తుంది. దాంతో అది ఇథనాల్‌ను అసిటేట్‌గా మారుస్తుంది. ఇదిలా ఉంటే ETH జ్యూరిచ్‌ లో విధులు నిర్వహిస్తున్న ఆహార శాస్త్రవేత్త జియాకిసు అతనితో పాటు ఆయన సహచరులు ఇద్దరు ఓ పరిశోధనకు చెందిన అధ్యయనాన్ని నేచర్ నానోటెక్నాలజీలో ప్రచురించారు. ఆల్కహాల్ ప్రభావాలను వెంటనే తగ్గించే టిప్స్ ను కనుగొనేందుకు సంబంధించిన ఈ అధ్యయనానికి చెందినది. 

మద్యం మత్తు..

మనశరీరంలో ఆల్కహాల్‌ చేరినప్పుడు అది ఎసిటాల్డిహైడ్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎసిటాల్డిహైడ్ శరరంలో ఉత్పత్తి కావడంతో కాలేయం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మందుబాబులు హ్యాంగోవర్‌ తో ఇబ్బంది పడుతుంటారు. ఈ విషయాల పై స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో విధులు నిర్వహిస్తున్న బయోకెమిస్ట్ డుయో జు తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం పరిశోధకులు కనుగొంటున్న జెల్ లో ఉండే మంచి లక్షణం ఆల్కహాల్‌ను నేరుగా అసిటేట్‌గా మారుస్తుందని చెబుతున్నారు.  

ఏటా 30 లక్షల మంది మృతి.. 

ఆల్కహాల్ ను తీసుకున్నప్పుడు అది కడుపులోని ప్రేగులలో ఉండే శ్లేష్మ పొర ద్వారా రక్తంలోకి కలుస్తుంది. దీని కారణంగా క్యాన్సర్, జీర్ణకోశ వాపు, కాలేయ వ్యాధులు సంభవిస్తాయంటున్నారు నిపుణులు. ఇక WHO ప్రకారం ఎక్కువగా మద్యపానం తీసుకోవడం కారణంగా ప్రతి ఏడాది దాదాపుగా 3 మిలియన్ల మంది మృత్యువాత పడుతున్నారు. అందుకే జీర్ణాశయం ప్రేగులలో ఆల్కహాల్‌ను విచ్ఛిన్నం చేసే ప్రోటీన్ జెల్‌ను ETH జ్యూరిచ్‌లోని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆల్కహాల్ స్థాయులను రక్తంలో పెరగకుండా, శరీరానికి ఎసిటాల్డిహైడ్  హాని కలిగించకుండా ఉండేందుకు జెల్‌ను మద్యం సేవించే ముందు తీసుకోవచ్చు. మార్కెట్లో అందుబాటులో ఉండే ప్రాడక్ట్ మాదిరిగా కాకుండా ఈ కొత్త ఉత్పత్తి బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. కొత్తగా అందుబాటులోకి వచ్చే జెల్ జీర్ణాశయం, ప్రేగులలో ఆల్కహాల్ ఉన్నంత వరకే పనిచేస్తుంది. 

ఈ మూడింటితో జెల్..

జెల్ ను తయారు చేసేందుకు పరిశోధకులు సాదా పాలవిరుగుడు ప్రోటీన్‌ను వినియోగించారు. సన్నని, పొడవైన ఫైబర్‌లను తయారుచేసేందుకు గంటల కొద్ది ఉడకబెట్టారు. నీటిని ద్రావకం, ఉప్పు యాడ్ చేయడం ద్వారా ఫైబ్రిల్స్  ఒకదానితో ఒకటి చేరి జెల్ తయారువుతుంది. ఈ జెల్ అన్నింటికంటే నెమ్మదిగా జీర్ణమవుతుంది. కానీ ఆల్కహాల్‌ను విచ్ఛిన్నం చేయడానికి జెల్‌కు చాలా ఉత్ప్రేరకాలు విడుదల చేస్తుంది. కొద్ది మొత్తంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్రేగులలో ప్రతి చర్యను ప్రేరేపించడానికి ఉపయోగపడుతుంది. నానోపార్టికల్స్, గ్లూకోజ్ మధ్య అప్‌స్ట్రీమ్ ప్రతిచర్య  ద్వారా ఉత్పత్తి అవుతాయి.  

ఎలుకల పై జెల్ ప్రయోగం.

కొత్త జెల్ ప్రభావం ఆల్కహాల్ ఇచ్చిన ఎలుకల పై ఎలా పని చేసిందో  పరిశోధకులు పరీక్షించారు. క్రమం తప్పకుండా పది రోజుల పాటు ఎలుకల పై జెల్ పరీక్షించారు. ఈ ఎలుకలు తక్కువ హానికరమైన ఎసిటాల్డిహైడ్‌ను సేకరించాయి. దాంతో వాటి కాలేయాలలో తక్కువ ఒత్తిడిని చూపించాయి. పది రోజులు ఆల్కహాల్ ఇచ్చిన ఎలుక పై చేసిన ప్రయోగంలో విజయం సాధించడమే కాకుండా జెల్ శాశ్వత ప్రభావాన్ని చూపించాయి.
 

click me!