Oil Resuse : పూరీ చేశాక నూనె నల్లగా మారిందా? మళ్లీ ఫ్రెష్ గా ఎలా చేయాలో తెలుసా?

ramya Sridhar | Published : May 8, 2025 9:17 AM
Google News Follow Us

నల్లగా మారిన నూనెను మరోసారి వాడాలంటే మనసురాదు.అలా అని.. నూనెను పారబోయలేం. అయితే.. మనం కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే.. మళ్లీ ఆ నూనెను తాజాగా , ఫ్రెష్ గా మార్చవచ్చు.

15
Oil Resuse : పూరీ చేశాక నూనె నల్లగా మారిందా? మళ్లీ ఫ్రెష్ గా ఎలా చేయాలో తెలుసా?
cooking oil


మనం ఎంత డీప్ ఫ్రై ఆహారాలు ఎవాయిడ్ చేయాలి అనుకున్నా కూడా.. ఎప్పుడో ఒకసారి పూరీ, పకోడీ, వడ లాంటివి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటివి చేయాలంటే నూనె ఎక్కువ వాడాల్సి వస్తుంది. ఇక.. ఈ పూరీలు, పకోడీలు వేయించిన తర్వాత నూనె నల్లగా మారిపోతుంది. ఇలా నల్లగా మారిన నూనెను మరోసారి వాడాలంటే మనసురాదు.అలా అని.. నూనెను పారబోయలేం. అయితే.. మనం కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే.. మళ్లీ ఆ నూనెను తాజాగా , ఫ్రెష్ గా మార్చవచ్చు. దాని కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...

25

ఈ నూనె  శుభ్రం చేయడానికి మనకు కేవలం ఒక బంగాళదుంప ఉంటే చాలు. ఆ బంగాళ దుంపను ఎలా వాడాలో మాత్రం మనకు తెలిసి ఉండాలి.
దీని కోసం మీరు  మీ దగ్గర ఇప్పటికే మిగిలిపోయిన నూనె ఉంటే, దానిని వేడి చేయండి. పచ్చి బంగాళాదుంప ముక్కలను నూనెలో వేయండి. ఈ విధంగా ఏదైనా వేయించడం ద్వారా, నూనె ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటుంది.  బంగాళాదుంప స్పాంజిలా పనిచేస్తుంది. నూనెలో వేసిన వెంటనే, అది దాని లోపల ఉన్న మురికిని గ్రహిస్తుంది. దానిలో ఉన్న స్టార్చ్ నూనె నల్లబడకుండా నిరోధిస్తుంది.

35
cooking oil

నూనె ఎక్కువ మొత్తంలో ఉంటే.. బంగాళ దుంప ముక్కలు వేగిన తర్వాత వాటిని తీసి, మళ్లీ కొత్త ముక్కలు వేయాలి. ఇలా చేయడం వల్ల నూనె మొత్తం శుభ్రపడుతుంది. స్వచ్ఛంగా కనపడుతుంది.

45

అంతేకాదు, మీ దగ్గర మొక్కజొన్న పిండి ఉన్నా కూడా.. నూనెను శుభ్రం చేయవచ్చు. దాని కోసం మీరు నల్లగా మారిన నూనెను వేడి చేయాలి. అలా వేడి చేస్తున్న సమయంలో.. మొక్క జొన్న పిండిని నీటిలో కలిపి పక్కన పెట్టుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత... ఈ మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని ఆ నూనెలో వేయాలి. అది వేగుతున్న సమయంలో.. నూనెలోపల ఉన్న మురికి మొత్తం మొక్కజొన్న పిండికి అంటుకుపోతుంది. దీంతో.. బాణలిలో నూనె  మళ్లీ కొత్తగా ఫ్రెష్ గా కనపడుతుంది.


 

55
Reusing Cooking Oil

ఈ పద్ధతులతో నూనెను శుభ్రం చేయండి
నూనెలోని మురికిని శుభ్రం చేయడానికి, మీరు బేకింగ్ సోడా, యారోరూట్‌లకు నీరు జోడించడం ద్వారా ఒక ద్రావణాన్ని తయారు చేయవచ్చు. నూనెలో వేసి గ్యాస్‌ను ఆన్ చేయండి. కొంత సమయం తర్వాత ద్రావణం చిక్కగా అవుతుంది. ఈ విధంగా  మురికి ఈ ద్రావణానికి అంటుకుంటుంది. మీ నూనె కూడా శుభ్రం అవుతుంది.

Read more Photos on
Recommended Photos