ఘరానా మోసాలు...పోలీసులకు చిక్కిన నఖిలీ సెంట్రల్ విజిలెన్సు ఆఫీసర్

First Published Sep 2, 2020, 7:24 PM IST

సౌత్ ఇండియా సెంట్రల్ విజిలెన్సు ఆఫీసర్ ను అంటూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

కరీంనగర్: సౌత్ ఇండియా సెంట్రల్ విజిలెన్సు ఆఫీసర్ ను అంటూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నతోద్యోగినంటూ సివిల్ పంచాయితీల్లో తలదూరుస్తూ అందినకాడికి దండుకుంటున్న అతడిపై నిఘా వుంచిన కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.
undefined
కరీంనగర్ సీపీ విబి కమలాసన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ కు చెందిన దోమల రమేష్ ఈజీ మనీ కోసం మోసాలబాట పట్టాడు. ఇందులో భాగంగానే హుజరాబాద్ లోని డిసిఎంఎస్ కాంప్లెక్స్ లో సివిల్ పంచాయతీలు పరిష్కరించేందుకు ఓ కార్యాలయం తెరిచాడు.
undefined
తాను జిల్లా సివిల్ కోర్ట్ విజిలెన్స్ అధికారిగా... తనను వరంగల్ జిల్లా జడ్జి నియమించినట్లుగా నియామక ఉత్తర్వులను సృష్టించుకున్నాడు. తనకుతానే అధికారిగా పరిచయం చేసుకునేందుకు ఫేస్ బుక్ తో పాటు వివిధ సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసుకుంటున్నాడు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఛీటింగ్ కు పాల్పడ్డాడని సీపీ వెల్లడించారు.
undefined
గతంలో ఇతడు స్కూల్ అసిస్టెంట్ గా పని చేసినట్లుగా నకిలీ ఆర్దర్లు సృష్టించి మోసాలకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం వరంగల్ డిస్ట్రిక్ట్ సివిల్ కోర్ట్ జ్యుడీషియల్ విజిలెన్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నట్టు నమ్మించేందుకు రెండు కార్లను జ్యుడీషియల్ శాఖ స్టిక్కర్లను వేయించినట్టు సిపి తెలిపారు.
undefined
దేశం మొత్తంలో జ్యూడిషల్ విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులు రెండే ఉంటాయని... అలా సౌత్ ఇండియా మొత్తానికి తాను ఒక అధికారినని నమ్మించేవాడని పేర్కొన్నారు. తన ధ్వారా కాని పనంటూ ఏది ఉండదని చెప్పి నమ్మించి మోసాలు చేయడంలో ఇతడు ఆరితేరాడని సిపి వెల్లడించారు.
undefined
click me!