పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్: కరీంనగర్‌ నుండి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం

By narsimha lodeFirst Published Mar 4, 2024, 7:03 AM IST
Highlights

కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి ఎన్నికల ప్రచారానికి  బీఆర్ఎస్ శ్రీకారం చుట్టనుంది.

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కరీంనగర్ నుండి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రారంభించనుంది.  తెలంగాణ రాష్ట్రంలో  అధికారాన్ని ఆ పార్టీ కోల్పోయింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో  మెజారిటీ సీట్లను దక్కించుకోవాలనే లక్ష్యంతో  బీఆర్ఎస్ వ్యూహారచన చేస్తుంది.

కరీంనగర్  జిల్లా బీఆర్ఎస్ కు మంచి పట్టుంది. తెలంగాణ ఉద్యమం సాగే సమయంలో ఈ జిల్లా బీఆర్ఎస్ కు  పెట్టని కోటగా ఉండేది. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి గతంలో  కేసీఆర్  ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు.

also read:వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

తమ పార్టీకి మంచిపట్టున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండే  ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని  బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది.  ఇవాళ  పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించనుంది. 

బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు ముగ్గురు ఆ పార్టీని వీడారు. లోక్ సభ ఎన్నికల్లో  గెలుపు గుర్రాలను బరిలోకి దింపాలని ఆ పార్టీ వ్యూహరచన చేస్తుంది.ఈ క్రమంలోనే సర్వే నివేదికల ఆధారంగా  అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. అయితే  రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ ను వీడారు. ఈ పరిణామం రాజకీయంగా ఆ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలను  రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

కరీంనగర్ లో నిర్వహించనున్న బహిరంగ సభ విషయమై  పార్టీ నేతలతో కేసీఆర్  చర్చించారు. లోక్ సభ ఎన్నికల్లో విజయం కోసం పార్టీ నేతలంతా కృషి చేయాలని  కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు.  

also read:డోన్‌లో టీడీపీ నేతల పోటాపోటీ ర్యాలీలు: మీసం మేలేసిన సుబ్బారెడ్డి

2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని  17 ఎంపీ స్థానాల్లో  9 స్థానాల్లో విజయం సాధించింది.  కాంగ్రెస్ పార్టీ  మూడు స్థానాల్లో గెలుపు దక్కించుకుంది.  బీజేపీ నాలుగు స్థానాల్లో గెలిచింది.అయితే  గత ఎన్నికల్లో గెలిచిన స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలని  బీఆర్ఎస్  ప్లాన్ చేస్తుంది.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఏ మేరకు అమలు చేసింది. హామీల అమలులో ఆ పార్టీ ఏ రకంగా వైఫల్యం చెందిందనే విషయాలపై  ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని  బీఆర్ఎస్ భావిస్తుంది.  తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ సర్కార్ ఏ రకంగా  తూట్లు పొడిచిందో  వివరించాలని ఆ పార్టీ భావిస్తుంది. 

కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగించడాన్ని నిరసిస్తూ  ఈ ఏడాది ఫిబ్రవరి  13న నల్గొండ వేదికగానే  బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది.ఈ సభ నిర్వహించి నెల రోజులు కాకముందే  కరీంనగర్ వేదికగా  మరో బహిరంగ సభను ఆ పార్టీ నిర్వహించనుంది. 
 

click me!