దుబాయ్‌లో జైలు శిక్ష, విముక్తి: 18 ఏళ్లకు హైద్రాబాద్‌కు, భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు

By narsimha lode  |  First Published Feb 21, 2024, 12:29 PM IST


దుబాయ్ లో జైలు శిక్ష అనుభవించిన కరీంనగర్ వాసులు 18 ఏళ్ల తర్వాత  హైద్రాబాద్ కు చేరుకున్నారు. చాలా కాలం తర్వాత తమ వారిని చూడడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.


హైదరాబాద్: ఉపాధి కోసం  దుబాయ్ వెళ్లిన  కరీంనగర్ వాసులు  ఓ కేసులో జైలు శిక్షను అనుభవించారు. అయితే  బాధిత కుటుంబ సభ్యులు  ఈ విషయమై గత ప్రభుత్వానికి మొర పెట్టుకోవడంతో   అప్పటి ప్రభుత్వం  బాధితులను జైలు నుండి విడిపించేందుకు తీసుకున్న  చర్యలు ఎట్టకేలకు ఫలించాయి. దరిమిలా బాధితులు  బుధవారం నాడు హైద్రాబాద్ కు చేరుకున్నారు. 18 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో  బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చందుర్తి మండలానికి చెందిన  గోళం నాంపల్లి, శివరాత్రి హనుమండ్లు, కొనరావుపేట గ్రామానికి చెందిన దండుగుల లక్ష్మణ్  లు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు.

also read:శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్మార్ట్ ట్రాలీలు: నెట్టింట వీడియో వైరల్

Latest Videos

undefined

దుబాయ్ లో వీరు ఉంటున్న ప్రాంతంలో  నేపాల్ కు చెందిన  బహదూర్ సింగ్ అనే వాచ్ మెన్ హత్యకు గురయ్యాడు. అయితే  ఈ కేసులో  బాధితులు ఇరుక్కున్నారు. అయితే స్థానికంగా ఉన్న భాష వీరికి రాదు.  ఈ కేసు విచారణ సమయంలో బాధితులు ఏం చెప్పారో ఏమో తెలియదు... కానీ ఈ కేసులో  స్థానిక కోర్టు వీరికి పదేళ్ల జైలు శిక్ష విధించింది.  ఈ విషయమై  దుబాయ్ కోర్టులో  అప్పీలు చేశారు.  అయితే  ఈ సమయంలో  వీరి శిక్ష 25 ఏళ్లకు పెరిగింది.  

also read:ఆర్టీసీ బస్సు ఫుట్ బోర్డుపై జర్నీ: పట్టుతప్పి కిందపడ్డ మహిళ, ఏమైందంటే?

దుబాయ్ చట్టాల మేరకు  మృతుడి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని జైలు నుండి విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది.ఈ విషయమై అప్పటి తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు  2011లో  నేపాల్ వెళ్లాడు. మృతి చెందిన బహదూర్ సింగ్  కుటుంబ సభ్యులతో చర్చించారు. బాధిత కుటుంబానికి  రూ. 15 లక్షల చెక్కును అందించారు. అంతేకాదు క్షమాభిక్షకు అవసరమైన పత్రాలపై మృతుడు బహదూర్ సింగ్  కుటుంబ సభ్యులతో సంతకాలు చేయించారు. అదే సమయంలో దుబాయ్ లో కూడ చట్టాలు సరళతరం చేశారు. దరిమిలా  ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు జైలు నుండి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది. దుబాయ్ కోర్టులో ఆరోపణలు ఎదుర్కోంటున్నవారు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. దరిమిలా మరోసారి  దుబాయ్ కోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు.

also read:ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు: స్టే ఇచ్చిన ఏపీ హైకోర్టు

మరో వైపు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిత్వశాఖ చొరవతో  దుబాయ్ రాజు అపాయింట్ మెంట్  సాధించి ఈ కేసులో క్షమాభిక్ష  విషయమై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం  చర్చలు జరిపింది. ఈ విషయమై దుబాయ్ ప్రభుత్వం అధికారులతో సమీక్ష నిర్వహించింది. దరిమిలా  జైల్లో ఉన్న  వారు విడుదలయ్యేందుకు  చర్యలు తీసుకుంది.  ఇందుకు సంబంధించిన న్యాయ సంబంధమైన ప్రక్రియ పూర్తి కావడంతో  జైల్లో గడిపిన వారు  హైద్రాబాద్ కు తిరిగి వచ్చారు. తమ కుటుంబ సభ్యులను స్వదేశానికి రప్పించడంలో  మాజీ మంత్రి కేటీఆర్ చొరవ చూపినట్టుగా వారు చెబుతున్నారు.

click me!