తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలోని ఉత్తర, తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో సుమారు 60 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలోని ఉత్తర,తెలంగాణల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఉత్తర తెలంగాణలో భారత రాష్ట్ర సమితికి పట్టుంది. అయితే ఈ ఎన్నికల్లో అందుకు భిన్నంగా ఓటర్లు తీర్పును ఇచ్చినట్టుగా అర్ధమౌతుంది. తొలి రౌండ్లను పరిశీలిస్తే కాంగ్రెస్ అభ్యర్థులు తమ సమీప భారత రాష్ట్ర సమితి అభ్యర్థులపై ముందంజలో కొనసాగుతున్నారు.
also read:Telangana Assembly Election Results 2023 LIVE : కేసీఆర్ తో సహా ఆరుగురు మంత్రులు వెనుకంజ...
undefined
ఈ దఫా ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తో బస్సు యాత్రను కూడ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. మూడు రోజుల పాటు రాహుల్ గాంధీ ఉత్తర తెలంగాణలో బస్సు యాత్రను నిర్వహించారు . ఆ తర్వాత ఉత్తర తెలంగాణలో కూడ ప్రియాంక గాంధీ కూడ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
also read:Telangana Election results 2023:తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు కారణాలు
దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీవైపు ఓటర్లు దాదాపు రెండు మాసాల ముందే మొగ్గు చూపుతున్నట్టుగా తమకు సంకేతాలు అందాయని కాంగ్రెస్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ వైపు ఓటర్లు మొగ్గు చూపడానికి కొంత సమయం పట్టిందని సీనియర్ కాంగ్రెస్ నేత అభిప్రాయపడ్డారు.
also read:Achampet Election Result 2023: అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఫలితాలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్ 30న పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో మూడో దఫా అధికారాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టాలని భారత రాష్ట్ర సమితి అస్త్రశస్త్రాలను సంధించింది. కాంగ్రెస్ పార్టీ ఈ దఫా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. దక్షిణాదిలో తెలంగాణలో పట్టు సాధించాలని బీజేపీ నాయకత్వం అన్ని అస్త్రాలను ప్రయోగించింది. ఈ ఎన్నికల్లో జనసేన బీజేపీలు కలిసి పోటీ చేశాయి. బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ,సీపీఐ మధ్య ఈ ఎన్నికల్లో పొత్తు ఉంది. కాంగ్రెస్ పార్టీ 118 స్థానాల్లో పోటీ చేయగా, సీపీఐ ఒక్క స్థానంలో బరిలోకి దిగింది. ఈ ఎన్నికల్లో సీపీఐఎం, బీఎస్ పీ ఒంటరిగా బరిలోకి దిగింది.