మూత్రం పసుపు కలర్ లోకి ఎందుకు మారుతుంది?

First Published | May 15, 2024, 11:47 AM IST

మన శరీరంలో ఎన్నో రకాల సమస్యల సంకేతాలు కనిపిస్తాయి. అందులో ఒకటి పసుపు రంగులో మూత్రం. నిజానికి మూత్రం పసుపు కలర్ లో ఉండటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. 
 

మన శరీరం మన ఆరోగ్యానికి ప్రతిబింబం. మన శరీరంలో కనిపించే మార్పులు మనం ఆరోగ్యంగా ఉన్నామో, లేమో? చెప్తాయి. మన ముఖం నుంచి కళ్ల వరకు ప్రతి ఒక్కటీ మన  ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలను చెప్తాయి. అంతేకాదు మన మూత్రం కూడా మన ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతుంది. మూత్రం రంగు ఆధారంగా మనకు ఉన్న అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోవచ్చు. 

ఇది తెలిసినా చాలా మంది దీని గురించి అస్సలు పట్టించుకోరు. కానీ మన మూత్రం రంగు మారితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇది దీర్ఘకాలంగా ఉంటే. మన మూత్రం పసుపు రంగులోకి మారడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇది కొన్ని అనారోగ్య సమస్యలను సూచిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అసలు మూత్రం ఎందుకు పసుపు రంగులోకి మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Latest Videos


మూత్రం పసుపు రంగులోకి మారడానికి ఎన్నో రకాల ఆహారాలు కూడా ఒక కారణమే. అలాగే పోషకాహారం, ఆరోగ్య కారకాలు కూడా మూత్రం పసుపు రంగులోకి మారేలా చేస్తాయి. వీటితో పాటుగా కొన్ని ప్రధాన కారణాలు కింద ఉన్నాయి. 

urine


డైట్, సప్లిమెంట్స్

స్పెషల్ ఫుడ్, సప్లిమెంట్ల వల్ల కూడా మూత్రం రంగు మారే అవకాశం ఉంది. ఉదాహరణకు, విటమిన్ బి మాత్రలను వేసుకోవడం లేదా క్యారెట్లను ఎక్కువగా తినడంవల్ల మూత్రం పసుపు రంగులోకి మారుతుంది. 
 

ఆర్ద్రీకరణ స్థాయి

ఎర్ర రక్త కణాల నుంచి హిమోగ్లోబిన్ క్షీణించడం ఫలితంగా వచ్చే యురోబిలిన్ మూత్రం పసుపు రంగులోకి మారడానికి అత్యంత సాధారణ కారణం. బాగా హైడ్రేటెడ్ వ్యక్తి  మూత్రం సాధారణంగా లేత పసుపు రంగులో ఉంటుంది. అయినప్పటికీ నిర్జలీకరణానికి గురైనప్పుడు మూత్రం ముదురు పసుపు లేదా ముదురు రంగులోకి మారుతుంది.
 

urine

అనారోగ్య సమస్యలు

మూత్రం రంగు మారడానికి ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా ఒక కారణమే. కాలేయం, మూత్రపిండాల వ్యాధులు కూడా మూత్రం రంగును మారుస్తాయి. ఉదాహరణకు.. కామెర్ల వల్ల కూడా మూత్రం పసుపు రంగులోకి గోధుమ రంగులోకి మారుతుంది. ఇది బిలిరుబిన్ స్థాయిలు పెరగడం వల్ల వస్తుంది.
 

పసుపు మూత్రం సాధారణమే అయినప్పటికీ.. ముదురు రంగులో ఉంటే లేదా నొప్పి లేదా ఘాటైన వాసనతో పాటుగా ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్ల చూపించుకోండి. ఇది మిమ్మల్నిఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది.

click me!