టోల్ గేట్ల వద్ద వీళ్లు అస్సలు టోల్ కట్టక్కర లేదు

First Published | Nov 26, 2024, 12:54 PM IST

మనం రోడ్లు ఉపయోగించినందుకు ప్రతి జిల్లాలోనూ టోల్ గేట్ల దగ్గర టోల్ ఛార్జ్ వసూలు చేస్తారు. రోడ్లు, హైవేల నిర్మాణ, నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం టోల్ ట్యాక్స్ కట్టించుకుంటుంది. అయితే జాతీయ రహదారుల చట్టం ప్రకారం కొంతమంది టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ లిస్టులో మీరున్నారేమో ఇక్కడ చెక్ చేసుకోండి. 

టోల్ ట్యాక్స్ అసలు ఎందుకు వసూలు చేస్తారో మీకు తెలుసా? జాతీయ, రాష్ట్ర రహదారులు, వంతెనలు, సొరంగాల నిర్వహణ కోసం టోల్ వసూలు చేసి ఉపయోగిస్తారు. అంతేకాకుండా రోడ్లు, హైవేల నిర్వహణ, మరమ్మతుల కోసం కూడా ఈ డబ్బును ఉపయోగిస్తారు. అయితే జాతీయ రహదారుల చట్టం ప్రకారం కొంతమంది టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు సాధారణ ప్రజల కంటే ముఖ్యమైన వాళ్లు. వాళ్లెవరో ఇప్పడు తెలుసుకుందాం. 

NHAI టోల్ ట్యాక్స్ వసూలు గురించి కొన్ని నియమాలు, మినహాయింపులు విడుదల చేసింది. వాహనం రకం, ప్రయాణించే దూరం బట్టి టోల్ ట్యాక్స్ మారుతుంది. ట్రక్కులు, బస్సులకు కార్ల కు కూడా వేరువేరుగా ఉంటుంది. టోల్ గేట్ కి 20 కి.మీ. రేడియస్ లో నివసించే వాహనదారులకు లోకల్ పాస్ ఇస్తారు. దీన్ని నెలనెలా రీఛార్జ్ చేసుకోవాలి. టోల్ ప్లాజాకి దగ్గరగా నివసించే వారు తరచూ దాన్ని దాటుతూ తిరగాల్సి వస్తుంది. వాళ్లు ప్రతి సారి టోల్ కట్టడం వల్ల ఆర్థికంగా నష్టపోతారు. అందువల్ల ప్రతి సారి టోల్ కట్టకుండా మంత్లీ పాస్ ఇస్తారు.


అలాగే ఏ వాహనం అయినా రోడ్డుపై ఎంత దూరం ప్రయాణిస్తే అంతే దూరానికి టోల్ వసూలు చేసేలా కేంద్ర ప్రభుత్వం, NHAI ప్లాన్ చేస్తున్నాయి. జీపీఎస్, ఇంటర్నెట్ సౌకర్యాలను ఉపయోగించి ఈ సిస్టమ్ ని డెవలప్ చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఇదే జరిగితే భవిష్యత్తులో మరింత పారదర్శకంగా టోల్ వసూలు అవుతుంది. మీరు కేవలం 2 కి.మీ. కారులో వెళితే 2 కి.మీ. ఎంత టోల్ కట్టాలో అంతే ఆటోమెటిక్ గా డెబిట్ అవుతుంది. అదే మీరు లాంగ్ టూర్.. అంటే సుమారు 200 కి.మీ వెళితే దానికి అవసరమైన టోల్ ఆటో డెబిట్ చేస్తారు.  ఫాస్ట్ ట్యాగ్ వచ్చిన తర్వాత టోల్ వసూలులో ట్రాన్స్‌పరెన్సీ పెరిగింది.

కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం కొన్ని వాహనాలకు టోల్ ట్యాక్స్ ఉండదు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలకు టోల్ లేదు. అంబులెన్స్, ఫైర్ ఇంజన్ లాంటి వాహనాలకు కూడా టోల్ ఉండదు. సైనిక వాహనాలు, రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులు, ఎంపీలు, హైకోర్టు జడ్జీలు వాడే వాహనాలకు టోల్ ఉండదు. పరమవీర చక్ర, అశోక చక్ర లాంటి అవార్డులు పొందిన వారికి, ప్రభుత్వ బస్సులకు కూడా టోల్ వసూలు చేయరు. ఇందులో ప్రభుత్వ బస్సులంటే అద్దె బస్సులు కావు. కేవలం ప్రభుత్వం అండర్ లో నడిచే బస్సులకు మాత్రమే టోల్ ఉండదు. 

ఇదే కాకుండా 24 గంటల్లో ఒకే టోల్ ప్లాజాను రెండు సార్లు దాటితే టోల్ ట్యాక్స్ లో 1.5 రెట్లు మాత్రమే చెల్లించాలి. రెండు కంటే ఎక్కువ సార్లు దాటితే మొత్తం టోల్ ట్యాక్స్ లో మూడింట రెండు వంతులు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. రెగ్యులర్ గా హైవేపై సొంత వాహనాల్లో ట్రావెల్ చేసే వారికి మంత్లీ పాస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీ అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. మీరు గనుక ఈ కేటగిరీ వాహనాల్లో ఉంటే ఫ్రీ టోల్ సదుపాయాన్ని ఉపయోగించుకోండి.  

Latest Videos

click me!