చికెన్ లో ఈ భాగం మాత్రం అస్సలు తినకూడదు

First Published | Nov 26, 2024, 1:10 PM IST

చికెన్ అంటే మీకు చాలా ఇష్టమా?  అయితే, చికెన్ లో ఒక భాగం మాత్రం అస్సలు తినకూడదట. ఏ భాగం తినకూడదో తెలుసుకుందాం...

చికెన్ ప్రియులు మన చుట్టూ చాల ామంది ఉంటారు. వారిలో కొందరికి ప్రతిరోజూ చికెన్ ఉండాల్సిందే.  ముక్క లేనిదే మాకు ముద్దు దిగదు అని చెబుతూ ఉంటారు. నిజానికి చికెన్ ఆరోగ్యానికి మంచిదే.  ఈ మధ్యకాలంలో చికెన్  తినేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది.  ఎందుకంటే.. చికెన్ లో మన శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వ్యాయామం చేసేవారికి ప్రోటీన్ అవసరం  కాబట్టి.. చికెన్ తింటూ ఉంటారు.

మాంసాహార ప్రియులు రెగ్యులర్ గా చికెన్ తింటూ ఉంటారు. ఈ చికెన్ వండటం చాలా సులభంగా ఉంటుంది.  దీని ధర కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి.. అందరూ తింటూ ఉంటారు. చికెన్ తో చాల ా రకాల  రెసిపీలు చేసుకుంటూ ఉంటారు.


కొందరు రోజుకోసారి తింటారు, కొందరు వారానికోసారి, మరికొందరు అరుదుగా. మీరు ఎప్పుడు తిన్నా చికెన్ లో ఒక భాగం మాత్రం  అస్సలు తినకూడదట. మరి, ఆ భాగం ఏంటో చూద్దాం..

చికెన్ చర్మం తినడం మంచిది కాదు ఎందుకంటే అందులో కొవ్వు ఎక్కువ, ఫ్రెష్‌గా ఉండటానికి కెమికల్ ఇంజెక్షన్ ఇస్తారు. చికెన్ చర్మం దూరంగా ఉండాలని హృద్రోగ నిపుణులు చెబుతున్నారు.

బ్రాయిలర్ కోడి తొడ భాగానికి ఇంజెక్షన్ ఇస్తారు. బరువు పెరగాలని, జనం త్వరగా కొంటారని. ప్రముఖ హోటళ్లలో జనం ఎక్కువగా కొనేది తొడ భాగమే.

నాటు కోడిని మాత్రం ధైర్యంగా తినొచ్చు ఎందుకంటే ఎలాంటి కెమికల్స్, ఇంజెక్షన్లు వాడరు. కాబట్టి.. దీనిని తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎలాంటి భయం లేకుండా తినొచ్చు.

ఒమెగా 3, 6 తక్కువగా ఉన్నవారు వారానికోసారి చికెన్ చర్మం తినొచ్చు. రోజూ చికెన్ తినేవారు బ్రెస్ట్ భాగం తినాలి.

రోజూ చికెన్ తినేవారికి దీని గురించి బాగా తెలుసు కానీ అప్పుడప్పుడూ లేదా వారానికోసారి తినేవారు రుచి కోసం ఏది దొరికినా తినేస్తారు.

Latest Videos

click me!