తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ రావడంలో ఈ సినిమా ముఖ్య పాత్ర పోషించింది. తరుణ్ హీరోగా పరిచయం అవుతూ నటించిన తొలి సినిమానే పెద్ద బ్లాక్ బస్టర్ కావడంతో ఆయనకు సినిమాలు క్యూ కట్టాయి. ఇలా వరుసగా లవ్ స్టోరీస్ చేసి విజయాలు అందుకుని తక్కువ టైమ్‌లోనే లవర్ బాయ్‌గా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు తరుణ్.
తిరుగులేని స్టార్‌గా ఎదిగారు. కానీ ఆ తర్వాత ఆయన డౌన్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు. మొత్తంగా పవన్ వదిలేసిన సినిమా చేసి హీరోగా ఫస్ట్ బ్రేక్ అందుకోవడమే కాదు, లవర్ బాయ్‌గా స్టార్‌గా ఎదిగాడు తరుణ్.