Image: Getty
ఓసీడీ ఒక వ్యాధి. ఈ సమస్య వల్ల బాధితుడు నియంత్రణ లేని ఆందోళనకు పదేపదే గురవుతుంటాడు. అందుకే ఈ వ్యాధి ఉన్నవారు నిలకడగా ఉండలేకపోతుంటారు. ఒకే విషయాన్ని పదేపదే చెప్పడం ఈ వ్యాధికున్న అత్యంత సాధారణ లక్షణం. అంతదాకా ఎందుకే శర్వానంద్ ‘మహానుబావుడు’ సినిమా చూసే ఉంటారుగా.. సేమ్ అందులో శర్వానంద్ క్యారెక్టర్ లా చేస్తారన్న మాట. అంటే పదేపదే చేతులు కడుక్కోవడం, ఇంట్లో అన్ని సరిగ్గా ఉన్నాయా? లేదా? అని చెక్ చేయడం వంటివి ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. ఈ వ్యాధితో బాధపడుతున్నవారి అలవాట్లు ఇంట్లో వారితో పాటుగా కొన్నిసార్లు చుట్టుపక్కల వారిని కూడా ఇబ్బంది పెడుతాయి. ఈ వ్యాధి గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం పదండి.
Image: Getty
ఓసీడీ కారణాలు
సెరోటోనిన్ ఒక శక్తివంతమైన న్యూరోట్రాన్స్మిటర్. ఇది మన శరీరంలోని ఎన్నో విధులకు అవసరం. అయితే ఇది అసమతుల్యంగా మారడం వల్ల ఓసీడీ సమస్య ఏర్పడుతుందని పరిశోధనల్లో తేలింది. ఇది జన్యుపరమైనది కూడా కావొచ్చు. మెదడు నిర్మాణం, జన్యువులు, ఒత్తిడి ఓసిడికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
Image: Getty
ఓసీడీ లక్షణాలు
- తరచుగా చేతులు కడుక్కోవడం. అవతలివారిని ముట్టుకోకపోవడం. ఇంటిని, మనుషులను శుభ్రంగా లేరని అనడం చేస్తుంటారు. ముఖ్యంగా ఈ పేషెంట్లు ఎప్పుడూ చేతులను కడుగుతూనే ఉంటారు. ఇది ఓసీడీ అత్యంత సాధారణ లక్షణం.
- దీనివల్ల ఎవరికైనా, ఎప్పుడైనా చెడు జరగొచ్చని లేదా, ప్రమాదం జరగొచ్చని తరచూ భయపడుతూ ఉంటారు.
- గ్యాస్ ఆఫ్ చేశారా? లేదా? ఫ్యాన్ లేదా లైట్స్ పనిచేస్తున్నాయా? లేదా వంటివి ఎప్పుడూ చెక్ చేస్తుంటారు.
Image: Getty
ఇంటి సామాన్లు చక్కగా ఉండాలంటారు. ఇంట్లో కొంచెం కూడా చెత్త ఉండనీయరు. ఏదీ ఏ ప్లేస్ లో ఉండాలో అక్కడే ఉండాలంటారు.
- ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు.
- మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల ఎవరిలోనైనా ఇలాంటి లక్షణాలను కనిపిస్తే వారు ఓసిడితో బాధపడుతున్నట్టే. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ ఓసీడీ సమస్య ఏ వయసు వారికైనా రావొచ్చు.
ocd
ఓసీడీకి చికిత్స
- ఓసీడీ పేషెంట్లకు సైకోథెరపీతో పాటు మందులు కూడా ఇస్తారు. మరీ ముఖ్యంగా వారికి కౌన్సిలింగ్ ను ఇస్తారు. కానీ డాక్టర్ సలహా లేకుండా మీరు ఏ మందులను వాడొద్దు. ఆపొద్దు.
- ఈ సమస్యను తగ్గించుకోవడానికి మెదడును పనిలో నిమగ్నం చేయడం అవసరం. దీని కోసం పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం, వాకింగ్ కు వెళ్లడం వంటివి చేయొచ్చు. ఇది కూడా ఒక రకమైన చికిత్స. కానీ ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.