Cricket
ఐపీఎల్ లెజెండ్ డేవిడ్ వార్నర్ ఈ టీంలో తప్పనిసరిగా ఉంటాడు. అమ్ముడుపోని ఆటగాళ్ల టీంకి ఓపెనర్ కూడా అతనే.
సహ ఓపెనర్‌గా పృథ్వీ షా కన్నా బెటర్ ఆప్షన్ ఎవరూ లేరు. అంచనాలు పెంచిన ఈ యువ ఆటగాడిని ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఎవరూ కొనుక్కోలేదు.
ఒకప్పుడు ఇండియన్ పేస్ దళంలో కీలకమైన ఉమేష్ యాదవ్ బేస్ ప్రైస్ 2 కోట్లు. కానీ, ఏ జట్టు కూడా అతనిపై ఆసక్తి చూపలేదు.
మూడో స్థానంలో పంజాబ్ మాజీ కెప్టెన్, భారత ఆటగాడు మయాంక్ అగర్వాల్ ఉన్నాడు. ఐపీఎల్లో పేలుడు బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించిన మయాంక్ ను ఈసారి ఏ జట్టు కోనలేదు.
జానీ బెయిర్‌స్టో ఇంగ్లండ్ స్టార్‌గా నాలుగో స్థానంలో ఉన్నాడు. హైదరాబాద్, పంజాబ్ తరుపున అద్భుతంగా బ్యాటింగ్ చేసిన బెయిర్ స్టో ఈసారి ఐపీఎల్ వేలం 2025 లో అమ్ముడుపోలేదు.
భారత టెస్టు ఆటగాడు, దేశవాళీ క్రికెట్లో అద్భుత స్టార్ గా ఎదిగిన సర్ఫరాజ్ ఖాన్ ను కూడా ఏ జట్టు తీసుకోలేదు. అతను వరిసారిగా 2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఐపీఎల్లో ఆడాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో జింబాబ్వే కెప్టెన్ అద్భుతమైన రికార్డు సాధించినా ఐపీఎల్ వేలంలో అతనికి గిరాకీ లేదు. ఏ జట్టు కూడా అతన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు.
భారత పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా ఐపీఎల్ మెగా వేలం 2025 లో అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు.
ఐపీఎల్లో 192 మ్యాచ్‌లలో 192 వికెట్లు తీసిన 35 ఏళ్ల పీయూష్ చావ్లా గతంలో ముంబై-కోల్‌కతా జట్లకు ఆడాడు. ఐపీఎల్ మెగా వేలం 2025 లో అతను అమ్ముడుపోని ప్లేయర్ గా మిగిలాడు.
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో మెరిసినా బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ కట్టర్లు, స్లో బాల్స్ ప్రసిద్ది చెండాడు. కానీ, ఈ వేలంలో అతను అమ్ముడుపోలేదు.
ఒకప్పుడు భారత తదుపరి పేస్ సెన్సేషన్ గా పేరొందిన కార్తీక్ త్యాగి ఈసారి వేలంలో అమ్ముడు పోలేదు.