SPORTS

లగ్జరీ కార్లు, కోట్ల ఆస్తుల.. సానియా మీర్జా సంపద ఎంతో తెలుసా?

Image credits: Instagram

క్రీడా ప్రపంచంలో సానియా మీర్జాకు ప్రత్యేక గుర్తింపు

భారత టెన్నిస్ ఐకాన్ సానియా మీర్జా, మహిళల డబుల్స్‌లో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. ఆరు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకుంది.

Image credits: Instagram

సానియా మీర్జా అవార్డులు, ప్రత్యేక పురస్కారాలు

సింగిల్స్‌లో  సానియా మీర్జా భారతీయ మహిళా క్రీడాకారిణిగా అత్యున్నత ర్యాంక్ సాధించింది. అలాగే, ఆమెను అర్జున అవార్డు, పద్మశ్రీ, పద్మ భూషణ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి.

Image credits: Instagram

బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో భారీ సంపాదన

$26 మిలియన్ల (సుమారు రూ. 216 కోట్లు) నికర సంపదతో సానియా ఏషియన్ పెయింట్స్, లక్మీ, హెర్షీస్ వంటి ప్రధాన బ్రాండ్‌లతో ఎండార్స్‌మెంట్‌లతో భారీగా సంపాదిస్తోంది.

Image credits: Instagram

హైదరాబాద్, దుబాయ్‌లో ఇళ్ళు

సానియా మీర్జా హైదరాబాద్, దుబాయ్‌లలో విలాసవంతమైన ఇళ్లను కలిగి ఉంది. ఆమె హైదరాబాద్ నివాసం రూ. 13 కోట్లకు పైగా విలువైనది. అధునాతన డిజైన్‌కు ప్రసిద్ధి చెందింది.

Image credits: Instagram

సానియా మీర్జా గ్యారేజీలో లగ్జరీ కార్లు

విలాసవంతమైన కార్ల పట్ల అభిరుచి కలిగిన సానియా.. BMW 7-సిరీస్, రేంజ్ రోవర్ ఎవోక్, జాగ్వార్ XE లను కలిగి ఉన్నారు. వీటితో పాటు ఇంకా చాలానే కార్లు ఉన్నాయని సమాచారం.

Image credits: Instagram

ఐపీఎల్ 2025: టాప్ -10 ఖరీదైన ప్లేయర్లు వీరే

సెంచరీల హీరో.. విరాట్ కోహ్లీ రికార్డులు ఇవి

ఐపీఎల్ వేలంలో హిస్టరీని క్రియేట్ చేసిన టాప్-8 ప్లేయర్లు

ఐపీఎల్ 2025 వేలంలో ఖరీదైన టాప్-5 ఆటగాళ్ళు వీరే