urine
సాధారణ మూత్రవిసర్జన అంటే.. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 500 మి.లీ మూత్ర విసర్జన చేసే సహజ ప్రక్రియ. మూత్రం ఒక వ్యర్థ పదార్థం. మనం తాగే ద్రవాలు, రోజంతా మనం తినే ఆహారం నుంచి పోషకాలను గ్రహించిన తర్వాత ఇది బయటకు వెళుతుంది. ఒక వ్యక్తి రోజంతా సాధారణం కంటే తక్కువ మూత్ర విసర్జన చేస్తే దానిని హైపోయూరియా అంటారు.
మూత్ర విసర్జన లేకపోవడమంటే మీ శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడానికి సంకేతమన్నట్టే. తక్కువ నీరు తీసుకోవడం వల్ల కొన్ని కొన్ని సార్లు మూత్ర విసర్జన తక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడూ తక్కువ మూత్ర విసర్జన చేస్తే మాత్రం ఇది ఎన్నో వ్యాధులకు సంకేతం కావొచ్చు. అలాగే ఎక్కువ, తక్కువ మూత్రవిసర్జన రెండూ ఎన్నో సమస్యలకు కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. మూత్రవిసర్జన మూత్రపిండాల వ్యాధితో సంబంధం కలిగి ఉంటుంది. కొంతమందికి క్రమం తప్పకుండా మూత్ర విసర్జన చేయకపోతే మూత్రపిండాల వ్యాధి రావొచ్చు.
urine
ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు గరిష్టంగా ఆరు నుంచి ఏడు సార్లు మూత్ర విసర్జన చేస్తాడు. ఇంతకంటే ఎక్కువ లేదా తక్కువ మూత్ర విసర్జన చేస్తే మీరు వెంటనే హాస్పటల్ కు వెళ్లాలి. ఎందుకంటే తక్కువ మూత్రవిసర్జన ఎన్నో వ్యాధులకు దారితీస్తుందన్న ముచ్చట మీకు తెలుసా? తక్కువ మూత్రవిసర్జన వల్ల ఏయే వ్యాధులు వస్తాయో? వాటికి ఎలా తగ్గించుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
తక్కువ మూత్రం వల్ల ఈ వ్యాధులు రావొచ్చు..
మూత్రపిండాల వైఫల్యం
మూత్రపిండాల అంటువ్యాధులు
తక్కువ రక్తపోటు
గుండె సమస్యలు
పొత్తికడుపు ఉబ్బరం
మానసిక సమస్యలు
రక్తహీనత
మూత్రం తక్కువగా వస్తే ఏం చేయాలి?
మీకు మూత్రవిసర్జన తక్కువగా ఉన్నట్టైతే మీరు నీళ్లను ఎక్కువగా తాగండి. అంటే మీరు కనీసం రోజుకు 2 లీటర్ల నీటిని తాగాలన్న మాట. నీరు ఎక్కువగా తాగితే మధుమేహం నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే శరీరానికి హాని చేసే టాక్సిన్స్ కూడా సులభంగా బయటకు పోతాయి.
urinary problem in men
మీకు విరేచనాలు, వాంతులు లేదా నిర్జలీకరణ సమస్యలు ఉన్నా కూడా నీళ్లను పుష్కలంగా గాలి. లిక్విడ్ ఫుడ్స్, ఉప్పు, షుగర్ వాటర్ ను తీసుకోవాలి. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ లోపాన్ని సరిచేస్తుంది.
ఒకవేళ మీకు డయాబెటిస్ ఉంటే.. డాక్టర్ ను సంప్రదించి మీ ఆహారాన్ని మార్చండి. అలాగే మీ ఆహారంలో కార్బోహైడ్రేట్లను తీసుకోవడాన్ని తగ్గించండి. రక్తపోటును నియంత్రించడానికి వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి.
సిగరెట్లు, ఆల్కహాల్ వాడకాన్ని పరిమితం చేయండి.
మూత్రం తక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి యూరిన్ టెస్ట్ చేయించుకోండి.
మీ ఆహారంలో తక్కువ ఉప్పును జోడించండి. ఉప్పు నీరు తాగడం కూడా మంచిది. కానీ తక్కువ తీసుకోండి.