బరువు తగ్గాలా? కొవ్వు తగ్గాలా? దేనికోసం ప్రయత్నిస్తున్నారు??

First Published May 15, 2021, 1:02 PM IST

 అందంగా, సన్నగా, నాజూగ్గా, మెరుపుతీగలా ఉండాలని కోరుకోని వారు ఉంటారా? ఒంట్లో కాస్త కొవ్వు చేరగానే.. కూసింత లావైనట్టు అనిపించగానే డైటింగ్ లు, ఎక్సర్ సైజులు, యోగాలు మొదలుపెట్టేస్తారు.

అందంగా, సన్నగా, నాజూగ్గా, మెరుపుతీగలా ఉండాలని కోరుకోని వారు ఉంటారా? ఒంట్లో కాస్త కొవ్వు చేరగానే.. కూసింత లావైనట్టు అనిపించగానే డైటింగ్ లు, ఎక్సర్ సైజులు, యోగాలు మొదలుపెట్టేస్తారు.
undefined
లావయ్యాక చేసేవాళ్లు కొందరైతే.. ముందస్తుగానే జాగ్రత్తగా ఉండేవాళ్లు మరికొందరు. అయితే మీరు లావు తగ్గాలనుకుంటున్నారా? కొవ్వు తగ్గాలనుకుంటున్నారా? ఇది అసలు సమస్య..
undefined
ఆరోగ్యస్పృహ ఉన్నవారికి ఈ రెంటి మధ్య తేడా బాగా తెలుసు. మరోసారి ఈ రెంటింటి మధ్య తేడాలు గమనిస్తే.. బరువు తగ్గడం అంటే శరీర మొత్తం బరువులో తేడా రావడం. శరీరంలో చేరిన నీరు, కొవ్వు, కండరాల్లో తగ్గుదల వల్ల బరువు తగ్గడం.
undefined
మరోవైపు, కొవ్వు తగ్గడం అనేది శరీర కొవ్వు స్థాయిలలో ఒక్క శాతం మాత్రమే.. అది నిర్దిష్ట తగ్గుదలని సూచిస్తుంది. మరోవిధంగా చూస్తే కొవ్వును తగ్గించడం ద్వారా బరువు తగ్గడం అనేది మరింత ప్రత్యేక నిర్దిష్ట లక్ష్యంగా చెప్పుకోవాలి.
undefined
అయితే ఇవి రెండూ బరువు తగ్గడానికి చాలా ముఖ్యమైనవే. అయితే మీ ప్రాధాన్యత ఏమిటో నిర్ణయించుకోవడం ద్వారా.. మీ లక్ష్యాలను వేగంగా చేరుకోవడానికి సహాయపడుతుంది.
undefined
కొవ్వు తగ్గడం, బరువు తగ్గడం రెండూ ఒకటే కాదు.. ఎందుకంటే.. బరువుతగ్గాలని ప్రయత్నించే చాలామంది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే బరువు తగ్గినంత మాత్రాన శరీరంలోని కొవ్వు తగ్గింది అనుకోవడానికి లేదు.
undefined
రెండోది.. శరీర బరువు తగ్గడాన్ని కిలోల వారీగా లెక్కిస్తారు. కానీ కొవ్వు తగ్గిందని కొలవడానికి ప్రత్యేకమైన స్కేల్ లేదా మార్కర్ లేదు. మీరు తగ్గిన బరువు కొవ్వు, కండరాలు.. శరీరంలోని అవాంఛితంగా పేరుగుతున్న మిగతా పదార్థాల తగ్గుదలతో అయ్యుండొచ్చు.
undefined
Sమరెలా.. ఈ రెంటింటో దేన్ని లక్ష్యంగా చేసుకుని ముందుకు పోవాలి అంటే.. బరువు తగ్గడం అనేది చాలా మంచింది. అయితే శరీరం తీర్చిదిద్దిన ఆకారంలో కనిపించాలంటే కొవ్వు తగ్గడం తప్పనిసరి.
undefined
నీరు, కండరాల తగ్గుదలతో బరువు తగ్గడం ఉంటుంది, అయితే ఇది మొత్తం ఆరోగ్యానికి హానికరం. మరోవైపు, బరువు తగ్గడం కంటే కొవ్వు తగ్గడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, మంటలు, కండర ద్రవ్యరాశి నష్టాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు తగ్గిన బరువును అలాగే మెయింటేన్ చేసేలా సహాయపడుతుంది.
undefined
మీరు కొవ్వు నష్టాన్ని ఎలా ట్రాక్ చేయవచ్చు?బరువు తగ్గడాన్నే ప్రామాణికంగా తీసుకుంటే మీరెంత కొవ్వును కోల్పోతున్నారో ఖచ్చితమైన లెక్క వేయలేకపోవచ్చు. అందుకే దీనికోసం మజిల్ మాస్ మీద ఆధారపడండి. ఏదేమైనా కొవ్వును కొలవడనికి స్కేల్ లాంటి ఖచ్చితమైన మార్గాలు లేకపోవడం వల్ల ఇదే బెస్ట్ ఆప్షన్.
undefined
స్కిన్ ఫోల్డ్ కేపర్స్ వంటి సాధనాలను ఉపయోగించడం వల్ల శరీర కొవ్వు కూర్పును అర్థం చేసుకోవచ్చు.మీ నడుం చుట్టుకొలతను టేప్‌తో కొలుచుకోవడం ద్వారా ఫ్యాట్ ను గుర్తించొచ్చని కొంతమంది నమ్ముతారు. అయితే ఇది మీరు కోల్పోయే కొవ్వును ట్రాక్ చేయడానికి బాగా పనిచేస్తుంది.
undefined
కండరాలనష్టం జరగకుండా కొవ్వును మాత్రమే తగ్గించుకోవాలంటే.. కొన్ని రకాల ఆహారపదార్థాలను ట్రై చేయాలి. దీనిమీద సరైనా అంచనా లేకపోతే కొవ్వు తగ్గించే కొన్ని చిట్కాలు బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశాలున్నాయి.ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. ఆహారంలో కొన్నమార్పులు చేసుకోవాలి.
undefined
మీ ప్రతి భోజనంలో పుష్కలంగా ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. తక్కువ కేలరీలు తినండి. కేలరీలు తక్కువగా ఉండేవాటిమీదే దృష్టి పెట్టండి. వీటితో పాటు కార్డియో, వెయిట్ ట్రైనింగ్ వంటి ఇంటెన్సివ్ వ్యాయామాలపై దృష్టి పెట్టండి.
undefined
ఇలా శరీర కొవ్వు తగ్గడం మీద దృష్టి పెడితే, వారానికి 500-700 గ్రాముల బరువును తగ్గించుకునేలా లక్ష్యాన్ని పెట్టుకోండి.
undefined
ఇలా శరీర కొవ్వు తగ్గడం మీద దృష్టి పెడితే, వారానికి 500-700 గ్రాముల బరువును తగ్గించుకునేలా లక్ష్యాన్ని పెట్టుకోండి.
undefined
click me!