నిన్ను వదిలేది లేదు... విజయ్ దేవరకొండను మళ్ళీ గెలికిన అనసూయ, బాధ్యత లేదా అంటూ సంచలన పోస్ట్!

Published : Apr 30, 2024, 07:33 AM IST

విజయ్ దేవరకొండను నీడలా వెంటాడుతుంది అనసూయ భరద్వాజ్. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాలను విమర్శిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ఎప్పుడూ విజయ్ దేవరకొండను గెలకడమే ఈమె పనా... అని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.   

PREV
110
నిన్ను వదిలేది లేదు... విజయ్ దేవరకొండను మళ్ళీ గెలికిన అనసూయ, బాధ్యత లేదా అంటూ సంచలన పోస్ట్!
Anasuya Bharadwaj Vijay devarakonda


విజయ్ దేవరకొండను అనసూయ వదలడం లేదు. సందర్భం లేకుండా పరోక్ష విమర్శలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడో ముగిసిన అర్జున్ రెడ్డి వివాదాన్ని మరలా తెరపైకి తెచ్చింది. నటులకు, ఆడియన్స్ కి బాధ్యత ఉండాలని కౌంటర్ వేసింది. 
 

210

2017లో విడుదలైన అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అదే సమయంలో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. అర్జున్ రెడ్డి సినిమాలోని కొన్ని సన్నివేశాల మీద సంప్రదాయవాదులు అభ్యంతరం తెలిపారు. 
 

310
Anasuya Bharadwaj


ముఖ్యంగా హీరోయిన్ ని హీరో కొట్టడం, లిప్ లాక్ సన్నివేశాలకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. యాంకర్ అనసూయ అయితే పెద్ద ఎత్తున నిరసన తెలిపింది. టీవీ డిబేట్లలో కూర్చుని అర్జున్ రెడ్డి మూవీ హీరో విజయ్ దేవరకొండను, దర్శకుడు సందీప్ రెడ్డి వంగలపై విమర్శల దాడి చేసింది. 
 

410
Anasuya Bharadwaj Vijay devarakonda

ఆ వివాదం ముగిసి చాలా కాలం అవుతుంది. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాలను విమర్శిస్తూ తాజాగా ఒక పోస్ట్ పెట్టింది. నటి పార్వతి చేసిన కామెంట్స్ కి సంబంధించిన వీడియో పోస్ట్ చేసింది. 
 

510
Anasuya Bharadwaj Vijay devarakonda

గతంలో పార్వతి, విజయ్ దేవరకొండ, దీపికా పదుకొనె పాల్గొన్న ఒక కార్యక్రమంలో పార్వతి మాట్లాడుతూ.. అర్జున్ రెడ్డి కావొచ్చు  కబీర్ సింగ్ కావొచ్చు. ప్రేమను వ్యక్తం చేయడానికి కొట్టటం ఏమిటీ? ఇది హింసను ప్రేరేపించడమే. ఇలాంటి సీన్స్ చేయకుండా దర్శకులను మనం ఆపలేకపోవచ్చు. కానీ నటులుగా మనం అలాంటి చిత్రాలు చేయకుండా ఉండగలం కదా... అన్నారు. 
 

610
Anasuya Bharadwaj

పార్వతి చేసిన ఈ కామెంట్స్ ని ఉద్దేశిస్తూ అనసూయ... ఈ వీడియోను అందరూ షేర్ చేయండి. అలాగే మంచిని చెప్పేందుకు ముందుకు వచ్చిన  పార్వతి, దీపికా పదుకొనె, ఆయుష్మాన్ వంటి వారిని అభినందించండి. సినిమా అనేది అత్యంత ప్రభావితం చేసే మాధ్యమం అని నటులు, ప్రేక్షకులు తెలుసుకోవాలి... అని కామెంట్ పెట్టారు.

710
Anasuya Bharadwaj Vijay devarakonda


మరొక కామెంట్ లో... నేను ఇదే విషయాన్ని చెప్పినందుకు నన్ను దారుణంగా ట్రోల్ చేశారు. నాకు మద్దతు ఇచ్చేందుకు స్ట్రాంగ్ పీ ఆర్ టీమ్, మీడియా, తోటి నటులు కూడా లేరు. అలాగే నా భావాలు వ్యక్తీకరించడంలో నాకు అంత నైపుణ్యం లేదు. అయినప్పటికీ నేను ఆగను. కొనసాగిస్తూనే ఉంటాను... అని అన్నారు. 

810
Anasuya Bharadwaj Vijay devarakonda

అనసూయ పోస్ట్ వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగ టార్గెట్ గా ఆమె ఈ పోస్ట్ పెట్టారు. వారిద్దరికీ బాధ్యతలు లేదన్న అర్థంలో ఆ పోస్ట్ ఉంది. 

910
Anasuya Bharadwaj

 

కాగా లైగర్ విడుదల తర్వాత, ఖుషి చిత్ర విడుదలకు ముందు విజయ్ దేవరకొండ పై అనసూయ పరోక్ష పోస్టులు పెట్టింది. ఓ మీడియా సమావేశంలో విజయ్ దేవరకొండను కావాలనే టార్గెట్ చేసినట్లు ఆమె ఒప్పుకున్నారు. 

 

1010

విజయ్ దేవరకొండ వద్ద పని చేసే ఓ వ్యక్తి డబ్బులిచ్చి నన్ను ట్రోల్ చేయిస్తున్నాడని తెలిసింది. విజయ్ దేవరకొండ ప్రమేయం లేకుండా ఇది జరగదని నా భావన. అందుకే విజయ్ దేవరకొండకు వ్యతిరేకంగా పోస్ట్స్ పెట్టాను. ఇకపై దీనికి ముగింపు పలకాలి అనుకుంటున్నాను అన్నారు. కానీ అనసూయ మరలా విజయ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా పోస్ట్ పెట్టారు.   

Read more Photos on
click me!

Recommended Stories