Kalki 2898 AD :కాపీ వార్తల పై స్పందించిన నాగ్ అశ్విన్‌..ఆ ఒక్క విషయంలోనే పోలిక అంటూ..

First Published Apr 30, 2024, 7:36 AM IST

దర్శకుడు నాగ్ అశ్విన్ 'కల్కి 2898 AD' జూన్ 27 న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం హాలీవుడ్  సినిమా 'డూన్'తో పోలుస్తున్నారు. 

Kalki 2898


 ప్ర‌భాస్  తాజా  చిత్రం ‘క‌ల్కి 2898AD’ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ . నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌, బాలీవుడ్ స్టార్స్‌ దీపికా ప‌దుకోన్‌, దిశాప‌టాని ల‌తో పాటు టాలీవుడ్ స్టార్ న‌టుడు రానాలు కీల‌క పాత్ర‌ల్లో న‌టించటంతో అంతటా హాట్ టాపిక్ గా మారింది.  వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై నిర్మాత అశ్విని ద‌త్ దాదాపు రూ.400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Kalki 2898


ఈ సినిమాని ప్ర‌పంచ వ్యాప్తంగా 2024 జూన్ 27 విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌ల చిత్ర టీమమ్ తెలియ‌జేసింది. ఈ మేర‌కు ఓ కొత్త పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకుంది. ఈ పోస్ట‌ర్‌లో అమితాబ్‌, ప్ర‌భాస్‌, దీపికా ప‌దుకోన్ నిల‌బ‌డి ఉండ‌గా.. ఎడారి లాంటి ప్రాంతంలో కొంద‌రు ప‌డి ఉండ‌డం క‌నిపిస్తోంది. ఈ పోస్ట‌ర్ వైర‌ల్‌గా మారింది. అదే సమయంలో ఈ చిత్రం హాలీవుడ్ సినిమా డూన్ కు కాపీ అనే ప్రచారం ఊపందుకుంది.

Dune Kalki 2898 AD


హాలీవుడ్ లో తెరకెక్కిన అనేక  సైన్స్ ఫిక్ష‌న్  సినిమాల‌కు `డూన్` న‌వ‌ల ఎంతో స్ఫూర్తిగా నిలిచింద‌నేది అంటారు. ఇక  డూన్ న‌వ‌ల స్ఫూర్తితోనే డూన్ (2021 రిలీజ్) సినిమా కూడా తెర‌కెక్కింది. డూన్ - మ్యాడ్ మ్యాక్స్ లాంటి సినిమాలు డిస్టోపియన్ ఫ్యూచర్స్.. ధ్వంసమైన పర్యావరణం.. అణచివేత పాలకుల క‌థ‌ల‌తో రూపొందాయి. మనుగడ కోసం మానవుని పోరాటాన్ని ఈ సినిమాల్లో  ప్రధాన కథాంశం.

Kalki 2898 AD


హెర్బర్ట్ నవల `డూన్` మొదటిసారిగా 1965లో పబ్లిష్ అయ్యింది. అప్పటి నుంచీ ఎన్నో సినిమాలకు స్ఫూర్తి గా నిలిచిన ఈ చిత్రం  ఇప్పుడు నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న ప్రాజెక్ట్ K చిత్రానికి  కూడా ఇదే న‌వ‌ల‌ స్ఫూర్తి అంటున్నారు. ఈ విషయంలో తప్పేముంది అని చాలా మంది వాదిస్తూంటే... అనేక సంవత్సరాలుగా భారీ సైన్స్ ఫిక్ష‌న్ ఫ్రాంఛైజీ చిత్రాల‌కు ప్రేరణనిచ్చింది డూన్ న‌వ‌లతో మన తెలుగులో సినిమా చేయకూడదా అంటున్నారు. 

Kalki in 2898 AD


మరో ప్రక్క ప్రభాస్ `ప్రాజెక్ట్ కె` పోస్టర్ `ఐరన్ మ్యాన్`తో పోలి ఉంది అప్పట్లో చాలా మంది ఆరోపించారు. దీపికా పదుకొణె పోస్టర్ జెండాయా పాత్ర‌తో పోలికను క‌లిగి ఉందని అన్నారు.ఇలా ఈ సినిమా గురించి గ్లింప్స్ కానీ, పోస్టర్ కానీ వచ్చినప్పడల్లా ఏదో ఒక కాపీ ఆరోపణ వస్తూనే ఉంది. అయితే టీమ్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతోంది. 

Kalki 2898


 దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ కాపీ ఆరోపణలపై స్పందించారు.  ఆయన ఈ పోలికలను కొట్టిపారేశాడు. కేవలం డూన్ లో  ఇసుక ..ప్రాజెక్టు కేలో ఇసుక ఉండటం వల్ల రెండు సినిమాలు ఒకే విధంగా ఉన్నాయని ప్రేక్షకులు నమ్మకూడదని చెప్పాడు. 

Kalki in 2898 AD

 ఇటీవల రిలీజ్ చేసిన ‘అశ్వత్థామ’ గ్లింప్స్‌ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. మహాభారతాన్ని లింక్ చేస్తూ సప్త చిరంజీవులను ఇప్పటి జనరేషన్ వాళ్ళకి సూపర్ హీరోలగా పరిచయం చేస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ కల్కి ఆడియన్స్ అంచనాలను అందుకుంటుందో లేదా అనేది  చూడాలి.
 


అమితాబ్ బచ్చన్ పాత్రని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ‘అశ్వత్థామ’ గ్లింప్స్‌లో మీరు గమనిస్తే.. ఒక శివలింగానికి అశ్వత్థామ ప్రార్ధన చేస్తూ కనిపిస్తారు.   శివలింగం పై నీటి చుక్కలు ఒక్కొక్కటిగా పడుతూ ఉంటాయి. కానీ ఆ తరువాత ఆ నీటిబిందువులు పడడం ఆగిపోతాయి. అవి చూసిన అశ్వత్థామ.. అంతిమ యుద్ధం వచ్చిందని అంటారు. ఈ పాయింట్ ని కూడా నాగ్ అశ్విన్ పురాణాలు నుంచే తీసుకున్నారు. శ్రీకృష్ణుడు తన దశావతారం కల్కి గురించి గురించి మాట్లాడుతూ.. “గంగ, యమున, సరస్వతి నదులు నీరు లేక ఎండిపోయినప్పుడు నేను కల్కిగా అవతరిస్తాను” అని చెప్పినట్లు చెబుతున్నారు.


మన పురాణాల్లో వేద వ్యాసుడు, హనుమంతుడు, పరుశురాముడు, విభీషణుడు, అశ్వత్థామ, కృపాచార్య, బలి చక్రవర్తి లను చిరంజీవులు అంటారు. అంటే మరణం లేని వారు అని. ఈ ఏడుగురికి మరణం లేదని, కలియుగం చివరివరకు ఉంటారని, కలియుగం చివర్లో వస్తారని అంటారు. నాగ్ అశ్విన్ కల్కి 2898AD సినిమాలో ఈ ఏడుగురు చిరంజీవులు పాత్రలని చూపించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే కల్కి సినిమాలో హీరో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాని, రాజమౌళిలు గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తారని టాక్ వచ్చింది. వీళ్ళే ఆ చిరంజీవులు పాత్రలు చేసి సినిమాలో కొద్దిసేపు మెరిపిస్తారని అనుకుంటున్నారు.


ఏడుగురు చిరంజీవులు పాత్రలలో రాజమౌళి వేద వ్యాసుడిగా, రానా హనుమంతుడిగా, దుల్కర్ సల్మాన్ పరుశురాముడిగా, నాని విభీషణుడిగా, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, విజయ్ దేవరకొండ కృపాచార్యునిగా, అసురుల రాజు బలి చక్రవర్తిగా కమల్ హాసన్ కనిపించబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికి అమితాబ్ ని అశ్వత్థామగా చూపించారు. మరి మిగిలిన ఆరుగురు చిరంజీవులుగా ఎవరెవర్ని చూపిస్తారా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ ఒక్క అమితాబ్ క్యారెక్టర్ గ్లింప్స్ తో సినిమాపై అందరికి మరింత ఆసక్తి కలిగించారు.
 

Prabhas Kalki 2898 AD


ప్రాజెక్టు కే విషయం ప్రక్కన పెడితే.. డూన్ ఇంకా చాలా చిత్రాలకు స్ఫూర్తినిచ్చింది. డూన్ న‌వ‌ల స్ఫూర్తితో `ఏలియన్` ఫ్రాంఛైజీనే ఆవిర్భ‌వించింది. పొడ‌వాటి పుర్రె పోలికతో ఏలియ‌న్ విన్యాసాలను ఇందులో చూపించ‌గా ప్ర‌జ‌ల‌కు అవి న‌చ్చాయి.`డ్యూన్` నవలల నుండి `స్టార్ వార్స్` ప్రేరణ పొందింది.

Prabhas Kalki 2898 AD film


ఇక ప్రాజెక్టు కే విషయానికి వస్తే.. భ‌విష్య‌త్ కాలంలోకి ప్ర‌యాణించి అక్క‌డ జీవించే మానవుడి పరిస్దుతులు, ఎదుర్కొనే సమస్యలతో ఊహాజ‌నిత‌మైన క‌థ‌తో ప్రాజెక్ట్.కే రూపొందుతోంది అని తెలుస్తోంది.  ఇక  క‌ల్కి సినిమాను హాలీవుడ్ సినిమాతో పోల్చ‌డం ఇదే తొలిసారి కాదు. కాన్సెప్ట్, మేకింగ్‌, క్రాప్ట్ , విజువ‌లైజేష‌న్ ఇలా ప్ర‌తీదాన్ని హాలీవుడ్ సినిమాల‌తో పోలుస్తున్నారు.

click me!