71కేజీల బరువు తగ్గిన హౌసింగ్. కామ్ సీఈవో.. ఏం తిన్నాడో తెలుసా?

By Ramya Sridhar  |  First Published Mar 27, 2024, 4:08 PM IST

ఈ సమయంలో, ధృవ్ అగర్వాల్ బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. రెండేళ్ల ప్రయత్నం తర్వాత అతని బరువు 81 కిలోలకు చేరుకుంది 


ఈ రోజుల్లో అధిక బరువు పెరిగిపోయి.. దానిని తగ్గించుకునేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే.. బరువు తగ్గాలి అనుకునేవారు హౌసింగ్. కామ్ సీఈవో ధ్రువ్ అగర్వాల్ ని ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే.. ఆయన రెండేళ్లలో ఏకంగా 71కేజీల బరవు తగ్గారు. ఆయన అంత బరువు తగ్గడానికి ఏం చేశారు..? తన ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకున్నారు..? ఆయన ఏం తిన్నారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Housing.com CEO ధృవ అగర్వాల్ Proptiger.com , Makan.com గ్రూప్ CEO కూడా. ధృవ అగర్వాల్ అప్పుడు 152 కిలోల బరువు ఉండేవాడు. సింగపూర్‌కు చెందిన ధృవ అగర్వాల్  భారత పర్యటనలో గుండెల్లో మంట రావడం గమనించారు. 2021లో, అతను ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందాడు. ఈ సమయంలో, ధృవ్ అగర్వాల్ బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. రెండేళ్ల ప్రయత్నం తర్వాత అతని బరువు 81 కిలోలకు చేరుకుంది 

Latest Videos

undefined


ఆసుపత్రిలో చేరే ముందు ధృవ్ అగర్వాల్ చాలా అధిక బరువుతో ఉన్నాడు. ఇంతకు ముందు చెప్పినట్లుగా అగర్వాల్ బరువు 151.7 కిలోలు. ధృవ్ అగర్వాల్ ప్రీ-డయాబెటిస్, స్లీప్ అప్నియా, అదనపు కొలెస్ట్రాల్ ,రక్తపోటు కి మందులు కూడా వాడుతూ ఉండేవారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత  కచ్చితంగా బరువు తగ్గాలి అని ఆయన నిర్ణయించుకున్నారు.

రెండేళ్లలో ధృవ్ అగర్వాల్ బరువు ఎలా తగ్గాడు? : ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత, ధ్రువ అగర్వాల్ సింగపూర్‌లో వ్యక్తిగత శిక్షకుడిని నియమించుకున్నాడు. అగర్వాల్ వారానికి మూడు సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ సెషన్స్ తీసుకున్నారు. అతను రోజుకు 10,000 నుండి 12,000 స్టెప్స్ వేసేవాడు.


ధృవ్  అగర్వాల్‌కు కోచ్‌గా అహ్మద్ జాకీ ఉన్నారు. అతను టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ కథను వివరించడం ద్వారా బరువు తగ్గడానికి ధృవ అగర్వాల్‌ను ప్రోత్సహించాడు. ద్రవ అగర్వాల్ తన ఆహారంలో కేలరీలను తగ్గించాడు. అతను రోజువారీ కేలరీల తీసుకోవడం 1,700 కేలరీలకు తగ్గించాడు. 

సమోసాలు, దోసెలు , పనీర్ టోస్ట్‌లు వంటి అధిక కార్బ్ ఆహారాలు తినడం అలవాటు చేసుకున్న అతను ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన , వేయించిన ఆహారాన్ని పూర్తిగా మానేశాడు. ప్రతి భోజనంలో ప్రోటీన్ తినేలా చూసుకున్నాడు. తన ఆకలిని నియంత్రించుకోవడానికి ఆయన  డ్రై ఫ్రూట్స్, క్యారెట్, దోసకాయ , పెరుగు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిన్నాడు.
 

click me!