Today Horoscope: ఓ రాశివారికి రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది

First Published | Apr 30, 2024, 5:30 AM IST

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..
 

telugu astrology


30-4-2024, మంగళవారం మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..)

మేషం (అశ్విని భరణి కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాధిపతి
అశ్విని నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) అపవాదములు రాగలవు జాగ్రత్త అవసరం. విషయాల్లో బుద్ధి స్థిరత్వం లేక ఇబ్బందులకు గురి అవుతారు.

భరణి నక్షత్రం వారికి సంపత్తార(సంపత్ తారాధిపతి బుధుడు) నూతన వ్యక్తులు తో స్నేహ సంబంధాలు బలపడతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. .

కృత్తిక నక్షత్రం వారికి జన్మ తార(జన్మ తారాధిపతి రవి) ఉద్యోగాలలో సమస్యలు రాగలవు. ఆర్థిక విషయాలు నిరత్సాహపరుస్తాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు.

దిన ఫలం:-ఇతరుల మీద ద్వేషం అసూయ లు రాగలవు.ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. కీలకమైన సమస్యల వలన మనస్సు నందు చికాకుగా ఉంటుంది.మిత్రులతో మనస్పర్థలు ఏర్పడగలవు.అనుకోని ఖర్చులు పెరిగి ఆందోళనకు గురవుతారు. తలపెట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడును.శారీరకంగా మానసికంగా బలహీన ఉంటారు. ఉద్యోగాలలో అధికారులు తో కలహాలు ఏర్పడును.వృత్తి వ్యాపారాలు మందగమనం గా ఉంటాయి.ఓం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాధిపతి
రోహిణి నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజుడు) బంధువర్గంతో మనస్పర్థలు రాగలవు.దుష్కార్య ఆలోచనలకు దూరంగా ఉండాలి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మృగశిర నక్షత్రం వారికి మిత్ర తార(మిత్ర తారాధిపతి శుక్రుడు)ప్రయత్న కార్యాలు సిద్ధించ గలవు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందగలరు. సంసార సౌఖ్యం లభిస్తుంది.

దిన ఫలం:-శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.సమాజంలో ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. ఉద్యోగాలలో పని ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది.  తలపెట్టిన పనులు అన్నీ సకాలంలో పూర్తవుతాయి.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు.ఓం నమో నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.


telugu astrology

మిధునం (మృగశిర 3 4, ఆరుద్ర , పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాధిపతి
ఆరుద్ర నక్షత్రం వారికి నైధన తార(నైధన తారాధిపతి శని) వ్యవహారిక చిక్కులు. అకారణ విరోధాలు రాగలవు.వృత్తి వ్యాపారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

పునర్వసు నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతోషకరమైన వార్త వింటారు.

దిన ఫలం:-ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రత్యర్ధులు పై పైచేయి సాధిస్తారు.మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఊహించిన ధన లాభం పొందుతారు.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.కీలకమైన సమస్య కు కుటుంబ వ్యక్తుల సహాయ సహకారాలు లభిస్తాయి.ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాధిపతి
పుష్యమి నక్షత్రం వారికి ప్రత్యక్తార(ప్రత్యక్ తారాధిపతి కేతువు ) తలచిన పనుల్లో ఆటంకాలు.కుటుంబ సభ్యులతో ప్రతికూలత.శారీరక బాధలు నిస్సత్తువ .ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

ఆశ్రేష నక్షత్రం వారికి క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చేపట్టిన పనులు పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి.

దిన ఫలం:-ముఖ్యమైన పనులు వాయిదా పడును. సంఘములో నిందారోపణలు రాగలవు. ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాలి.శారీరక శ్రమ పెరుగుతుంది.సంతానంతో విరోధాలు ఏర్పడవచ్చు.అకారణంగా కలహాలు ఏర్పడగలవు.మానసికంగా నిరుత్సాహంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు రావచ్చు. వృత్తి వ్యాపారాలలో  ఆశించిన ధనలాభం కనబడదు.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాధిపతి
మఘ నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) అపవాదములు రాగలవు జాగ్రత్త అవసరం.విషయాలు లో బుద్ధి స్థిరత్వం లేక ఇబ్బందులకు గురి అవుతారు.

పూ.ఫ నక్షత్రం వారికి సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) నూతన వ్యక్తులు తో స్నేహ సంబంధాలు బలపడతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి జన్మ తార (జన్మ తారాధిపతి రవి) ఉద్యోగాలలో సమస్యలు రాగలవు. ఆర్థిక విషయాలు నిరత్సాహపరుస్తాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు.

దిన ఫలం:-పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.వ్యాపారం లాభసాటిగా జరుగును.రావలసిన బాకీలు వసూలు అవును.ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు.అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వివాదాలు కేసులు అనుకూలంగా ఉండును.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఓం నమశ్శివాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాధిపతి
హస్త నక్షత్రం వారికి పరమైత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజుడు) బంధువర్గంతో మనస్పర్థలు రాగలవు.దుష్కార్య ఆలోచనలకు దూరంగా ఉండాలి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

చిత్త నక్షత్రం వారికి మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్రుడు) ప్రయత్న కార్యాలు సిద్ధించ గలవు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందగలరు. సంసార సౌఖ్యం లభిస్తుంది.

దిన ఫలం:-ఆదాయానికి మించి ఖర్చు పెరుగుతుంది.మిత్రులతో సఖ్యతగా వ్యవహరించాలి.  కోపా ఆవేశాలకు దూరంగా ఉండవలెను.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.నమ్మిన వారి వలన సమస్యలు ఏర్పడగలవు.ఇతరులతో వాగ్వాదం లకు దూరంగా ఉండాలి. కుటుంబంలో ప్రతికూలత వాతావరణం.మనస్సులో  అనేక ఆలోచనలతో  చికాకుగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి , విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాధిపతి
స్వాతి నక్షత్రం వారికి నైధన తార (నైధన తారాధిపతి శని) వ్యవహారిక చిక్కులు. అకారణ విరోధాలు రాగలవు . వృత్తి వ్యాపారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

విశాఖ  నక్షత్రం వారికి  సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతోషకరమైన వార్త వింటారు.

దిన ఫలం:-కుటుంబ కలహాలు రాగలవు. సమస్యలో  తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వాదప్రతివాదాలకు దూరంగా ఉండాలి. కొన్ని సంఘటనలు ఉద్రేకాలు కి దారి తీయను.మిత్రులతో కలహాలు ఏర్పడవచ్చు.ఆకస్మిక పరిణామాలు ఆందోళన కలిగిస్తాయి.ఉద్యోగాలలో అధికారులు తో మనస్పర్థలు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఓం అని ఓం ఆదిత్యాయ నమః జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాధిపతి
అనూరాధ నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) తలచిన పనుల్లో ఆటంకాలు.కుటుంబ సభ్యులతో ప్రతికూలత. శారీరక బాధలు నిస్సత్తువ .ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

జ్యేష్ట నక్షత్రం వారికి  క్షేమ తారాధిపతి ( క్షేమ తారాధిపతి గురువు) ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చేపట్టిన పనులు పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి.


దిన ఫలం:-మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు.సమాజంలో ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.శరీర సౌఖ్యం లభిస్తుంది.చేసే పనుల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి.నూతన అవకాశాలను పొందగలరు.ఓం కుమారాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

ధనుస్సు (మూల , పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాధిపతి
మూల నక్షత్రం వారికి  విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) అపవాదములు రాగలవు జాగ్రత్త అవసరం. విషయాల్లో బుద్ధి స్థిరత్వం లేక ఇబ్బందులకు గురి అవుతారు.

పూ.షాఢ నక్షత్రం వారికి  సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) నూతన వ్యక్తులు తో స్నేహ సంబంధాలు బలపడతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.

ఉ.షాఢ నక్షత్రం వారికి  జన్మ తార (జన్మ తారాధిపతి రవి) ఉద్యోగాలలో సమస్యలు రాగలవు. ఆర్థిక విషయాలు నిరత్సాహపరుస్తాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.ఆకస్మిక ధన లాభం కలుగును. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.కుటుంబంలో ఆనందకరమైన ఆహ్లాదకరంగా ఉంటుంది.మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మనస్సునందు ఉన్న ఆలోచన ఆచరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది.  తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.ఇంటా బయట గౌరవం లభిస్తుంది.గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.ఓం మహాలక్ష్మ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాధిపతి
శ్రవణా నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజుడు) బంధువర్గంతో మనస్పర్థలు రాగలవు.దుష్కార్య ఆలోచనలకు దూరంగా ఉండాలి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి

ధనిష్ఠ నక్షత్రం వారికి  మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్రుడు) ప్రయత్న కార్యాలు సిద్ధించ గలవు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందగలరు. సంసార సౌఖ్యం లభిస్తుంది.

దిన ఫలం:-వ్యాపారములో  తొందరపాటు నిర్ణయాల వలన కొత్త సమస్యలు రాగలవు. ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.గృహమున. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్థలు ఏర్పడగలవు.ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. సమాజంలో అవమానం జరిగే అవకాశం.మనస్సులో  అనేక ఆలోచనలతో ఆందోళనకరంగా ఉంటుంది.కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి.ఓం త్రయంబకాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాధిపతి
శతభిషం నక్షత్రం వారికి  నైధన తార (నైధన తారాధిపతి శని) వ్యవహారిక చిక్కులు. అకారణ విరోధాలు రాగలవు . వృత్తి వ్యాపారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

పూ.భా నక్షత్రం వారికి  సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతోషకరమైన వార్త వింటారు.

దిన ఫలం:-మనస్సులో అనేకమైన ఆలోచనలతో  చికాకుగా ఉంటుంది.చేసే పనుల్లో అలసత్వం పెరుగుతుంది.వృత్తి  వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని సంఘటనల వలన నిరాశ నిస్పృహలకు గురవుతారు.సమాజంలో కోపాన్ని అదుపు చేసుకొని వ్యవహరించాలి.చేసే ఖర్చు యందు నియంత్రణ అవసరం. వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది.కుటుంబం పట్ల తగు శ్రద్ధ వహించవలెను.ఓం నమో వెంకటేశాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు(దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాధిపతి
ఉ.భా  నక్షత్రం వారికి  ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) తలచిన పనుల్లో ఆటంకాలు.కుటుంబ సభ్యులతో ప్రతికూలత. శారీరక బాధలు నిస్సత్తువ .ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

రేవతి నక్షత్రం  వారికి  క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చేపట్టిన పనులు పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి.

దిన ఫలం:-తలపెట్టిన కార్యాలలో విజయం చేకూరును.శారీరక శ్రమ తగ్గి బలపడతారు.వృత్తి వ్యాపారాలలో రాబడి పెరుగుతుంది.చేసే పనుల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల అభిమానాలు పొందగలరు.కీలకమైన సమస్య పరిష్కార మార్గాలు అన్వేషణ చేస్తారు.ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

Latest Videos

click me!