పిల్లలకు గవదబిళ్లలు ఎందుకు వస్తాయి? ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

Published : Mar 22, 2024, 10:43 AM IST
పిల్లలకు గవదబిళ్లలు ఎందుకు వస్తాయి? ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

సారాంశం

గత కొన్ని రోజులుగా పిల్లలు గవదబిళ్లల బారిన బాగా పడుతున్నారు. ఇక కేరళలో ఎంతో మంది పిల్లలు గవదబిళ్లలతో ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ వ్యాధి ఎందుకొస్తుంది? దీని బారిన పడకుండా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.   

కేరళతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది పిల్లలు గవదబిళ్లల ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. దీనివల్ల పిల్లల బుగ్గలు ఉబిపోయి దవడలు బాగా నొప్పి పెడతాయి. ఈ సమస్య వల్ల పిల్లలకు తినడానికి రాదు. తాగడానికి రాదు. దీనివల్ల దగ్గు, జ్వరం కూడా వస్తాయి. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుందో తెలుసా? 

గవదబిళ్ల వైరస్ అంటే ఏంటి?

పారామైక్సో వైరస్ వల్ల గవదబిళ్లలు వస్తాయి. గవదబిళ్లలకు కారణమయ్యే వాటిలో ఈ వైరస్ ఒకటి. ఇది ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరస్ ముఖ్యంగా లాలాజల గ్రంథులను ప్రభావితం చేస్తుంది. ఈ గ్రంథులను పరోటిడ్ గ్రంథులు అంటారు. ఇవి లాలాజలాన్ని తయారు చేస్తాయి. దీనివల్ల బుగ్గలు బాగా ఉబ్బుతాయి. ఇది గొంతులో చాలా నొప్పిని కలిగిస్తుంది. ఈ వ్యాధి ఏ వయసువారికైనా వస్తుంది. కానీ పిల్లలకే ఇది ఎక్కువగా వస్తుంది. సరైన చికిత్సతో ఈ వ్యాధి 5 నుంచి 7 రోజుల్లో నయమవుతుంది.

గవదబిళ్ల వైరస్ లక్షణాలు

  • నమలడానికి, మింగడానికి ఇబ్బందిపడటం
  • జ్వరం, అలసట, బలహీనత
  • ఆకలి లేకపోవడం
  • తలనొప్పి
  • కండరాల నొప్పి
  • ముఖం ఒక వైపు లేదా రెండు వైపులా ఉబ్బడం.
  • నోరు పొడిబారడం

పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి

  • గవదబిళ్లల బారిన పడకుండా ఉండటానికి పరిశుభ్రతను పాటించాలి. 
  • ఎట్టి పరిస్థితిలో పిల్లలక బయటి ఫుడ్ ను తినిపించకూడదు. 
  • ఈ వ్యాధి సోకిన వ్యక్తులు వాడిన పాత్రలు లేదా నీటిని షేర్ చేసుకోకూడదు. 
  • వ్యాక్సిన్ తీసుకోవాలి. 

PREV
click me!

Recommended Stories

Kids Health: మీ పిల్లలు సన్నగా, బరువు తక్కువగా ఉన్నారా? అయితే ఈ సూపర్ ఫుడ్స్ పెట్టండి!
పిల్లలకు వాంతులు, విరేచనాలు అయినప్పుడు ఏ ఫుడ్ పెట్టొచ్చు? ఏది పెట్టకూడదు?