సమయానికి తినకపోవడం, ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా నేడు ఎంతో మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. నేటికీ ఈ సమస్య చాలా మందికి తెలియదు. అందుకే థైరాయిడ్ సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ జనవరి నెల మొత్తాన్ని థైరాయిడ్ అవేర్ నెస్ నెలగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా థైరాయిడ్ ఉన్న గర్బిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
pregnancy
తొమ్మిది నెలల గర్భం ఆడవాళ్లకు, ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డకు చాలా సున్నితమైందిగా భావిస్తారు. ఈ టైంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదం. ముఖ్యంగా గర్భిణులకు ఇప్పటికే ఏ రకమైన శారీరక సమస్యలు ఉన్నా.. ఈ సమయంలో వారికి ఎన్నో సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఉదాహరణకు.. గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్య ఆమెకు, ఆమె గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదాన్ని కలిగిస్తుంది. అందుకే గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యల ప్రభావాలను ఎలా నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రెగ్యులర్ చెకప్ లు
ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ల శరీరంలో ఎన్నో హార్మోన్ల మార్పులు వస్తాయి. దీనివల్ల చాలా మంది ఆడవాళ్లు థైరాయిడ్ సమస్యలను ఎదుర్కొంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే గర్భధారణ సమయంలో డాక్టర్లు థైరాయిడ్ టెస్ట్ చేస్తారు. అలాగే మీకు ఇప్పటికే థైరాయిడ్ సమస్య ఉంటే ప్రెగ్నెన్సీ సమయంలో కూడా క్రమం తప్పకుండా టెస్టులు చేయించుకోవాలి. దీంతో థైరాయిడ్ మందులను వాడాలి. సరైన చికిత్స చేయించుకోవాలి.
Image: Getty
ఆహారం విషయంలో జాగ్రత్తలు
చెడు ఆహారాలను తినడం వల్ల కూడా థైరాయిడ్ సమస్య వస్తుంది. అందుకే మీరు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు.. మీకు హైపర్ థైరాయిడిజం సమస్య ఉంటే.. మీ ఆహారంలో తగినంత ఉప్పును ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇలాంటి కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల థైరాయిడ్ ను నియంత్రించొచ్చు. అలాగే హైపోథైరాయిడిజం సమస్యతో బాధపడుతున్న మహిళలు ఆహారంలో అయోడైజ్డ్ ఉప్పు, తృణధాన్యాలు చేర్చుకోవాలి.
Image: Getty
మందులు
ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ ను నియంత్రించడానికి డాక్టర్లు మందులను సిఫారసు చేస్తారు. అందుకే డాక్టర్ సూచించిన విధంగా మందులను మోతాదులోనే తీసుకోండి. అలాగే మీకు మీరే మందుల్లో మార్పులు చేయకండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మందుల ప్రభావం తగ్గుతుంది. ముఖ్యంగా ఇది పుట్టబోయే బిడ్డ శారీరక, మానసిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
Image: Getty
యోగాభ్యాసం
క్రమరహిత జీవనశైలి కూడా థైరాయిడ్ కు ప్రధాన కారణాలలో ఒకటి. అందుకే దీనిని నియంత్రించడానికి యోగా సాధన చేయండి. ఇది మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. యోగా శరీరంలో థైరాయిడ్, ఇతర హార్మోన్లను నియంత్రించడానికి సహాయపడుతుంది. అయితే దీని కోసం కూడా మీరు యోగా నిపుణుడి సలహా తీసుకొని వారి సూచనల ప్రకారమే యోగాను సాధన చేయాలి.
ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి
పై వాటితో పాటుగా మీరు ఒత్తిడికి ఎక్కువగా గురికాకూడదు. ఎందుకంటే ఎక్కువ ఒత్తిడి థైరాయిడ్ సమస్యను మరింత పెంచుతుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. డాక్టర్ సూచించిన మందులను వాడుతూ.. మీ ఆహారం, జీవనశైలిని సమతుల్యంగా ఉంచితే మీరు చాలా సులువుగా థైరాయిడ్ ను నియంత్రించొచ్చు.