ఎండాకాలంలో అయితే రోజుకు రెండు మూడు సార్లు కూడా స్నానం చేస్తుంటారు. కానీ చలికాలంలో రోజూ స్నానమంటే కష్టమే అనిపిస్తుంది చాలా మందికి. వణికించే చలిలో స్నానం చేయకపోతే వచ్చే నష్టమేమీ లేదని చాలా మంది అనుకుంటారు. కానీ స్నానం చెయ్యకపోతే కూడా ఎన్నోఅనారోగ్య సమస్యలు వస్తాయి. ఇన్ఫెక్షన్లు, నోటి దుర్వాసనకు కారణమయ్యే సూక్ష్మక్రిములు, మలినాలను శరీరం నుంచి తొలగించడానికి మనం రెగ్యులర్ గా స్నానం చేయాలి. అయితే స్నానం చేస్తున్నారంటే.. చేస్తున్నాం అనకుండా.. కొన్ని భాగాలను బాగా క్లీన్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిని సరిగ్గా శుభ్రం చేయకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
మన శరీరంలో ఖచ్చితంగా రోజూ శుభ్రం చేయాల్సిన భాగాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఈ భాగాల్లో బాక్టీరియా, దుమ్ము, దుర్వాసన వంటివి పేరుకుపోయే ప్రమాదం ఉంది. వీటిని సరిగ్గా శుభ్రం చేయకుంటే మనం ఎన్నో రోగాల భారిన పడతాం. ఇంతకీ ఆ శరీర భాగాలేంటి? వాటిని ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Image: Getty
నాభి
బొడ్డు క్లీన్ గా అనిపించినప్పటికీ.. ఇది బ్యాక్టీరియా పెరగడానికి అనువైన ప్రదేశం. మనలో చాలా మంది నాభిని క్లీన్ అసలే చేయరు. దీనివల్ల అక్కడి నుంచి దుర్వాసన వస్తుంది. అందుకే స్నానం చేసినప్పుడు నాభిని ఖచ్చితంగా క్లీన్ చేయాలి. నాభిని శుభ్రం చేయడానికి మృదువైన సబ్బు, కాటన్ లేదా సాఫ్ట్ క్లాత్ ను ఉపయోగించండి. దీన్ని లోపలికి, బయటకు సున్నితంగా స్క్రబ్ చేయండి. ఆ తర్వత తుడవండి.
bath
చెవులు
చెవుల వెనుక భాగాన్ని చాలా మంది పట్టించుకోరు. కానీ ఇక్కడి చర్మంపై చెమట, నూనె, మృతకణాలు బాగా పేరుకుపోతాయి. దీంతో ఆ ప్రాంతం మొత్తం మురికిగా మారి దుర్వాసన వస్తుంది. అందుకే ఈ భాగాన్ని విడిగా క్లీన్ చేయాలి. జస్ట్ వాటర్ పోసినంత మాత్రాన ఆ మురికి పూర్తిగా పోదు. చెవులు, చెవి లోబ్స్, మడతల వెనుక సున్నితంగా తుడవడానికి తేలికపాటి తడి గుడ్డను, సబ్బును ఉపయోగించండి. కడిగిన తర్వాత క్లాత్ తో తడి లేకుండా తుడవండి.
bath
పిరుదులు
ఈ ప్రాంతం శరీరంలో బ్యాక్టీరియా, వాసనకు కేంద్రంగా ఉంటుంది. అందుకే తడి గుడ్డ, సబ్బు ఉపయోగించి పిరుదులను బాగా శుభ్రం చేయండి.అలాగే శరీరంలోని మడతలు, చంకలు లేదా రొమ్ముల దిగువ భాగం వంటి ప్రాంతాలను కూడా శుభ్రం చేయాలి. ఎందుకంటే ఈ ప్రాంతాల్లోనే చెమట ఎక్కువగా పడుతుంది. ఈ ప్రాంతాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోతే సంక్రమణ వ్యాపిస్తుంది. ఈ ప్రాంతాలను శుభ్రం చేయడానికి తేలికపాటి సబ్బు, తడి గుడ్డను ఉపయోగించండి. మృదువైన టవల్ తో ఈ ప్రాంతాలను బాగా తుడవండి.
bath
పాదాలు
స్నానం చేసేటప్పుడు మురికి నీరు పాదాలపైనే పడుతుంది. కానీ చాలా మంది తమ పాదాలు శుభ్రంగా ఉన్నాయని వాటిని క్లీన్ చేయడమే మర్చిపోతుంటారు. కానీ పాదాలు, కాలి వేళ్లను శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఇవి శిలీంధ్రాలు, బ్యాక్టీరియాకు కారణమవుతాయి. పాదాలను కడగడానికి తేలికపాటి సబ్బు, వాషింగ్ క్లాత్ ను ఉపయోగించండి. అలాగే కాలివేళ్ల మధ్య కూడా బాగా కడగండి.
bath
గోళ్లు
గోర్లు శుభ్రంగా ఉండాలంటే చేతులు కడుక్కుంటే సరిపోదు. చేతులతో పాటుగా గోర్లను కూడా ఖచ్చితంగా శుభ్రం చేయాలి. అలాగే గోర్లు కొద్దిగా పెరగగానే కట్ చేయాలి. లేదంటే వాటి కింద ఉండే మురికి, క్రిములు ఎన్నో రోగాలకు కారణమవుతాయి. గోర్లను శుభ్రం చేయడానికి గోర్ల కింద, చుట్టూ స్క్రబ్ చేయడానికి నెయిల్ బ్రష్, సబ్బును ఉపయోగించండి. గోర్లు పొట్టిగా, చివరి అంచులు మృదువుగా ఉండాలి. గోర్లు కొరకడం మానుకోండి. ఈ అలవాటు లేనిపోని రోగాలకు దారితీస్తుంది.