ముద్దు పెట్టుకుంటే చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

First Published Jan 27, 2022, 4:24 PM IST

దంపతులను మరింత దగ్గర చేసే ముద్దుతో (Kiss) చర్మానికి అనేక ప్రయోజనాలు (Skin benefits) కలుగుతాయి. ముద్దు పెట్టుకునే క్షణంలో శరీరంలో అనేక హార్మోన్ల ఉత్పత్తి జరిగి చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని శృంగార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

ప్రేమను మాటల్లో వ్యక్తపరిచలేక (Unable to express) ముద్దుల రూపంలో తెలియపరచడానికి చాలామంది ఇష్టపడతారు. ఇది దంపతుల మధ్య మరింత ప్రేమను (Love) బలపరుస్తుంది. అయితే ముద్దులతో చర్మానికి కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. 
 

చర్మం కాంతివంతంగా మారుతుంది: ముద్దు పెట్టుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మంలో ఆక్సిటోసిన్ హార్మోన్ (Oxytocin hormone) ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి చర్మానికి మంచి యాంటీ ఆక్సిడెంట్లుగా (Antioxidants) పని చేసి చర్మకణాలను ఉత్తేజపరుస్తాయి. దీంతో చర్మకణాలు శుభ్రపడి చర్మం కాంతివంతంగా మారుతుంది.
 

చర్మం పొడిబారకుండా ఉంటుంది: చర్మ సమస్యలకు (Skin problems) ముఖ్య కారణం ఒత్తిడి (Stress). అయితే ముద్దు పెడితే ఒత్తిడి సమస్యలు తగ్గుతాయట. కనుక భాగస్వామికి ప్రేమగా ముద్దు పెడితే ఎంతో మేలట. ఇలా చేస్తే చర్మ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఒక వ్యక్తి తన జీవితంలో కనీసం 20,000 నిమిషాల కంటే ఎక్కువ సమయం ముద్దు పెట్టుకుంటాడని కొన్ని పరిశోధనల్లో తేలింది. ముద్దు ఒత్తిడిని తగ్గించి చర్మం పొడిబారకుండా చూస్తుంది. 
 

కండరాలు ఉత్తేజంగా మారుతాయి: ముద్దు పెట్టుకుంటే ముఖంలోని 34 కండరాలు ఉత్తేజితమవుతాయి. ముద్దు పెట్టుకునే సమయంలో 112 యాంగిల్స్ లలో కండారులు పనిచేస్తాయి. దీంతో ముఖంలోని కండరాలు దృఢంగా మారుతాయి. అలాగే రక్త సరఫరా (Blood supply) కూడా మెరుగుపడి కండరాలు ఉత్తేజంగా (Stimulating the muscles) మారుతాయి.  
 

యాంటీ ఏజింగ్: ముద్దు పెట్టుకుంటే రక్త సరఫరా మెరుగుపడటంతో పాటు కొల్లాజెన్ (Collagen), ఎలాస్టిన్ (Elastin) అనే రెండు చర్మ పోషక ప్రోటీన్లు ఉత్పత్తి జరుగుతుంది. దీంతో చర్మం యాంటీఏజింగ్ సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటుంది.
 

ముడతలు రావు: ముద్దు పెట్టుకుంటే పెదాలు, నాలుక, బుగ్గలు, ముఖం, దవడ, మెడ కండరాలకు కదిలికలు ఏర్పడుతాయి. ఈ కదలికలు చర్మానికి మంచి వ్యాయామంగా (Exercise) పనిచేస్తాయి. అప్పుడు కండరాల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అప్పుడు చర్మం తాజాగా ఉంటుంది. దీంతో ముఖంపై ముడతలు (Wrinkles) రాకుండా ఉంటాయి. 
 

దంతాల ఆరోగ్యానికి మంచిది: ముద్దు పెట్టుకునే సమయంలో నోటిలో లాలాజలం (Saliva) ఉత్పత్తి అధికంగా ఉంటుంది. ఈ లాలాజలం దంతాలకు ఎంతో మేలు చేస్తుంది. దంత సమస్యలు రాకుండా ఉండి దంతాలు ఆరోగ్యంగా (Teeth healthy) ఉంటాయి.
 

చూసారా ముద్దు దాంపత్యజీవితంలో (Marital life) ఆలుమగల మధ్య బంధాన్ని పెంచడంతోపాటు చర్మానికి అనేక ఆరోగ్యప్రయోజనాలను కలుగజేస్తాయి. కనుక మీ భాగస్వామి మీద ప్రేమను వ్యక్తపరచడానికి ముద్దుల రూపంలో తెలియపరిస్తే మంచిది. సెక్స్ (Sex) లో పాల్గొనే సమయంలో ముద్దులతో భాగస్వామిని ప్రేరేపిస్తే శృంగారం మరింత రసవత్తరంగా మారడంతో పాటు చర్మానికి కలిగే ప్రయోజనాలు అనేకం.

click me!