మహేష్ జుట్టుపై మరో సారి డిస్కషన్... విగ్గా, హెయిర్ ప్లాన్ టేషనా?! తేలిపోయింది

First Published Apr 30, 2024, 8:28 AM IST

 “సర్కారు వారి పాట” “గుంటూరు కారం” సినిమాల్లో పొడువాటి హెయిర్ స్టయిల్ లో కనిపించారు. “గుంటూరు కారం” కోసం గడ్డం కూడా 

 మహేష్ బాబుకు దాదాపు  45 ఏళ్ళ వయసు ఉన్నప్పటికి పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తాడు. అందులోనూ  మహేష్ బాబు హెయిర్ స్టెయిల్ చాలా డిఫరెంట్‌గా  ఉండి ఎట్రాక్టివ్ గా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆయన హెయిర్ స్టెయిల్‌కు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే అదే సమంయలో మహేష్ జుట్టు పై చాలా మంది చాలా అనుమానలు ఉన్నాయి. ఈ ఏజ్ లో అంత జుట్టు సాధ్యమేనా ..అది నిజమైనా జుట్టా లేక  విగ్గా.. అనే సందేహం ఉంది.  సోషల్ మీడియాలో జట్టుపై భిన్న వాదనలు వినిపిస్తూంటాయి. అది నిజమైన జుట్టుని  కొందరూ.. కాదని మరికొందరూ.. ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు వాదనలతో ముందుకు వెళ్తూంటారు. అయితే అందులో నిజం ఏమిటి

చాలా కాలంపాటు  మహేష్ బాబు ఒకే రకమైన  స్టెయిల్ మైంటైన్ చేశారు. జుట్టు ట్రిమ్ గా, గడ్డం, మీసం కూడా ఉండీలేనట్లుగా ఉంచుకునేవారు. దాంతో మహేష్ బాబు స్టైల్ గురించి చాలా కామెంట్స్ వినిపించాయి.  నాని సినిమా నుంచి హెయిర్ స్టైయిల్ లో మార్పులు చేస్తూ వచ్చారు. అతిథి సినిమాలో లాంగ్ హెయిర్ తో కనపడ్డారు. ఖలేజా సినిమా నుంచి స్థిరమైన హెయిర్ స్టైల్‌ను మెుయిన్‌టైన్ చేస్తున్నారు. మహేష్ తాజా చిత్రం సర్కారి వారి పాటలో హెయిర్ స్టైల్ మార్పులు చేశారు.   


గమనిస్తే .... “సర్కారు వారి పాట” “గుంటూరు కారం” సినిమాల్లో పొడువాటి హెయిర్ స్టయిల్ లో కనిపించారు. “గుంటూరు కారం” కోసం గడ్డం కూడా కొంచెం థిక్ గా పెంచుకున్నారు. అయితే మహేష్ ఎలా అంత జుట్టుని మెయింటైన్ చేయగలుగుతున్నారనేది చాలా మందిలో పెద్ద ప్రశ్నగా మారింది. 


ఎందుకంటే మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, ఆయన సోదరుడు రమేష్ బాబుకి ఒక వయసుకి వచ్చాక జుట్టు బాగా ఊడిపోయింది. మహేష్ బాబుకి కూడా హెయిర్ సమస్య వచ్చింది అని ఆ ఆమధ్య రూమర్స్ వచ్చాయి. “సర్కారు వారి పాట” సినిమాలో మహేష్ బాబు హెయిర్ ఎక్సటెన్షన్స్ పెట్టుకున్నారు అని కొందరు, విగ్ అని మరికొందరు ప్రచారం చేశారు.
 

క్యూ 6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీ లాంటీ అత్యధునికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా మహేష్ తలపై జట్టుపై అమర్చినట్లుగా కొన్ని మీడియా సంస్దలు రాసుకొచ్చాయి. ఈ హెయిర్ ఫిక్సింగ్ సిస్టమ్‌ను నాన్ సర్జికల్ హెయిర్ ఫిక్సింగ్‌గా పిలుస్తారు. ఇది చూడడానికి సహాజమైన జట్టులాగనే కనిపిస్తోంది. మహేష్ ఒక్కొ సినిమాలో ఒక్కొ హెయిర్ ప్యాచ్‌స్ ఉపయోగించారు.  ఇంకొందరు మరొక అడుగు ముందుకు వేసి మహేష్ బాబు హెయిర్ వీవింగ్ చేయించుకున్నారని ఫిక్స్ చేసేసారు..

అయితే రీసెంట్ గా  మహేష్ బాబు ఎక్కువగా పబ్లిక్ ఈవెంట్స్ లో కనపడుతున్నారు. దాంతో  కెమెరా లలో ఆయన కనపడుతున్నారు. గుంటూరు కారం తర్వాత నాలుగు, ఐదు నెలలుగా ఆయన షూటింగ్ ల్లో పాల్గొనడం లేదు కానీ బయట మాత్రం కనపడుతున్నారు.  ఈ క్రమంలో మనం ఓ విషయం గమనించవచ్చు.  నాలుగు నెలల క్రితం ఆయన జుట్టు పొడువుకి, ఇప్పటి పొడవు కి చాలా తేడా కనిపిస్తోంది.


పొడువు పెరిగింది అంటే  మహేష్ బాబు ది నిజమైన జుట్టు అని అర్థమవుతోంది అని అభిమానులు అంటున్నారు. కాబట్టి ఇక మహేష్ బాబు జుట్టు గురించి ఇక రూమర్లు క్రియేట్ చేయటం మానండి..వేరే పని పెట్టుకోండి ఇంత కన్నా  ప్రూఫులు ఏమికావాలి? అని మహేష్ ఫ్యాన్స్ ఈ ఫొటోలు షేర్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. 


ఇక హటాత్తుగా ఇలా  పొడుగ్గా జుట్టు పెంచుకుంటున్నది రాజమౌళి తీసే కొత్త చిత్రం కోసమే. మహేష్ బాబు – రాజమౌళి చిత్రం (#SSMB29) జూన్ లో మొదలు కానుంది. మహేష్ బాబు రాజమౌళి కోరిక మేరకు జుట్టు పెంచుతున్నారని తెలుస్తోంది.  ఆ సినిమా కోసం జుట్టు బాగా పెంచుతూ, బాడీ మీద కూడా ఫోకస్ చేస్తూ స్పెషల్ గా రెడీ అవుతున్నాడు. ఇటీవల మహేష్ బాబు ఫోటోలు, వీడియోలు లీక్ అయితే మహేష్ లుక్ బాగా వైరల్ అవుతుంది. 


తాజాగా మహేష్ తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లో ఓ పెళ్ళికి హాజరయ్యాడు. ఈ పెళ్ళికి పలువురు సినీ ప్రముఖులు కూడా విచ్చేశారు. ఈ పెళ్ళికి మహేష్ బాబు అక్క మంజుల ఘట్టమనేని కూడా వచ్చింది. మంజుల మహేష్ బాబుని చూడగానే ఆ జుట్టు ఏంటి ఇంత పెంచేసావు అన్నట్టు జుట్టు పట్టుకొని మరీ చూసింది. కాసేపు వీళ్లిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. మంజుల, మహేష్ నవ్వుతూ మాట్లాడుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


అక్కాతమ్ముళ్ల సరదా సంభాషణ చూసి, అది కూడా రాజమౌళి సినిమా గురించి పెంచుతున్న జుట్టు గురించే మాట్లాడుకుంటున్నట్టు ఈ వీడియో ఉండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక రాజమౌళి సినిమా ఎప్పుడు మొదలుపెడతారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి – మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టు సమాచారం.
 


SSMB29గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి టీమ్ కసరత్తులు మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను టీమ్ వేగవంతం చేసింది. ఈ ప్రీ ప్రొడక్షన్   పనుల నిమిత్తం రీసెంట్‌గా టీమ్ దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆ పనులను ముగించుకుని ప్రస్తుతం టీమ్ అంతా హైదరాబాద్ వచ్చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహేష్ బాబుని చూసిన వారంతా.. ‘ఏమున్నాడ్రా బాబు’ అని, మరీ ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు.

Mahesh Babu


గతంలో ఇంతకు ముందెన్నడూ మహేష్ కనిపించిన అవతార్‌లో ఈ సినిమాలో కనిపిస్తాడనేది సుస్పష్టమవుతోంది. మహేష్ బాబు లుక్‌ (Mahesh Babu Look Test) టెస్ట్ నిమిత్తమే.. టీమ్ దుబాయ్ వెళ్లినట్లుగా ఈ మధ్య వార్తలు వైరల్ అయ్యాయి. దుబాయ్‌లో టీమ్ అంతా డిస్కస్ చేస్తున్నట్లుగా ఓ పిక్ ఆల్రెడీ వైరల్ అవుతుండగా.. ఇప్పుడు మహేష్-రాజమౌళిని ఇలా చూసిన వారంతా లుక్ ఫైనలై ఉంటుందనేలా కామెంట్స్ చేస్తుండటం విశేషం.

click me!