కరోనా టెస్టు చేయించుకుంటే నెగిటివ్.. కానీ లక్షణాలు కనపడితే..?

First Published Jul 24, 2020, 2:24 PM IST

వైరస్ సోకిన వెంటనే పరీక్ష చేస్తే.. ఖచ్చితమైన ఫలితం రాకపోవచ్చు. కానీ.. రెండోసారి చేయించుకుంటే.. ఖచ్చితమైన ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇక స్వాబ్ పరీక్షను ఖచ్చితంగా కరెక్ట్ అని చెప్పలేం.
 

కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దేశంలో 12లక్షల మందికి ఈ వైరస్ సోకింది. ఇంతలా వైరస్ ప్రబళుతున్నా... ఇంకా ఈ వైరస్ విషయంలో ప్రజలు తికమకపడుతున్నారు.
undefined
దీని గురించి పూర్తి సమాచారం ఎవరిని అడగాలో తెలియక.. గూగుల్ తల్లిని అడిగేస్తున్నారు. అసలు.. గూగుల్ లో కరోనా పరీక్షల గురించి ప్రజలు ఏం శోధిస్తున్నారు.. వాటికి సరైన సమాధానాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం..
undefined
1.కోవిడ్ 19 స్వాబ్ పరీక్ష ఎక్కడ చేస్తారు?దీని కోసం ముందుగా మీ ఫ్యామిలీ డాక్టర్ ని సంప్రదించాలి. కోవిడ్ 19 పరీక్ష లు చేసే ప్రథమ చికిత్స కేంద్రాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవి కాకుండా స్థానిక ఆస్పత్రుల్లో కోవిడ్ టెస్ట్ క్యాంపులు, ప్రైవేట్ ల్యాబ్‌లు, ఇంటింటికి పరీక్షలు కూడా చేస్తున్నారు. టెస్టర్ గురించి మరింత సమాచారం కోసం, మీరు స్థానిక పరిపాలన వెబ్‌సైట్, హెల్ప్‌లైన్‌కు కూడా కాల్ చేయవచ్చు.
undefined
2.కోవిడ్ 19 స్వాబ్ టెస్ట్ ఫలితాన్ని ఎంత వరకు నమ్మవచ్చు..?కరోనా వైరస్ నిర్థారణకు దాదాపు పీసీఆర్ పరీక్ష చేస్తారు. ఇది ముక్కులోపల భాగాల్లో వైరస్ ఉందో లేదో తెలుసుకోవడానికి చేస్తారు. నిజానికి ఎవరికైనా వైరస్ ఎటాక్ అవ్వగానే.. వారి ముక్కలోపలి పైభాగంలో ఈ వైరస్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అయితే.. వైరస్ సోకిన వెంటనే పరీక్ష చేస్తే.. ఖచ్చితమైన ఫలితం రాకపోవచ్చు. కానీ.. రెండోసారి చేయించుకుంటే.. ఖచ్చితమైన ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇక స్వాబ్ పరీక్షను ఖచ్చితంగా కరెక్ట్ అని చెప్పలేం.
undefined
3.టెస్టు రిపోర్టులో నెగిటివ్ వచ్చినా.. కరోనా లక్షణాలు కనపడితే...?కొందరికి ఈ మధ్య కోవిడ్ పరీక్ష రిపోర్టులో నెగిటివ్ వచ్చినా కూడా.. కరోనా లక్షణాలు కనపడుతున్నాయి. దీంతో తమకు వైరస్ సోకిందో లేదో తెలీక చాలా మంది తికమకపడుతున్నారు. అలాంటి వారు ముందు డాక్టర్ ని సంప్రదించాలి. ఒక పరీక్షలో నెగిటివ్ వస్తే.. వైరస్ నిర్థారణకు మరో పరీక్షను నిర్వహిస్తారు. గొంతునొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనపడితే.. టెస్టులో పాజిటివ్ రావాలి. అలా రాలేదు కానీ.. లక్షణాలు ఉన్నాయి అంటే.. శ్వాసకు సంబంధించిన పరీక్షలు చేస్తారు. ఇక్కడ ఆక్సీజన్ లెవల్స్ పరీక్షీస్తారు. అక్కడ కూడా తేడా ఉంటే.. సిటీ స్కాన్ చేస్తారు. దాని ద్వారా అసలు ఖచ్చితమైన ఫలితం వస్తుంది.
undefined
4.కరోనా పరీక్ష తప్పు రావడానికి గల కారణాలు..?ఈ ప్రశ్నను చాలా మంది ఎక్కువగా గూగుల్ లో శోధిస్తుండటం గమనార్హం. వైరస్ సోనిక తొలి రోజుల్లో పరీక్ష చేయించుకుంటే నెగిటివ్ రావచ్చు. కాబట్టి... వారం రోజుల తర్వాత మరోసారి పరీక్ష చేయించుకుంటే.. అసలు ఫలితం వచ్చే అవకాశం ఉంది.
undefined
5.కోవిడ్ 19 పరీక్ష చేయడానికి గల పద్ధుతులు ఏంటి?సాధారణంగా కరోనా పరీక్ష ముక్కు, గొంతులోపల లాలాజలంలో వైరస్ ఉందో లేదో తెలుసుకొని చేస్తారు. కానీ ఇప్పుడు ఈ నమూనాల ప్రామాణికతను ధృవీకరించడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. వైరస్ యొక్క జన్యు పదార్థాన్ని గుర్తించడానికి న్యూక్లియిక్ యాసిడ్ పరీక్షకులు మరియు యాంటిజెన్ పరీక్షలు నిర్వహిస్తారు. యాంటిజెన్ టెస్టర్ నివేదిక సానుకూలంగా ఉన్నప్పటికీ, దానిని నిర్ధారించడానికి న్యూక్లియిక్ యాసిడ్ పరీక్ష అవసరం.
undefined
6.ఇంట్లోనే కోవిడ్ 19 పరీక్ష సాధ్యమేనా?ఇంట్లోనే కోవిడ్ 19 పరీక్ష చేయించుకోవడానికి సాధ్యమౌతుందా అనే అనుమానం చాలా మందిలో ఉంది. దీంట్లో ఇంటికి వచ్చి పరీక్షలు చేస్తారు. గృహ పరీక్ష వస్తు సామగ్రి యొక్క నాణ్యత మరియు విశ్వసనీయత ఇంకా తెలియలేదు. అయితే, ఈ రకమైన వస్తు సామగ్రిని ప్రపంచంలోని అనేక దేశాలలో ఉపయోగిస్తున్నారు. ఆరోగ్య కార్యకర్త ద్వారా నమూనా చేయడం ఉత్తమమని నిపుణులు భావిస్తున్నారు మరియు నమూనాలను ధృవీకరించబడిన ప్రయోగశాలలో పరీక్షిస్తారు.
undefined
7.నిజంగా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలంటే ఏం కావాలి?మీకు నిజంగా కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానం ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వారు ఇచ్చే ప్రిష్కిప్షన్ ఉంటే.. కోవిడ్ పరీక్ష చేయించుకోవచ్చు.
undefined
click me!