షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్.. రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్, షాకింగ్ రీజన్

Published : May 05, 2024, 06:51 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఏపీ మొత్తం ఎలక్షన్ క్యాంపెనింగ్ చేస్తున్నారు. జనసేన పార్టీ 2024 ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. పవన్ స్వయంగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నారు.

PREV
16
షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్.. రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్, షాకింగ్ రీజన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఏపీ మొత్తం ఎలక్షన్ క్యాంపెనింగ్ చేస్తున్నారు. జనసేన పార్టీ 2024 ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. పవన్ స్వయంగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నారు. దీనితో పవన్ తాత్కాలికంగా సినిమాలన్నీ పక్కన పెట్టి రాజకీయాలకే పరిమితం అయ్యారు. 

26

లోకల్ మీడియా, జాతీయ మీడియాలకు పవన్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సంపాదన గురించి ఈ ఇంటర్వ్యూలో చర్చకి వచ్చింది. మీరు వరుసగా విరాళాలు ఇస్తుంటారు. సైనికుల కోసం కోటి రూపాయలు ఇచ్చారు. ఇటీవల పోలవరం నిర్వాసితుల కోసం కోటి రూపాయలు ప్రకటించారు.అసలు డబ్బుపై మీ ఆలోచన ఏంటి అని యాంకర్ ప్రశ్నించారు. 

36

దీనికి పవన్ బదులిస్తూ డబ్బు మీద నాకు అంతగా మమకారం లేదు. ఒక సందర్భంలో కోలా యాడ్ కోసం షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తాం.. యాడ్ చేయండి అని అడిగారు. కానీ నేను రిజెక్ట్ చేశాను. అలా సంపాదించడం ఇష్టం లేదు. డబ్బు ఎలా సంపాదించాలి అనే విషయంలో నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. 

46

నేను సినిమాల్లో రాణిస్తున్నాను. ప్రభాస్, మహేష్, రాంచరణ్ లాంటి హీరోలతో పాటు నాకు కూడా మంచి మార్కెట్ ఉంది. ఆ సంపాదన నాకు చాలు. నేను సంపాదించిన దాంట్లోనుంచి ప్రజలకు ఎంతో కొంత ఇవ్వాలి అనే నియమం కూడా పెట్టుకుననట్లు పవన్ తెలిపారు. 

56

పవన్ కళ్యాణ్ గతంలో కమర్షియల్ యాడ్స్ చేసే వారు. ఆ తర్వాత కాలంలో తాను ఉపయోగించని ఉత్పత్తులకు ప్రచారం కల్పించడం సరైనది కాదని యాడ్స్ చేయడం మానేశారు. 

66
pawan kalyan

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత పవన్ ఈ చిత్రాలని పూర్తి చేసే అవకాశం ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories