కేటీఆర్ ... చీర కట్టుకుని ఆర్టిసి బస్సెక్కు..: సీఎం రేవంత్ సంచలనం

By Arun Kumar PFirst Published May 5, 2024, 5:53 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి బిఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ను అయితే చవట, దద్దమ్మ, దివానీ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు రేవంత్. 

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లపై రేవంత్ విరుచుకుపడ్డారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ ఐదు నెలల్లో చేసిందేమీ లేదన్న మాజీ మంత్రి కేటీఆర్ కు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలోని ఆడబిడ్డలకు ఆర్టిసి బస్సుల్లో ఫ్రీ బస్ జర్నీ సదుపాయం కల్పిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ గుర్తుచేసారు. కేటీఆర్ కూడా చీర కట్టుకుని ఆర్టిసి బస్సు ఎక్కాలని... ఉచితంగానే తిప్పుతూ కాంగ్రెస్ చేసిన అభివృద్ది, ప్రజా సంక్షేమాన్ని చూపిస్తామన్నారు. ఇందుకు సిద్దమా అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. 

ఇక రైతు రుణమాఫీ, రైతు బంధు గురించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మాట్లాడుతున్న మాజీ సీఎం కేసీఆర్ పైనా రేవంత్ విరుచుకుపడ్డారు. ఆయన మతి వుండి మాట్లాడుతున్నాడో లేక మందేసి మాట్లాడుతున్నాడో అర్థం కావడంలేదంటూ సీఎం ఎద్దేవా చేసారు. ఓ సన్నాసి, సోయిలేనోడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలినోడా, దివానిగా...  అంటూ కేసీఆర్ పై తీవ్ర పదజాలంతో దూషించారు రేవంత్. 

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి బూతు పురాణం pic.twitter.com/npmzPCbKsc

— Telugu Scribe (@TeluguScribe)

 

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని 69 లక్షల మందికి రైతులకు గాను 65 లక్షల మందికి రైతు భరోసా పథకం అందించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. మిగతా నాలుగు లక్షలమందికి కూడా మే 9వ తేదీలోపు రైతు భరోసా అందిస్తామన్నారు. ఆ తర్వాత ఏ ఒక్క రైతుకైనా రైతు భరోసా సొమ్ము అందకుంటే తెలంగాణ  అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు   రాస్తాను... లేదంటే కేసీఆర్ క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాసేందుకు సిద్దమా అంటే సీఎం రేవంత్ సవాల్ విసిరారు. 

ఇక మాజీ మంత్రి హరీష్ రావుపైనా సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రైతు రుణమాఫీ కోసమంటూ హరీష్ రాజీనామా డ్రామా ఆడుతున్నాడు... కానీ అసలు రాజీనామా లేఖ అలా వుండదన్నారు. తాటిచెట్టులా పెరిగిన హరీష్ కు మెదడు మోకాళ్లలో కాదు అరికాళ్లలోకి జారిందన్నారు. ఆగస్ట్ 15 లోపు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తాను... రాజీనామా రెడీగా పెట్టుకో అంటూ సీఎం రేవంత్ సవాల్ విసిరారు. 

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపైనా సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. విభజన హామీలను నెరవేర్చాలని... రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని మోదీ సర్కార్ ను కోరితే గాడిద గుడ్డు చేతిలో పెట్టిందన్నారు. అలాంటి బిజెపికి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. బిజెపి మాటలు నమ్మి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయవద్దని... కాంగ్రెస్ ను గెలిపిస్తేనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

click me!