ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో రైతులకు అసలైన భరోసా.. ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయా ?

By tirumala ANFirst Published May 5, 2024, 7:28 PM IST
Highlights

ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై భయాలు సృష్టించి తద్వారా కూటమి లాభపడాలని ప్రయత్నిస్తోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో అమలైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై భయాలు సృష్టించి తద్వారా కూటమి లాభపడాలని ప్రయత్నిస్తోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 

గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టిడిపి అనుకూల మీడియాలోనే కొన్ని కథనాలు వచ్చాయి. ఆ కథనాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు చాలా మంచింది అని తెలిపారు. కానీ ఇప్పుడు అదే మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే ప్రజలకు భూ సమస్యలు ఉండవని గతంలో టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయి. 

గతంలో ఈనాడు గ్రూపులో వచ్చిన కథనం ప్రకారం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూ యజమానులకు భద్రత ఉంటుందని పేర్కొన్నారు. ఇండియాలో లెక్కకి మించిన రికార్డులు ఉన్నాయి. ఈ రికార్డుల్లో భూ వివరాలు ఉంటాయి. కానీ ఏ ల్యాండ్ కి ప్రభుత్వం నుంచి గ్యారెంటీ ఉండదు. 

మరొకరు వచ్చి ఆ భూమిపై తనకి హక్కు ఉందని ఆరోపణ చేయనంత వరకు రికార్డులో ఉన్న యజమానికి ఆ స్థలం దక్కుతుంది. మరొకరు ఆరోపిస్తే కోర్టులో వివిధ పత్రాల ద్వారా నిరూపించుకోవాల్సి ఉంటుంది. గతంలో భూ యజమానులు వివరాలు సరైన విధంగా రికార్డ్ కానందు వల్ల అనేక సమస్యలు వచ్చేవి. కానీ కొత్త చట్టం అమలతో భూ యజమానులు తమ పేరుని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

రికార్డుల్లో ఎవరి పేరు ఉంటే వారినే యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి భద్రత కల్పిస్తుంది. ఇది కొత్తగా వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విధానం. ఇంతవరకు భూమికి సంబంధించిన ఏ రికార్డు ఫైనల్ రికార్డు కాదు. భూమి సమస్య వస్తే నిరూపించుకోవడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకువచ్చారు అని వైసిపి నేతలు చెబుతున్నారు. 

కొన్ని దశాబ్దాలుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉదాహరణకి ఒక వ్యక్తిని తెలంగాణాలో ల్యాండ్ ఉంది. అతని దగ్గర పాస్ పుస్తకం ఉంది. మరో వ్యక్తి కోర్టుకు వెళ్లి ఆ ల్యాండ్ వివరాలు తప్పు.. అది తన ప్రాపర్టీ అని నిరూపించుకోవచ్చు. అంటే పాస్ పుస్తకం ఉన్నప్పటికీ గ్యారెంటీ లేదు. దీనితో ఎవరి పేరుపై ల్యాండ్ ఉంటుందో.. పాస్ పుస్తకం ఉంటుందో ఆ యజమానికి భద్రత కల్పించే చట్టమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని నిపుణులు అంటున్నారు. 

click me!