సమంతకు శోభిత దూళిపాళ్ల కౌంటర్? ఆ పోస్ట్ అర్థం అదేనా?

By Sambi ReddyFirst Published May 5, 2024, 7:04 PM IST
Highlights

శోభిత ధూళిపాళ్ల సోషల్  మీడియా పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. ఆమె సదరు పోస్ట్ ద్వారా  సమంతకు కౌంటర్ ఇచ్చారనే మాట వినిపిస్తుంది... 
 

తెలుగమ్మాయి హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల  పలు భాషల్లో సినిమాలు చేస్తూ...  కెరీర్ లో దూసుకెళ్తుంది. తెలుగులో ఆమెకు పెద్దగా ఆఫర్స్ లేకపోయినప్పటికీ బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తుంది.  ఆమె నటించిన మంకీ మ్యాన్ చిత్రం తాజాగా విడుదలైంది. ఈ మూవీ  మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ దేవ్ పటేల్ హీరోగా నటించాడు. ఈ చిత్రంలో ఆమె వేశ్య పాత్ర చేయడం విశేషం. 

మరోవైపు  శోభిత - నాగ చైతన్య డేటింగ్ రూమర్స్ తరచూ వినిపిస్తున్నాయి. నాగ చైతన్య - శోభిత డేటింగ్ చేస్తున్నారట. చాలా కాలంగా వీళ్ళు రిలేషన్ లో ఉన్నారని .. పైగా వెకేషన్స్ కి కూడా కలిసే వెళ్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దానికి తోడు వాళ్ళు పెట్టే పోస్ట్ లలో పోలికలు వెతికి మరీ నాగ చైతన్య - శోభిత డేటింగ్ చేస్తున్నారంటూ నెటిజన్లు వాటిని  వైరల్ చేస్తున్నారు.   

ఈ వార్తలపై నాగ చైతన్య, శోభిత నేరుగా స్పందించింది లేదు. అయితే తాజాగా శోభిత తన ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. '' ఐయామ్ నాట్ ఎవ్రీ వన్ కప్ ఆఫ్ చాయ్ .. అండ్ దట్స్ ఒకే '' అంటూ పోస్ట్ చేసింది. అంటే నేను ఎవరికీ నచ్చకపోయినా నాకేం పర్వాలేదు అని అర్థం. ఈ పోస్ట్ సమంతను ఉద్దేశించి శోభిత చేసిందనే వాదన వినిపిస్తుంది.  ప్రస్తుతం శోభిత చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ క్రమంలో సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతం జుకల్కర్ శోభిత పోస్ట్ పై స్పందించారు. 

నేను కూడా నా విషయంలో అలానే ఫీల్ అవుతుంటాను అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రీతమ్ సమంత ప్రియుడని పుకార్లు వినిపించిన విషయం తెలిసిందే.  దీంతో వీళ్ళ కామెంట్స్ ఇప్పుడు మరో చర్చకు దారి తీస్తున్నాయి. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన శోభిత గూఢచారి, మేజర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తన నటనకు ప్రశంసలు అందుకుంది. తెలుగులో పెద్దగా రాణించలేకపోయింది. ఇటీవల రామన్ రాఘవన్ 2.0, పొన్నియన్ సెల్వన్, ఘోస్ట్ స్టోరీస్ వంటి ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది . 
 

click me!