రోజూ శృంగారంలో పాల్గొనడం మంచిదేనా?

First Published May 28, 2023, 9:40 AM IST

శృంగారంతో బోలెడు లాభాలున్నాయి. సెక్స్ లో పాల్గొంటే శారీరక, మానసిక సమస్యలెన్నో తగ్గిపోతాయి. ఇలాంటప్పుడు రోజూ సెక్స్ లో పాల్గొనొచ్చా? లేదా? అన్న డౌట్లు చాలా  మందికి వస్తుంటాయి. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే?  
 

శృంగారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి దాదాపుగా అందరికీ తెలుసు. అందులోనూ సెక్స్ ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా, ఆనందంగా ఉంచుతుంది. ఇది హ్యాపీ  హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. అయితే ప్రతి రోజూ సెక్స్ లో పాల్గొనడం మంచిదేనా అన్న ప్రశ్న చాలా జంటలు అడుగుతుంటారు. నిపుణుల ప్రకారం..  శృంగారం అనేది జీవించడానికి ఆరోగ్యకరమైన మార్గం. అలాగే ప్రతిరోజూ శృంగారం చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. 

శృంగారంలో ఎప్పుడు ఆందోళన చెందాలి?

అసురక్షిత శృంగార పద్ధతులు, అనారోగ్య అలవాట్ల వల్ల సెక్స్ తో ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఈ అసురక్షిత పద్ధతులు భాగస్వాములను ప్రమాదంలో పడేస్తాయి. అలాగే లైంగికంగా సంక్రమించే రోగాలు వచ్చేలా చేస్తాయి. సంక్రమణ వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఉంది.
 

ముఖ్యంగా ఎక్కువ మంది భాగస్వాములతో సెక్స్ లో పాల్గొనేవారితో శృంగారంలో పాల్గొనడం చాలా డేంజర్. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో సెక్స్ లో పాల్గొనేవారి వల్ల మీకు లైంగిక సంక్రమణ వ్యాధులు,  అవాంఛిత గర్భాలు వచ్చే ప్రమాదం ఉంది.

Image: Getty

రోజూ శృంగారంలో పాల్గొనడానికి కారణాలు? 

క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనడం వల్ల శరీరంలో మంచి హార్మోన్లు పెరుగుతాయి. ఇది సానుకూలతను పెంచుతుంది. అలాగే ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. అందుకే ఎలాంటి భయాలు లేకుండా రోజూ సెక్స్ లో పాల్గొనొచ్చు.
 

Image: Getty

ఇది నిద్రకు కూడా మంచిది

నిజానికి సెక్స్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే డీహైడ్రోపియాండ్రోస్టెరాన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. దీంతో మీకు ఎన్నో వ్యాధుల ముప్పు తప్పుతుంది. 

Image: Getty

ఇది గుండెను సంరక్షిస్తుంది

పలు అధ్యయనాల ప్రకారం.. వారానికి రెండుసార్లు కంటే ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనేవారికి గుండె జబ్బుల ప్రమాదాలు వచ్చే అవకాశం తక్కువ. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

సెక్స్ హాని కలిగించడానికి బదులుగా.. మీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వారానికి కనీసం రెండుసార్లు శృంగారంలో పాల్గొనే పురుషులు, సంతృప్తికరమైన లైంగిక జీవితం ఉన్న మహిళలకు గుండెపోటు వచ్చే అవకాశం తక్కువని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. 
 

సెక్స్ చేయడం ఎప్పుడు ఆపేయాలి?

రతిక్రీడ కూడా ఒక మంచి వ్యాయామం తెలుసా? ఇది  ఆరోగ్యకరమైన వ్యాయామంగా పరిగణించబడుతుంది. అయిన్నప్పటికీ.. మీరు సెక్స్ లో పాల్గొనడం మానేయడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. అవేంటంటే..
 

మీకు ఛాతిలో నొప్పిగా ఉన్నప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతున్నప్పుడు, హృదయ స్పందన సక్రమంగా లేనప్పుడు, అజీర్థి సమస్య ఉన్నప్పుడు సెక్స్ లో పాల్గొనకపోవడమే మంచిది. ఇలాంటి సమస్యలు ఉండే మీరు సెక్స్ చేయడం మానేయాలని నిపుణులు చెబుతున్నారు.
 

జాగ్రత్త వహించాల్సిన విషయాలు

మీకు ఆరోగ్యం బాగోలేకపోతే సెక్స్ లో పాల్గొనకండి. ఇలాంటి సమయంలో మీరు క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనడం వల్ల శరీరంలోని అంతర్గత భాగాలు కోలుకోలేవు. మీరు సెక్స్ లో పాల్గొనే ముందు జననేంద్రియాల చుట్టూ ఉన్న చర్మం నయం కావడానికి కాస్త సమయం పడుతుంది.

తరచుగా రతిక్రీడలో పాల్గొనే జంటలలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా కనిపిస్తాయి. అంటువ్యాధుల గురించి మాట్లాడితే.. తరచుగా సెక్స్ చేయడం వల్ల కూడా లైంగిక సంక్రమణ అంటువ్యాధులు వస్తాయి. 

click me!