Woman

బియ్యం నీళ్లతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా

Image credits: freepik

జుట్టు పెరగడానికి

బియ్యం నీళ్లతో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టు కుదుళ్లను బలంగా చేస్తాయి. అంతేకాదు నెత్తిమీద రక్త ప్రసరణను పెంచి జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగడానికి సహాయపడతాయి. 

 

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

రైస్ వాటర్ లో ఎన్నో రకాల విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన చర్మాన్ని ముడతలు లేకుండా, కాంతివంతంగా చేయడానికి సహాయపడతాయి. రైస్ వాటర్ వల్ల మీ స్కిన్ సాఫ్ట్ గా అవుతుంది. 

 

Image credits: zoom tv

బలమైన జుట్టు

రైస్ వాటర్ లో పిండి పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు చివర్లు విచ్చిన్నం కాకుండా చూస్తుంది. అలాగే జుట్టుకు మంచి షైనీని ఇస్తుంది. ఇది జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది. 

 

Image credits: sugar comestics

మొటిమలను తగ్గిస్తుంది

రైస్ వాటర్ మొటిమలను తగ్గించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను, ఎరుపును తగ్గించడానికి సహాయపడతాయి. ఇది చర్మాన్ని హెల్తీగా ఉంచుతుంది. 

Image credits: freepik

చర్మానికి తేమను అందిస్తుంది

రైస్ వాటర్ లో మాయిశ్చరైజింగ్ లక్షణాలుంటాయి. ఇవి డ్రై స్కిన్ ను తేమగా చేస్తాయి. అలాగే చర్మం పొడిబారకుండా కాపాడుతాయి. దీనితో చర్మం ఎప్పుడూ తాజాగా ఉంటుంది. 

Image credits: Freepik

సూర్యరశ్మి నుంచి ఉపశమనం

రైస్ వాటర్ లో సూర్యరశ్మి, చర్మ చికాకును నుంచి చర్మాన్ని కాపాడే లక్షణాలుంటాయి. ఇది ఎండవల్ల గాయపడిన చర్మాన్ని తిరిగి నయం చేయడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty
Find Next One