హీరో లెక్ట్రో H5 ఎలక్ట్రిక్ సైకిల్ మాక్సిమం స్పీడ్ 25 కి.మీ./గం. కాబట్టి దీనికి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. నగరాల్లో రోజు వారీ పనులు చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చిన్న దూర ప్రయాణాలకు కూడా ఇది చాలా బాగుంటుంది. ఇది స్టూడెంట్స్ కి చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ట్రాఫిక్ సమస్య లేకుండా టైమ్ కి స్కూళ్లకి, కాలేజీలకు వెళ్లడానికి ఉపయోగపడుతుంది.
రోజూ బ్యాటరీని చార్జ్ చేసుకుంటూ ఉంటే ఇక ఎలాంటి సమస్య ఉండదు. ట్రాఫిక్‌లో ఆలస్యమైనా, బ్యాటరీ పూర్తిగా డిశ్ఛార్జ్ కాదు. ఈ సైకిల్‌లో 36V 5.8Ah లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది.