WhatsAppలో మరో సూపర్ ఫీచర్.. వాయిస్ నోట్స్‌ని Textగా మార్చుకోవచ్చు

First Published | Nov 23, 2024, 8:45 AM IST

WhatsApp మరో అద్భుతమైన ఫీచర్ ని తీసుకొస్తోంది. అదే వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్షన్‌. దీని ద్వారా వినియోగదారులు ఆడియో సందేశాలను Textగా  మార్చుకోవచ్చు. ఈ ఫీచర్ వివిధ భాషలు మాట్లాడేవారికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ఎప్పుడు వాట్సాప్ లోకి వస్తుంది? దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి. 

WhatsAppలో వాయిస్ నోట్స్ చాలా సులభంగా సెండ్ చేయొచ్చు కదా.. మైక్ బటన్ ప్రెస్ చేసి మీరు చెప్పాలనుకున్నదంతా మీ మాటల్లోనే చెప్పేయొచ్చు. ప్రతి పదం టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే మీరు మీటింగ్ ల్లో ఉన్నప్పుడు, అందరితో కలిసి చర్చలు, సరదా కబుర్లు చెబుతున్నప్పుడు ఇలాంటి వాయిస్ మెసేజ్ లు వస్తే వాటిని వినడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ వాయిస్ నోట్స్ లో ఏవైనా సీక్రెట్స్ కూడా ఉండొచ్చు కదా.. బిజినెస్ కు సంబంధించినవి, పర్సనల్ లైఫ్ కి సంబంధించినవి, క్లోజ్ ఫ్రెండ్స్ మాట్లాడే విషయాలు కూడా ఉండొచ్చు. 

అందుకే అలాంటివి టెక్ట్స్ రూపంలో అయితేనే చదవడానికి వీలుగా ఉంటుంది. ఇకపై ఇలాంటి ఇబ్బందిని తొలగించేలా వాట్సాప్ కొత్త ఫీచర్ ని తీసుకొస్తోంది. ఈ మెసేజింగ్ యాప్‌లో మీకు వచ్చిన ఆడియో సంభాషణను ట్రాన్స్‌క్రైబ్ చేయడానికి దానిపై ట్యాప్ చేసి టెక్ట్స్ మెసేజ్ గా మార్చేయొచ్చు. ఈ ఫీచర్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.

సాధారణంగా WhatsApp వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్షన్‌ను అనుమతించదు. అయితే రానున్న ఈ కొత్త ఫీచర్ వల్ల మీరు ఆటోమెటిక్ గా వాయిస్ మెసేజ్ వచ్చిన చోటే ట్రాన్స్‌క్రిప్ట్‌ చేయవచ్చు. 


WhatsAppలో కొత్త ఫంక్షన్‌ను ఎలా వర్క్ చేస్తుందంటే..

మీకు వాయిస్ సందేశం వచ్చిన తర్వాత ట్రాన్స్‌క్రైబ్ చేసేందుకు మీరు దానిపై క్లిక్ చేసి "డౌన్‌లోడ్" చేయండి. వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్షన్ చేయాలంటే ఆ ఫైల్ సైజ్ దాదాపు 90 MB ఉండాలి. ఇలా డౌన్ లోడ్ చేసిన ఫైల్ మీకు వాయిస్ ఫైల్ కింద కనిపిస్తుంది.

WhatsApp వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ ఫోన్‌లో మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి మీరు వాట్సాప్ సైట్‌లో ఈ ఫీచర్ ని మీరు చూడలేరు. ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్, హిందీ భాషల్లోకి మాత్రమే ఈ ట్రాన్స్‌క్రిప్షన్ జరిగేలా వాట్సాప్ ఏర్పాట్లు చేస్తోంది. 

ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవాలంటే ముందుగా మీరు Settings లోకి వెళ్లాలి. అందులో Chats పై క్లిక్ చేసి Voice Message Transcription ఆప్షన్‌కు వెళ్లండి. మీరు ఫీచర్‌ను ఆన్ చేసుకుటే ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ ఎనేబుల్ అవుతుంది. ఇందులో మీ ప్రైమరీ లాంగ్వేజీని కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత వాయిస్ నోట్‌ని ట్రాన్స్‌క్రిప్షన్ కూడా అంతే సులభంగా జరుగుతుంది. 

వచ్చిన ప్రతి వాయిస్ కమ్యూనికేషన్ ప్రారంభం నుండి చివరి వరకు ఎన్‌క్రిప్ట్ అవుతుందని WhatsApp హామీ ఇస్తోంది. వాయిస్ ఫైల్ టెక్స్ట్ గా మారే క్రమంలో మీ ఇన్ఫర్మేషన్ గాని, మీ డేటా గాని ఎవరికీ షేర్ అవ్వదని, ఎక్కడా స్టోర్ అవ్వదని వాట్సాప్ యాజమాన్యం చెబుతోంది. అందరికీ ఉపయోగపడే ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. త్వరలోనే అప్ డేట్ చేస్తామని వాట్సాప్ ప్రకటించింది. 

Latest Videos

click me!