రోజు రోజుకీ బరువు పెరిగిపోతున్నారా? అలా అని వ్యాయామం చేయడానికి కూడా టైమ్ కుదరడం లేదా? అయితే.. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. బరువు తగ్గడానికి వ్యాయామం చేయడం ఒక్కటే మార్గం కాదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సినంత తీసుకున్నా కూడా ఈజీగా బరువు తగ్గవచ్చు. మరి, ఎలాంటి ఆహారం డైట్ లో భాగం చేసుకుంటే మీరు ఈజీగా బరువు తగ్గగలరో ఇప్పుడు తెలుసుకుందాం...
బరువు తగ్గించే సీడ్స్..
మనం కొన్ని రకాల సీడ్స్ ని డైట్ లో భాగం చేసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చట. అవును. మీరు సీడ్స్ తినడం వల్ల... ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఫలితంగా ఈజీగా బరువు తగ్గుతాం. అదేవిధంగా చాలా రకాల ఆరోగ్య సమస్యలు కూడా పరిష్కరించగలం. మరి, అవి ఏ సీడ్సో ఇప్పుడు చూద్దాం..
గుమ్మడికాయ గింజలు
గుమ్మడికాయ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారికి గుమ్మడికాయ గింజలు చాలా మంచివి.
అవిసె గింజలు
అవిసె గింజలు ఒమేగా-3లకు అద్భుతమైన మూలం. ఇవి చెడు కొవ్వులను కరిగించడానికి, ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి ఫైబర్, ఐరన్, ప్రోటీన్‌లతో కూడా సమృద్ధిగా ఉంటాయి, ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. మీకు నచ్చిన విధంగా అవిసె గింజలను తీసుకోండి.
చియా గింజలు
చియా గింజల్లో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరంలోని కొవ్వును తగ్గించడానికి, ఆకలిని నియంత్రించడానికి, ఎక్కువసేపు శక్తినివ్వడానికి సహాయపడతాయి.
పొద్దుతిరుగుడు గింజలు
పొద్దుతిరుగుడు గింజలు బరువు తగ్గడానికి చాలా మంచివి. ఇవి విటమిన్ Eకి గొప్ప మూలం, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి. వీటిలోని మెగ్నీషియం శక్తినిస్తుంది, కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారికి పొద్దుతిరుగుడు గింజలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.